Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
సరసం వల్ల ఇన్ని ప్రయోజనాలుంటాయా? ఎలా చేయాలంటే..
స్నేహితులతో కలిసి మీరు ఓ అందమైన కేఫ్ లో కూర్చున్నారు అనుకుంటే.. ఎదురుగా ఉన్న ఒక వ్యక్తి మిమ్మల్ని చూసి ఆకర్షణీయంగా నవ్వితే.. ఆ నవ్వులో ఏదో తెలియని ప్రత్యేకత ఉంటుంది. మీరు కూడా బదులుగా చిరునవ్వు చిందించారునుకోండి.. అలా చూపులు కలిసి, మాటలు మొదలయ్యాక ఆ క్షణంలో మీలో కలిగిన ఆనందం, ఉత్సాహం గమనించారా? అదే తేలికపాటి సరసం (ఫ్లర్టింగ్) సృష్టించే మ్యాజిక్.
సరసం అంటే కేవలం ప్రేమను వెతుక్కునే ప్రక్రియ మాత్రమే కాదు. అది మనసును తేలికపరిచే ఒక కళ. స్నేహితులతో జోకులు వేస్తూ ఆనందంగా గడపడం ఎంత ముఖ్యమో, ఈ మిశ్రమంలో కొద్దిపాటి ఆరోగ్యకరమైన సరసం కూడా అంతే అవసరం. ఇది మీలో ఆత్మవిశ్వాసం నింపడమే కాకుండా మానసిక ఆరోగ్యానికి ఒక టానిక్ లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

సరసంతో కలిగే సరదా ప్రయోజనాలు
ఆత్మవిశ్వాసానికి బూస్ట్
మన చుట్టూ ఉన్న ప్రపంచంలో విమర్శలు, తక్కువ అంచనాలు సర్వసాధారణం. అలాంటి సమయంలో ఎవరైనా మనల్ని చూసి చిరునవ్వు చిందించినా, మనతో మాట్లాడటానికి ఆసక్తి చూపించినా మనకు తెలియకుండానే ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. నేను ఆకర్షణీయంగా ఉన్నాను అనే భావన మనలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తుంది. మనల్ని మనం ఇష్టపడేలా చేసే ఈ చిన్న ప్రశంసను స్వీకరించడంలో ఎలాంటి తప్పు లేదు.
ఒత్తిడి మాయం
మనం సరదాగా సరసమాడినప్పుడు మన మెదడులో ఎండార్ఫిన్లు, డోపమైన్ వంటి సంతోషాన్నిచ్చే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మనలో ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా, తేలికగా మారుస్తాయి. అందుకే ఒక చిన్న సరదా సంభాషణ కూడా భారంగా ఉన్న మనసుపై చిరుజల్లులా పనిచేసి ఆ రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా ఉంచుతుంది. కార్యాలయాల్లో కూడా ఆరోగ్యకరమైన జోకులు, సరసాలు ఒత్తిడిని తగ్గిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇక్కడ మనం మాట్లాడుకునేది ఆరోగ్యకరమైన సరసం గురించే..వేధింపు గురించి కాదు.
సంభాషణా నైపుణ్యాలకు మెరుగు
సంభాషణ ఒక కళ అయితే సరసం ఆ కళకు మెరుగులు దిద్దే ఒక సరదా సాధనం. ఎదుటివారి మాటలను శ్రద్ధగా వినడం, సరైన సమయంలో హాస్యాన్ని జోడించడం, శరీర భాషను అర్థం చేసుకోవడం వంటి నైపుణ్యాలు దీనివల్ల మెరుగవుతాయి. ఈ నైపుణ్యాలు కేవలం సరసానికే కాదు మన దైనందిన జీవితంలోని అన్ని సంబంధాలలోనూ ఉపయోగపడతాయి.
ఆరోగ్యకరమైన సరసానికి కొన్ని సూత్రాలు
చిరునవ్వే తొలి పలకరింపు: మీ సంభాషణను ఒక హృదయపూర్వకమైన చిరునవ్వు, స్నేహపూర్వకమైన కంటిచూపుతో ప్రారంభించండి.
నిజాయితీగల అభినందన: పొగడ్తలు సున్నితంగా, నిజాయితీగా ఉండాలి. ఉదాహరణకు..మీ నవ్వు చాలా బాగుంది వంటివి.
హాస్యం జోడించండి: చిన్నపాటి హాస్యం వాతావరణాన్ని ఆహ్లాదకరంగా మారుస్తుంది.
హద్దులను గౌరవించండి: ఇది అన్నింటికన్నా ముఖ్యం. ఎదుటి వ్యక్తి అసౌకర్యంగా భావిస్తున్నారని అనిపిస్తే వెంటనే సంభాషణను ఆపండి. వారి భావాలను, సరిహద్దులను గౌరవించడం ప్రాథమిక సూత్రం.



Click it and Unblock the Notifications
