Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
Alpha Husband: అధికారం చెలాయించే భర్తతో వేగడం చాలా కష్టం.. ఈ చిట్కాలు పాటించండి
అధికారం చెలాయించే భర్తతో ఎలా వ్యవహరించాలి, అజామాయిషీ ప్రవర్తన ఉండే భర్త నుండి ఎలా ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దాంపత్య బంధంలో భార్యభర్తలు ఇద్దరూ సమానమే. కానీ కొందరు భర్తలు భార్యలపై అధికారం చెలాయిస్తారు. అజమాయిషీగా ప్రవర్తిస్తారు. అధికారం చెలాయించే భర్తలనే ఆల్ఫా హస్బెండ్ అంటారు. అజమాయిషీ చెలాయించే భర్తలతో అదే రీతిలో మాట్లాడితే గొడవలు జరుగుతాయి. పోని అని ఊరుకుంటే ఆత్మ గౌరవం కోల్పోవాల్సి వస్తుంది.

అధికారం చెలాయించే భర్తతో ఎలా వ్యవహరించాలి, అజామాయిషీ ప్రవర్తన ఉండే భర్త నుండి ఎలా ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

అతిగా ఆధారపడొద్దు:
ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా భర్తలపై ఆధారపడే భార్యలు అంటే కొందరికి చులకన భావం ఉంటుంది. ఆర్థిక స్వేచ్ఛ్ ఉన్న మహిళలతో పోలిస్తే తమపై అతిగా ఆధారపడే భార్యల విషయంలోనే చాలా మంది భర్తలు అధికారం చెలాయిస్తంటారు. వారి అభిప్రాయాలకు, వారి నిర్ణయాలకు, వారి ఆలోచనలకు ఏమాత్రం విలువ ఇవ్వరు.
భార్యలు ఇంట్లో కూర్చుని తింటారని భావిస్తుంటారు, అందరి ముందు వారిని అలాగే ఎగతాళి చేస్తుంటారు. చీటికి మాటికి తిట్టడం లాంటి చేసే భర్తల వల్ల భార్యలు చాలా కుమిలిపోతుంటారు.
అయితే భర్త వేధింపులను భరించాల్సిన అవసరం లేదు. ఏదైన పని చేసి ఆర్థికంగా తమ కాళ్లపై నిలబడే ప్రయత్నం చేయాలి. చదువు ఉంటే ఉద్యోగం చేయవచ్చు. చదువులేకపోతే ఏదైనా ఒక దాంట్లో ఉన్న టాలెంట్‌తో చిన్న వ్యాపారం ప్రారంభించవచ్చు. కుట్టుపని కూడా చేసి ఎంతో కొంత సంపాదించవచ్చు. ఇలా మీ కాళ్లపై మీరు నిలబడగలిగితే ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం రెట్టింపు అవుతాయి. ఆర్థికంగా సంపాదించగలిగితే చులకన భావం కూడా పోతుంది.

ప్రశాంతంగా చెప్పి చూడండి:
దంపతుల మధ్య గొడవలు కామన్. సాధారణంగా కలహాలు జరుగుతూనే ఉంటాయి. అయితే ఎన్ని గొడవలైనా, ఎంత పెద్ద కలహమైనా కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం చాలా మంచిది. కొందరు కోపంలో విపరీతంగా ప్రవర్తిస్తుంటారు. ఆవేశంలో ఉన్నప్పుడు వారిని చిన్నగా మాట్లాడించినా అరుస్తుంటారు. కోపంలో అనరాని మాటలు అనేస్తుంటారు. అందుకే వారు ప్రశాంతంగా ఉన్నప్పుడు మాట్లాటాలి.
అధికారం చెలాయించే తన తీరు వల్ల మీరు ఎంతగా ఇబ్బంది పడుతున్నారో సావధానంగా వివరంగా చెప్పాలి. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుంటే మీరు, పిల్లలు ఎంత బాధ పడుతున్నారో విడమరిచి చెప్పాలి.
ఇలా ప్రశాంతంగా చెప్పడం వల్ల వారు ఉన్నట్టుండి కాకపోయినా మెల్లిగా అయినా మారతారు.

ఆత్మగౌరవం కోల్పోవద్దు:
భర్తల విపరీత ప్రవర్తనతో చాలా మంది భార్యలు ఆత్మగౌరవం కోల్పోతారు. ఆత్మన్యూనతకు గురవుతారు. వేరే దంపతులతో పోల్చుకుని బాధపడుతుంటారు. ఈ ఆలోచనలో ఒత్తిడికి దారితీస్తాయి. ఒత్తిడి శారీరకంగా, మానసికంగా ప్రభావం చూపిస్తుంది. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఇలాంటి సమయంలో అతిగా కుంగిపోవద్దు. మీపై మీరు నమ్మకం కోల్పోవద్దు. ఆత్మగౌరవం కోల్పోకుండా చూసుకోవాలి. నచ్చిన పనులు చేయడం, ఇష్టమైన అలవాట్లపై దృష్టి పెట్టాలి.

నిపుణుల సాయం తీసుకోవాలి:
భర్తలు కోపంగా, అధికారం చెలాయిస్తూ మాట్లాడుతుంటే మనకూ కోపం వస్తుంది. కానీ ఎదుటివారు కోపంలో ఉన్నప్పుడు మీరూ అదే రీతిలో మాట్లాడితే గొడవ పెద్దదవుతుంది. చిన్న సమస్య కాస్త పెద్దగా మారుతుంది.
మీ భర్త తీరు మిమ్మల్ని మరీ ఇబ్బంది పెడుతుంటే, మార్చడానికి చేసిన ప్రయత్నాలు ఏవీ ఫలించకపోతే ఆఖరి ప్రయత్నంగా నిపుణుల సాయం తీసుకోవాలి. మానసిక నిపుణుల దగ్గరికి కౌన్సెలింగ్ వెళ్లాలి.



Click it and Unblock the Notifications