Latest Updates
-
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.! -
రిలేషన్షిప్లో మహిళలు నిజంగా ఏం కోరుకుంటారు.. టాప్ 5 సీక్రెట్స్ ఇవే.! -
నోరూరించే స్వచ్ఛమైన పాలకోవా.. కేవలం 3 పదార్థాలతో మీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
సంతానోత్పత్తికి అడ్డంకిగా ఫెలోపియన్ ట్యూబ్స్ బ్లాకేజీ.. మహిళల్లో ఈ సమస్యను ఎలా నివారించాలి.! -
ఎటు చూసినా కష్టాలేనా? ఈ పవర్ ఫుల్ మంత్రాలు చదివితే లైఫ్ ఛేంజ్! -
ప్రపంచ మెదడు దినోత్సవం.. బ్రెయిన్ హెల్త్‌కి, విటమిన్ బి1కి సంబంధం ఉందా.. ఈ లక్షణాలు కనిపిస్తే చాలా డేంజర్.!
హార్దిక్ పాండ్యా, నటాషఆ విడాకులు, జీవితం ముగిసిపోకముందే ఇలా త్వరగా బయటపడండి
పెళ్లయిన నాలుగేళ్ల తర్వాత భారత ప్రముఖ క్రికెటర్ హార్దిక్ పాండ్యా, నటి నటాషా విడాకులు తీసుకున్నారు. ఈ నివేదికను హార్దిక్ పాండ్యా ధృవీకరించారు. ఈ విషయాన్ని క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ విడాకుల గురించి సమాచారం ఇచ్చాడు. నటి నటాషా స్టాంకోవిచ్, హార్దిక్ పాండ్యా విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని క్రికెటర్ హార్దిక్ పాండ్యా స్వయంగా ధృవీకరించాడు.
గత కొన్ని రోజులుగా హార్దిక్ పాండ్యా, నటి నటాషా ఇద్దరూ విడిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. నటి నటాషా ఆమె కొడుకుతో కలిసి ఇటీవల విదేశాల్లో ఉంటున్న ఆమె తల్లిదండ్రుల ఇంటికి వెళ్లింది. అంబానీ పెళ్లిలో కూడా హార్దిక్ పాండ్యా ఒక్కడే కనిపించాడు. ఈ విషయంపై హార్దిక్ పాండ్యా సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ను షేర్ చేస్తూ తమ విడాకుల నిర్ణయం ఇద్దరికీ ఎంత కష్టమో అనే విషయం అభిమానులతో పంచుకున్నాడు.

ఈ విషయాన్ని హార్దిక్ పాండ్యా స్వయంగా పోస్ట్ చేశాడు. ఈ పోస్ట్‌లో హార్దిక్ పాండ్యా తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ పోస్ట్‌లో హార్దిక్ కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు. నాలుగు సంవత్సరాల పాటు కలిసి జీవించామని, ఇప్పుడు నటాషా, నేను పరస్పర అంగీకారంతో విడిపోవాలని నిర్ణయించుకున్నామని, కలిసి ఉండటానికి మేము మా వంతు ప్రయత్నం చేసామని, ఈ సంబంధాన్ని కాపాడుకోవడానికి ప్రతిదీ పరిశీలించామని, కానీ ఇప్పుడు విడాకులు తీసుకోవడమే మా ఇద్దరికీ సరైన నిర్ణయం అని మేము భావిస్తున్నాము అని ఆపోస్టులో హార్దిక్ పాండ్యా వివరించాడు.
ఇది మాకు చాలా కష్టమైన నిర్ణయం, కలిసి గడిపిన సంతోషకరమైన క్షణాలు, పరస్పర గౌరవం, మా ఇద్దరి సానిహిత్యం, మేము కలిసి గడిపిన ప్రతిక్షణాన్ని మేము కుటుంబంగా ముందుకు తీసుకెళ్లాము.
మా జీవితాల్లో కొడుకు ఉండటం మా అదృష్టం, అతను మా జీవితానికి పునాదిగా ఉంటాడు, ఇద్దరూ కలిసి మా కొడుకును చూసుకుంటాం, ప్రపంచంలో అందుబాటులో ఉన్న అన్ని ఆనందాలను, సంతోషాలను అతనికి అందించడానికి మేము మా శాయశక్తులా ప్రయత్నిస్తాము అని క్రికెటర్ హార్దిక్ పాండ్యా వివరించాడు.
మా కొడుకు ఆనందం కోసం మేము చేయగలిగినదంతా చేస్తాము. ఈ క్లిష్ట సమయంలో మా వ్యక్తిగత జీవితంపై మీ మద్దతు మేము ఆశిస్తున్నాము. మా సంబంధాన్ని ముగించడం చాలా పెద్ద విషయం. అయితే జీవితంలో ఇలాంటి కష్టాలను ధైర్యంగా ఎదుర్కోవచ్చు. దాని కోసం మీరు మా వ్యక్తిగత జీవితాలపై ఎక్కువ చర్చ పెట్టకూడదని కోరుకుంటున్నానని క్రికెటర్ హార్దిక్ పాండ్యా ఆయన అభిమానులకు సోషల్ మీడియాలో మనవి చేశారు. విడాకులు తీసుకున్న వాళ్లు ఇలాంటి మార్పుతో త్వరగా ఆమూడ్ లో నుంచి బయటకు రావడానికి అవకాశం ఉంటుంది.

మీకు సహాయం కోసం ఒకరు ఉండాలి
విడాకులు తీసుకున్న తరువాత ఆ వ్యక్తి పూర్తిగా కలవరపడతాడు. ఈ సమయంలో అతనికి సహాయక వ్యవస్థ చాలా అవసరం. ఈ చెడుదశలో విడాకుల తర్వాత మీరు ఎక్కువగా విశ్వసించగల వ్యక్తులను గుర్తించండి. మీరు విచారంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి మీకు అండగా నిలవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీ ఒంటరి తనం నుంచి బయటపడి మీరు విడాకులు తీసుకున్న విషయం నుంచి త్వరగా బయటపడటానికి అలాంటి వ్యక్తులు సహాయపడుతారు.
మార్పును అంగీకరించండి
ఉద్యోగం, ఇల్లు లేదా మీరు నివాసం ఉంటున్న నగరం మారుతున్నా మీలో మార్పు సవాలుతో కూడుకున్నదే. విడాకులు తీసుకున్న తరువాత మీకు కొత్త జీవితం ఉందని అంగీకరించండి. అనేక సమస్యలు ఉన్నప్పటికీ మీరు ఈ జీవితంలోని మార్పులను మరియు సవాళ్లను తెలివిగా ఎదుర్కోవచ్చు.
సహాయం పొందాలి
విడాకులు తీసుకున్న తరువాత జీవితంలోని మార్పులతో పోరాడుతున్నట్లయితే స్నేహితులు లేదా కుటుంబ సభ్యుల నుండి సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఒంటరితనం చాలా వరకు దూరం అవుతుంది.

జీవితం ఆనందించండి
విడాకులు తీసుకున్నట్లయితే, ఆ వ్యక్తి తన భాగస్వామి మరొక భాగస్వామినిని వెతుక్కుంటారు. అంటే మీరు ఆలోచించాలి. మీరు ఇప్పటికీ ఒంటరిగా ఉన్నారు అంటే మీ గురించి ఆలోచించాలి, దాని గురించి విచారంగా లేదా కలత చెందకుండా మీ జీవితాన్ని కొత్తగా ప్రారంభించేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి బయటకు వెళ్లండి లేదా స్నేహితులతో కలిసి సరదాగా గడపడానికి ప్రయత్నించండి.
విశ్వసించడం నేర్చుకోండి
విడిపోయిన తర్వాత కొత్త సంబంధాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు. అయినప్పటికీ మీ హృదయాన్ని బలపరుచుకోండి మరియు గత చేదు అనుభవం నుండి బయటకు రావడానికి ప్రయత్నించండి. మీ సంబంధం విడిపోవడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీ గత అనుభవాలు గుర్తు పెట్టుకుంటే భవిష్యత్తులో తప్పుడు సంబంధాలు మీ జీవితంలోకి రాకుండా మిమ్మల్ని కాపాడతాయి. విచ్ఛిన్నమైన మీ సంబంధం యొక్క బాధను మరచిపోండి. ముఖ్యంగా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం నేర్చుకోండి.
మీ మీద దృష్టి పెట్టండి
విడాకుల తర్వాత, చాలా మంది తమపై దృష్టి పెట్టడం మానేస్తారు. అలాంటి వ్యక్తులు తమకు తాముగా సమయాన్ని కేటాయించరు. లేదంటే తమను తాము చూసుకోవడానికి ఇష్టపడరు. వారు ప్రతిచోటా నిరాశ, నిస్సహాయతను చూస్తారు. మిమ్మల్ని మీరు ఎక్కువగా ప్రేమించుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోయి నీ మీదే దృష్టి పెట్టండి. ఇంట్లో చక్కగా డ్రెస్ చేసుకోండి. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లండి.

కొత్త సంబంధంలోకి ఎందుకు తొందరపడాలి?
విడాకుల తర్వాత మీకోసం మీరు వీలైనంత ఎక్కువ సమయం కేటాయించుకోండి. మీరు కొత్త సంబంధంలోకి వెళ్లాలని ఆలోచిస్తుంటే తొందరపడకండి. విడాకులు తీసుకున్న వెంటనే కొత్త సంబంధాన్ని ఏర్పరచుకోవడం మీ హృదయ వేదనను మరింత పెంచుతుంది.
కాబట్టి విడాకులు తీసుకున్న తరువాత కొత్త సంబంధంలోకి వెళ్లే ముందు నెమ్మదిగా ఆలోచించి సరైన నిర్నయం తీసుకోండి. ఎందుకంటే మీరు తొందరపడితే పాత సమస్యలు మళ్లీ మిమ్మల్ని వెంటాడే అవకాశాలు ఉంటాయి.



Click it and Unblock the Notifications