Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
భర్తలు ఈ తప్పులు చేయడం వల్లే.. భార్యలు వేరే వ్యక్తులను చూసుకుంటారట.. ఆ తప్పులు ఏంటంటే?
ఈరోజుల్లో పెళ్ళైన భార్య, భర్తలు వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. పుషరులు ఇతర స్త్రీల వైపు, మహిళలు ఇతర పురుషుల వైపు చూస్తున్నారు. దీని కారణంగా దాంపత్య జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి. అలాగే ఆ బంధం విడాకుల వరకు వెళ్తుంది. అయితే పురుషులు, స్త్రీలు ఇతరుల వైపు ఎందుకు చూస్తారు? భర్త స్త్రీ మోజులో పడడం, భార్య ఇతర పురుషుడి మైకంలో పడడానికి కారణం చాణక్యుడు వెల్లడించారు. ఆ కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక సంతృప్తి
వివాహ బంధం బలంగా ఉండాలంటే భార్య, భర్తలకు శారీరక సంతృప్తి అనేది చాలా ముఖ్యం. వివాహబంధంలో మీరు మానసికంగా బలంగా ఉన్నా, శారీరక సంతృప్తి లేకపోతే ఆ బంధంలో కల్లోలం తప్పదని చాణక్యుడు వెల్లడించారు. దంపతులు ఒకరినొకరు అర్ధం చేసుకోవడానికి, ఒకరికి ఒకరం ఉన్నామని భావన కలగాలంటే శారీరకంగా కలవడం తప్పనిసరి అని పేర్కొన్నారు. శారీరక సంతృప్తి లేకపోతే స్త్రీ, పురుషులకు ఇతరులవైపు ఆకర్షితులవుతారని, అలా వారి మధ్య దూరం పెరుగుతుందని వివరించారు.

చిన్న వయసులో పెళ్లి..
చాలా మందికి చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తూ ఉంటారు. ఆ వయసులో పెళ్లి చేయడం వల్ల వివాహ బంధంలో సమస్యలు వస్తాయట. చిన్న వయసులో పెళ్లి చేయడం వల్ల.. భార్య భర్తలకు వివాహబంధంపై ఎలాంటి అవగాహనా ఉండదట. ఈ వయసులో వారు కోరికలపై శ్రద్ధ చూపుతారని, దీంతో వేరే వ్యక్తుల వైపు ఆకర్షితులవుతారని పేర్కొన్నారు. దీంతో పాటు చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వల్ల బాధ్యతల నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. తద్వారా భాగస్వామితో గొడవలు మొదలై విడాకుల వరకు వెళ్తుందని చెప్పారు.
నమ్మకం..
ఏ బంధం అన్నా బలంగా ఉండాలంటే, ఎలాంటి గొడవలు లేకుండా బంధం కొనసాలాగంటే ఒకరిపై ఒకరికి నమ్మకం అనేది ఉండాలి. ముఖ్యంగా వివాహబంధంలో దంపతుల నమ్మకం చాలా ముఖ్యం. ఒకవేళ దంపతుల మధ్య నమ్మకం లేకపోతే వారిద్దరి మధ్య ప్రేమ ఉండదు, అనుమానం మాత్రమే ఉంటుంది. అందుకే భార్య, భర్తల మధ్య నమ్మకం ఉండాలంటున్నారు. లేకపోతే విడాకులు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుందని చెబుతున్నారు.
మార్పు..
దంపతులు ఇద్దరూ తల్లిదండ్రులు అయ్యేంత వరకు వారి మధ్య ప్రేమ అమితంగానే ఉంటుంది. సాధారణంగా మనం ఇది చూస్తూనే ఉంటాం. అయితే పిల్లలు పుట్టిన తరువాత ఇద్దరు తమ ప్రేమను పిల్లలపైనే చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా భార్య తన ప్రేమను పిల్లలపైనే చూపించడంతో పురుషుడు వేరే స్త్రీవైపు ఆకర్షితుడు అవుతాడని, తద్వారా బంధంలో ఎడబాటు మొదలవుతుందని చెప్పుకొచ్చారు.
సమయం కేటాయించకపోవడం..
భార్య భర్తల మధ్య దూరం తగిన సమయం కేటాయించకపోవడం వల్ల కూడా పెరుగుతుంది. భార్య భర్తలు ఎప్పుడైతే తమ భాగస్వామికి తగిన సమయం కెటాయించరో అప్పుడు వారి మధ్య గొడవలు మొదలవుతాయని, అవి క్రమంగా ద్వేషంగా మారుతాయంటున్నారు. అందుకే భార్య భర్తలు ఇద్దరూ తమ భాగస్వామికి తగినంత సమయం కేటాయించాలని, లేకపోతే వివాహ బంధం తప్పనిసరిగా వివాహేతర బంధం వైపు అడుగులు వేస్తుందని నీతిశాస్త్రంలో ఉంది.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు చాణక్య నీతి శాస్త్రం, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని అనుసరించడం లేదా వీటిని పాటించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీంతో బోల్డ్‌స్కైకి ఎలాంటి సంబంధం లేదు.



Click it and Unblock the Notifications