Latest Updates
-
షుగర్ వచ్చే ముందు మీ బాడీ చూపించే 5 సంకేతాలు ఏంటో తెలుసా! -
బుధ అస్తమయం: సెప్టెంబర్ 18 వరకు ఈ 4 రాశుల వారికి గడ్డుకాలమే..ఆఫీసులో, వ్యాపారంలో ఊహించని కుట్రలు! -
చాతుర్మాస్య స్పెషల్: ఉల్లి, వెల్లుల్లి లేకుండానే అద్భుతమైన రుచినిచ్చే ఆల్ రౌండర్ మసాలా ఇంట్లోనే చేసుకోండిలా.. -
రక్షాబంధన్ 2026: రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు తీసేయాలి.. శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.! -
అమ్మవారికి నైవేద్యంగా బెల్లపు పరమాన్నం.. ఈ టెక్నిక్‌తో పాలు విరిగిపోవు, గట్టిపడదు.! -
సన్నగా ఉండే వారిలోనూ ఫ్యాటీ లివర్.. ఒంట్లో కొవ్వు లేకపోయినా ఈ రిస్క్ తప్పదు.! -
కూరతో పనిలేదు.. నిమిషాల్లో తయారయ్యే సూపర్ టేస్టీ బెండకాయ రైస్..లంచ్ బాక్స్ లోకి సూపర్! -
ఉపవాసం ఉంటే క్యాన్సర్ కణాలు చనిపోతాయా? -
ఉపవాసం తర్వాత మహిళలకు తక్షణ శక్తినిచ్చే ఫ్రూట్ టిక్కీ.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసేయండి.! -
కేవలం 10 నిమిషాల్లో సూపర్ టేస్టీ మసాలా బ్రెడ్ టోస్ట్..ఎలా చేసుకోవాలంటే..
Sexual Therapy: మీ భాగస్వామితో శృంగారాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నారా? దీంతో రాటుదేలిపోవచ్చు
భార్యాభర్తల మధ్య శృంగారం ఎంత ఆనందంగా, హాయిగా ఉంటుందో.. కొన్ని సార్లు అంతే సంక్లిష్టంగానూ ఉంటుంది. శృంగారాన్ని సరైన రీతిలో ఆస్వాదించడం ఓ కళ. అది అలవర్చుకుంటే దాంపత్యబంధం చాలా హాయిగా ఉంటుంది.

అయితే చాలా జంటలు వివిధ కారణాల వల్ల లైంగిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతారు. భార్యాభర్తల మధ్య సెక్స్ లేకపోవడం వల్ల ఇతర సమస్యలూ వస్తాయి. ఇద్దరి మధ్య సాన్నిహిత్యం దెబ్బతింటుంది. ఈ శృంగార సమస్యలను థెరపీతో పరిష్కరించవచ్చని చెబుతున్నారు నిపుణులు. అసలు సెక్సువల్ థెరపీ అంటే ఏంటి.. ఇది ఎవరికి అవసరం.. ఈ థెరపీ వల్ల లైంగిక కోరికలు పెరుగుతాయా.. జంటలు దీన్నెలా పాటించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సెక్స్ థెరపీ అంటే ఏంటి?
దంపతుల మధ్య ఎలాంటి సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటిని మాటల ద్వారానే పరిష్కరించే ప్రయత్నం చేస్తారు వైద్యులు. వ్యక్తిగతంగా లేదంటే జంటగా దీనికి హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో జంట ఎదుర్కొంటున్న లైంగిక సమస్యల గురించి థెరపిస్టులు అడిగి తెలుసుకుంటారు. ఆరోగ్యపరంగా, మానసికపరంగా, వ్యక్తిగతంగా.. అన్ని కోణాల నుండి సమస్యల్ని పసిగట్టేందుకు ప్రయత్నిస్తారు నిపుణులు. వాటిని ఆధారంగా పరిష్కార మార్గాల్ని సూచిస్తారు.
సెక్స్ థెరపీ ఎవరికి అవసరం?
భార్యాభర్తలు శృంగారాన్ని ఆస్వాదించలేకపోవడానికి చాలా అంశాలు కారణం అవుతాయి. ఆలుమగల్లో ఇద్దరిలోనూ సమస్యలు ఉండొచ్చు, లేదంటే ఒక్కరిలోనే సమస్య ఉండొచ్చు. ఒకరికి కోరికలు ఎక్కువగా ఉండటం, మరొకరికి లేకపోవడం, శృంగార సమయంలో ఆత్మవిశ్వాసం లేకపోవడం, ఇతర ఆలోచనల వల్ల ఒత్తిడి, ఆందోళన, బలవంతపు సెక్స్, గత అనుభవాల వల్ల శృంగారం అంటే భయం లాంటి రకరకాల కారణాల వల్ల శృంగారానికి దూరంగా ఉంటారు.
అసలు సమస్య ఎక్కడ ఉంది, దానికి కారణాలేంటి, శృంగారం గురించి ఎంత వరకు తెలుసు, శృంగారం విషయంలో నమ్మకాలు, అపోహలు ఏంటి తదితర విషయాలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత దానిని బట్టి థెరపీ మొదలు పెడతారు. కాబట్టి సెక్స్ థెరపీలో వైద్యులతో ప్రతి ఒక్క విషయాన్ని స్పష్టంగా, ఏదీ దాచుకోకుండా చెప్పగలగాలి. అప్పుడే సరైన చికిత్స ఇవ్వగలుగుతారు.
కమ్యూనికేషన్ కీలకం:
భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ చాలా కీలకం. అనుబంధం, సాన్నిహిత్య పెరగడానికి భార్యాభర్తలు ఇద్దరూ సిగ్గు, మొహమాటం, సంకోచం లేకుండా స్పష్టంగా మాట్లాడుకోవాలి. మనసులో ఏదీ దాచుకోకుండా భాగస్వామికి భావాలు, భావోద్వేగాల గురించి చెప్పాలి. అప్పుడే ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ ఉందని అర్థం.
మీ కోరికలను స్పష్టంగా చెప్పినప్పుడే ఎదుటి వారికి ఎలా మెలగాలో అర్థమవుతుంది. వారి కోరికలు ఏంటో తెలుసుకుంటేనే మీరు ఎలా వ్యవహరించాలో తెలుస్తుంది. లైంగిక పరమైన విషయాల గురించి తరచూ చర్చించుకోవాలి. ఒకరి ఇష్టాయిష్టాలను మరొకరు తెలుసుకుంటూ ఉండలి. భార్యాభర్తలు ఇద్దరు కలిసి రొమాంటిక్ సినిమాలు చూడటం, శృంగార ఆటలు ఆడటం, నవలలు చదవడం వల్ల సాన్నిహిత్యం పెరగడంతో పాటు శృంగార విషయాలను నిర్మొహమాటంగా మాట్లాడగలుగుతారని రిలేషన్ షిప్ ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నారు.
Disclaimer: ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications