Latest Updates
-
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.!
అద్దెకు భార్యలు దొరికే ప్రదేశం.. అది కూడా చాలా తక్కువకే..ఎక్కడో తెలుసా?
మూడు ముళ్ల బంధంతో అప్పటివరకు విడివిడిగా వేర్వేరు ఇళ్లల్లో పెరిగినోళ్లు ఒకే ఇంట్లోకి వస్తారు. కలిసి ఒక ఇంట్లోనే జీవిస్తారు. కష్టమైనా,సుఖమైనా భార్యకు భర్త, భర్తకు భార్య తోడుగా ఉండేదే వివాహ జీవితం. భార్యాభర్తల బంధం అంటే ఏడు జన్మల అనుబంధం అని మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఏడడుగులు నడిచి, అగ్నిసాక్షిగా ఒక్కటయ్యే పవిత్రమైన బంధం అది. హిందూ సంస్కృతిలో వివాహానికి అంతటి విశిష్ట స్థానం ఉంది. అయితే అలాంటి పవిత్ర బంధానికి కొందరు రకరకాల రూపాల్లో తూట్లు పెడుతున్నారు అది వేరే విషయం.
ప్రపంచంలో ఒకచోట భార్యలు అద్దెకు దొరుకుతారంటే మీరు నమ్ముతారా? వినడానికి వింతగా, నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. తాళిబొట్టు కట్టకుండానే, ఏడడుగులు నడవడం వంటివేమీ లేకుండానే కేవలం డబ్బు చెల్లించి తాత్కాలిక భార్యను పొందే వింత ఆచారం ఒకచోట కొనసాగుతోంది. ఈ వింత సంప్రదాయాన్ని చూసేందుకు, అనుభవించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి పర్యాటకులు అక్కడికి క్యూ కడుతుంటారు. ఇంతకీ ఆ ప్రదేశం ఎక్కడ ఉంది..అక్కడ ఏం జరుగుతుందనే పూర్తి వివరాలను ఇక్కడ చూడండి.

భార్యలు అద్దెకు దొరికే ఆ వింత ప్రదేశం
ఈ వింత సంప్రదాయం ఉన్న ప్రదేశం మరెక్కడో కాదు థాయ్ లాండ్‌లోని ప్రముఖ పర్యాటక నగరం పట్టాయా. ఇక్కడి నైట్ లైఫ్ ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఈ నగరంలోనే వైఫ్ ఆన్ హైర్ (Wife on Hire) లేదా బ్లాక్ పెర్ల్ పేరుతో భార్యలను అద్దెకు తీసుకునే సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ప్రతి ఏటా కేవలం ఈ అద్దె భార్యల కోసమే పట్టాయాకు వచ్చే పర్యాటకుల సంఖ్య లక్షల్లో ఉంటుంది. ఇక్కడికి వచ్చే పురుషులు తమకు నచ్చిన మహిళను అద్దెకు తీసుకుని వారు కోరుకున్నన్ని రోజులు వారితో గడపవచ్చు. ఒకవేళ ఆ బంధం నచ్చితే వారిని శాశ్వతంగా వివాహం చేసుకునే అవకాశం కూడా ఉండటం ఇక్కడి మరో ప్రత్యేకత.
మహిళలు ఎందుకీ పని చేస్తున్నారు?
దీని వెనుక ఉన్న కారణాలు తెలిస్తే ఆశ్చర్యం కలగడం గ్ాయరెంటీ. "థాయ్ టాబూ - ది రైజ్ ఆఫ్ వైఫ్ రెంటల్ ఇన్ మోడరన్ సొసైటీ" అనే పుస్తకంలో దీని గురించి వివరంగా ప్రస్తావించారు. థాయ్ లాండ్ లోని చాలా మంది మహిళలు పేదరికం కారణంగా ఈ వృత్తిలోకి వస్తున్నారు. తమ కుటుంబాలను పోషించుకోవడానికి, ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడటానికి వారు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. నైట్ క్లబ్స్ లో పనిచేసే ఈ మహిళలు, అక్కడికి వచ్చే పర్యాటకులతో ఒప్పందాలు కుదుర్చుకుంటారు.

అద్దె ఎలా నిర్ణయిస్తారు?
ఇక్కడ అద్దె భార్యల రేటు వారి అందం, వయస్సు, విద్య, వారు ఎంతకాలం సేవలు అందిస్తారన్న దానిపై ఆధారపడి ఉంటుంది. అద్దె కొన్ని గంటల నుంచి మొదలై, కొన్ని రోజులు, నెలల వరకు ఉంటుంది. ఈ ఒప్పందం ప్రకారం అద్దెకు తీసుకున్న పురుషుడితో పాటు ఉండటం, వారితో కలిసి ప్రయాణాలు చేయడం, వారి బాగోగులు చూసుకోవడం వంటివి వారి బాధ్యతలు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఈ అద్దె భారత కరెన్సీలో సుమారు రూ. 1.3 లక్షల నుంచి మొదలై..కోటి రూపాయల వరకు కూడా ఉంటుంది. ఈ వింత ఆలోచన జపాన్, కొరియా దేశాల నుంచి వచ్చిందని చెబుతారు. ఆ దేశాలలో ప్రాచుర్యం పొందిన అద్దెకు గర్ల్ ఫ్రెండ్ (Rent-a-Girlfriend) సేవలను చూసి థాయ్‌లాండ్ తమ పర్యాటక రంగాన్ని పెంచుకోవడానికి దీనిని ప్రారంభించింది.



Click it and Unblock the Notifications
