Latest Updates
-
అసలు సిసలైన పల్లీ చట్నీ.. ఒక్కసారి ఇలా చేసి చూడండి, మళ్లీ మళ్లీ కావాలంటారు! -
అక్టోబర్ 9న ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి శని.. ఏయే రాశుల తలరాత మారనుందంటే? -
కంటిచూపు మెరుగుపర్చి, జుట్టు రాలడం తగ్గించే అసలైన కరివేపాకు కారం పొడి..ఎలా చేసుకోవాలంటే.. -
Chanakya Niti in Telugu: ఎప్పుడు మాట్లాడాలి? ఎప్పుడు మౌనంగా ఉండాలి? -
అసలు సిసలైన నెల్లూరు పప్పులుసు..ఒక్కసారి రుచి చూస్తే వదలరు! -
Operation Firewall 2026: పాక్ ISI ని వణికించిన ఏపీ పోలీస్..దేశవ్యాప్తంగా ప్రశంసలు..వైజాగ్ లో ఏమైందంటే? -
ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలను అందించే సంజీవని..పల్లెటూరి స్టైల్ నల్ల కారం పొడి చేసుకోండిలా.. -
జిమ్ లేదు, కఠినమైన డైట్ లేదు..జపనీయుల టెక్నిక్ తో ఏకంగా 40 కిలోలు తగ్గిన ఖుష్బూ.. ఆ సీక్రెట్ ఏంటంటే? -
ఇడ్లీ, దోశల్లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. 15 నిమిషాల్లో అదిరిపోయే ఇడ్లీ కుర్మా..నాలుగు ఇడ్లీలు ఎక్కువే తింటారు! -
గ్యాస్ సమస్యలు రాని ఆరోగ్యకరమైన పెసరపప్పు వడ.. సింపుల్ గా ఇలా చేయండి!
పర్ఫెక్ట్ పార్టనర్ కోసం వెతుకుతున్నారా? అయితే మీరు ఈ నిజం తెలుసుకోవాల్సిందే!
ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలైనా, అమ్మాయిలైనా సరే కరెక్ట్,పరిపూర్ణమైన భాగస్వామి కోసం వెతుకుతూ చాలామంది పదే పదే తమ భాగస్వాములను మార్చుకుంటూ ఉంటున్నారు. కానీ, అసలు సమస్య ఎదుటివారిలో కాదు, మనలోనే ఉందని గ్రహించరు. మీ ఆలోచనలో, ప్రవర్తనలో ఒక చిన్న మార్పు చేసుకోగలిగితే.. ఎలాంటి బంధమైనా అద్భుతంగా, పరిపూర్ణంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆ మార్పులేంటో ఇక్కడ చూడండి.

వాదనల్లో గెలవడం కంటే బంధాన్ని గెలిపించండి
ప్రతి చిన్న వాదనలోనూ మీరే గెలవాలని పంతం పట్టకండి. ఇద్దరి మధ్య జరిగే గొడవలో ఒకరు గెలిచారంటే, అక్కడ వారి బంధం ఓడిపోయినట్లే లెక్క. మీ భాగస్వామి తప్పు అని నిరూపించడానికి మీ శక్తియుక్తులన్నీ వృథా చేసే బదులు, అసలు ఆ పరిస్థితుల్లో మీ ఉద్దేశ్యం ఏమిటో సున్నితంగా వివరించడానికి ప్రయత్నించండి. మీ మాటల వల్ల గానీ, ప్రవర్తన వల్ల గానీ మీ భాగస్వామి ఏ మాత్రం అవమానంగా భావించకూడదు. అప్పుడే బంధంలో గౌరవం నిలబడుతుంది.
మనసు చదివే విద్య ఎవరికీ రాదు
చాలా బంధాల్లో వచ్చే అతిపెద్ద సమస్య అంచనాలు. నేను చెప్పకపోయినా నా మనసులోని మాట నా భాగస్వామి అర్థం చేసుకోవాలి అని చాలామంది ఆశిస్తుంటారు. వారు అలా అర్థం చేసుకోలేకపోయినప్పుడు నిరాశ, కోపం మొదలవుతాయి. దయచేసి ఈ అవాస్తవిక ఆలోచనా విధానం నుండి బయటపడండి. చెప్పకుండానే ఎదుటివారి మనసును అర్థం చేసుకోవడం మంచిదే, కానీ అలా అర్థం చేసుకోకపోతే అది పెద్ద నేరమేమీ కాదు. దానికి బదులుగా, మీ భాగస్వామితో నిష్కపటంగా, మనసు విప్పి మాట్లాడండి. మీకు వారి నుండి ఏమి కావాలో స్పష్టంగా చెప్పండి.
కాలానుగుణంగా వచ్చే మార్పులను అంగీకరించండి
కాలంతో పాటు బంధంలో కూడా మార్పులు వస్తాయి. సంబంధం మొదలైన కొత్తలో ఉండే ఉత్సాహం, ప్రతి క్షణం కనెక్ట్ అయి ఉండటం, రోజంతా చాటింగ్ లు, కలిసి బయటకు వెళ్లడం.. ఇవన్నీ సహజంగానే జరుగుతాయి. కానీ కొంతకాలం తర్వాత వృత్తిపరమైన బాధ్యతలు, తీరికలేని పనుల కారణంగా మునుపటిలా శ్రద్ధ పెట్టలేకపోవచ్చు. దీన్ని పట్టుకుని నిందించుకోవడం బంధంలో పగుళ్లకు దారితీస్తుంది. సంబంధం పరిణతి చెందుతున్నా సరే, అప్పుడప్పుడూ చిన్న చిన్న క్షణాలను ప్రత్యేకంగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

పోలికలు వద్దు.. మీ బంధం ప్రత్యేకం
మిమ్మల్ని లేదా మీ బంధాన్ని వేరొకరితో పోల్చుకోవడం మానుకోండి. ప్రతి జంట, ప్రతి సంబంధం దేనికధే ప్రత్యేకం. వేరొకరి జీవితం బయటకు ఎంత అందంగా కనిపించినా లోపల ఎలా ఉందో మనకు తెలియదు. కాబట్టి అనవసరపు పోలికలు తెచ్చి మనశ్శాంతిని దూరం చేసుకోకండి. మీ మధ్య ఉన్న అందమైన క్షణాలను మనస్ఫూర్తిగా ఆస్వాదించండి.
అభిప్రాయ భేదాలు సహజం.. కానీ అగౌరవం వద్దు
ఇద్దరు వ్యక్తులు కలిసి జీవిస్తున్నప్పుడు ఏ విషయంపైనైనా అభిప్రాయ భేదాలు రావడం సహజం. కానీ ఆ విభేదాలు ఎప్పటికీ ఒకరినొకరు అగౌరవపరుచుకునే స్థాయికి చేరనివ్వకండి. కోపంలో తెలిసి మీ భాగస్వామిని తీవ్రంగా బాధపెట్టకండి. ఒకవేళ మీదే తప్పు అనిపిస్తే, ఇగో పక్కన పెట్టి మనస్ఫూర్తిగా సారీ చెప్పండి. ఈ ఒక్క మాట ఎన్నో సమస్యలను చిటికెలో తీరుస్తుంది.
ప్రేమ ఒక బాధ్యత.. ఆసరాగా నిలవండి
ప్రేమ అనేది కేవలం ఒక భావోద్వేగం కాదు, అదొక గొప్ప బాధ్యత. జీవితంలో ఎత్తుపల్లాలు వచ్చినప్పుడు ఆసరాగా నిలబడే ఒక భుజం లాంటిది. మీ భాగస్వామి మంచి రోజుల్లో మీరు వారితో లేకపోయినా పర్వాలేదు కానీ, వారు కష్టాల్లో, ఒడిదుడుకుల్లో ఉన్నప్పుడు మాత్రం వారికి తోడుగా నిలబడాలి. వారికి ఎల్లప్పుడూ దగ్గరగా, అండగా ఉండండి. కాబట్టి లోపాలు లేని పరిపూర్ణమైన భాగస్వామి కోసం వెతకడం మానేసి, ఇద్దరూ కలిసి బంధాన్ని పరిపూర్ణంగా మలచుకునే ప్రయత్నం చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.



Click it and Unblock the Notifications
