Latest Updates
-
అమ్మమ్మల నాటి అమృతం.. వేసవిలో ఒంటికి చలువ చేసే తరవాని చారు -
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే!
అది అంబానీ కొడుకైనా..సాదాసీదా వ్యక్తియైనా భార్య భర్తల మధ్య సంబంధం స్ట్రాంగ్ గా ఉండాలంటే 5 రహస్యాలు
హిందూ సంప్రదాయంలో వివాహం అనేది చట్టబద్దమైన , సామాజికంగా ఆమోదించబడిన వేడుకు. వివాహాలు స్వర్గంలోనే జరుగుతాయని అంటారు. స్వర్గంలోనే కాదు, భూమి మీద కూడ జరగుతాయి. ఎందుకంటే వివాహం మీద అంత నమ్మం ఉంది. వివాహ బంధంతో స్త్రీ పురుషులు జీవితకాలం కలిసి జీవించడానికి ఇది ఆయా సంప్రదాయల ప్రకారం జరుపుకునే ఒక వేడుక. ఇది ఇద్దరు వ్యక్తుల మద్య భౌతిక, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా సంబంధం కలిగి ఉంటుంది.. భారతదేశంలో, రెండు కుటుంబాలను కలిసి వివాహం జరుపుతారు. పురాతన కాలం నుండి, వివాహాలు పండుగల మాదిరిగానే వేడుకగా జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది, ఇందులో అనేక ఆచారాలు మరియు సంప్రదాయాలు అనుసరించబడతాయి.
వైవాహిక జీవితంలో ప్రేమ, నమ్మకం, భద్రత, పరస్పర గౌరవం, నిబద్దత మరియు ఐక్యత ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇవి ముఖ్యమైన విషయాలు. వివాహం అనేది కేవలం ఒకటం అవ్వడమే కాదు, జీవితకాల బంధం. వేదమంత్రోచ్చారణతో ఒక్కటయ్యే జంటలు అగ్ని సాక్షిగా ప్రమాణాలు చేసుకుంటారు. ఈ క్రమంలో రీసెంట్ గా ప్రపంచ కుబేరుడు ముకేశ్ అంబానీ చిన్నకుమారుడు అనంత్ అంబానీ రాధిక మర్చంట్‌కి చాలా సింపుల్ వాగ్దానం చేశాడని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అనంత్ చర్యను అందరూ మెచ్చుకుంటున్నారు. అయితే అనంత్ ఏం చేశాడో తెలుసుకుందాం.

వివాహ వేడుకలో రాధిక మర్చంట్‌తో అనంత్ అంబానీ సంబంధానికి సంబంధించిన 6 ముఖ్యమైన విషయాలు ప్రతిజ్ఞ చేశాడు. కోటీశ్వరుడు ముఖేష్ అంబానీ కొడుకు అయినప్పటికీ రాధికకు అనంత్ చేసిన సాదాసీదా వాగ్దానం అక్కడ వేదికలో ఉన్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. అంబానీ కుటుంబానికి ఇది సాధారణ వాగ్దానమే కావచ్చు కానీ సామాన్యులకు మాత్రం చాలా విలువైనది. అనంత్ అంబానీ మరియు రాధిక మర్చంట్ నుండి నేర్చుకోవలసిన 5 రిలేషన్ షిప్ లెసెన్స్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
అనంత్ అంబానీకి రాధిక మాట
అనంత్ రాధిక పెళ్లికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది, ఇందులో వారిద్దరూ ఒకరికొకరు లిఖితపూర్వక ప్రమాణాలు చేసుకున్నారు. రాధిక మాట్లడుతూ మన ఇల్లు ఒక ప్రదేశం మాత్రమే కాదు, ప్రేమ మరియు కలిసి ఉండే భావన అని రాధిక చెప్పారు. మనం ఎక్కడ ఉన్నామన్నది కాదు, మనం ఎలా ఉన్నాం అనేది ముఖ్యం, మనం ఎప్పుడు ఇలాగే ఉండాలన్నది నా కోరిక. మనం ఉన్నచోటే ఇల్లు. రాధిక మర్చంట్ నుండి ఈ మాట విన్న తర్వాత, అనంత్ అంబానీ కూడా ఆమెకు హామీ ఇచ్చారు.
అనంత్ మాట్లాడుతూ- 'రాధిక, శ్రీ కృష్ణుడి ఆశీస్సులతో, మనం కలలు కన్న ఇంటిని మనం కలిసి నిర్మిస్తామని వాగ్దానం చేస్తున్నాను. మన ఇల్లు ఒక ప్రదేశం మాత్రమే కాదు, మనం ఎక్కడ ఉన్నా ప్రేమ భావన ఉంటుంది. దీన్ని బట్టి వైవాహిక జీవితంలో ఎలా ఉండాలన్నది మీరు కొన్ని విషయాలు తెలుసుకోండి.
ఒకరినొకరు నిరంతరం ప్రశంసించుకోవడం
వేర్వేరు వివాహ వేడుకల నుండి వైరల్ అయిన వీడియోలలో, వారి ప్రసంగాలలో ఇద్దరూ ఒకరినొకరు ప్రశంసించుకోవడం మరియు గౌరవించడం కనిపిస్తుంది. ఏ ప్రేమ సంబంధంలోనైనా, ఒకరికొకరు గౌరవం మరియు ప్రేమను ఎప్పటికప్పుడు చూపించాలి. అనంత్, రాధిక మధ్య రిలేషన్‌షిప్‌లో పరస్పర గౌరవమే గొప్పదనం.

ఒకరి కుటుంబం పట్ల మరొకరు గౌరవం
రాధిక మర్చంట్ అంబానీ ఫ్యామిలి పట్ల చాలా గౌరవంగా ఉంటుంది. అదే విధంగా అనంత కూడా రాధిక మర్చంట్ ఫ్యామిలి అంటే ఎంతో గౌరవం. ఇద్దరు కూడా ఇరు కుంటుంబ సభ్యలును మర్యాదపూర్వకంగా ఉండటాన్ని మనం ప్రతి వీడియోలో చూశాము. ముఖ్యంగా అనంత్ కు తన కుటుంబమే అతనికి సర్వసం. కాబట్టి ఒకరి కుటుంబాన్ని ఒకరు గౌరవించుకోవడం మంచిది.
ప్రతి భార్య కల
ప్రతి అమ్మాయి తల్లితండ్రి తన కుటుంబాన్ని వదిలి వేరే ఇంటికి వెళ్లినప్పుడు, ఆమె భర్త ఆమెకు కలలు కన్న కుటుంబాన్ని ఏర్పరుస్తానని హామీ ఇస్తాడు. ప్రేమ మరియు విశ్వాసంతో మాత్రమే నిండిన మన స్వంత ప్రపంచాన్ని సృష్టిద్దాం, కలిసి కొత్త ప్రారంభాన్ని చేద్దాం. ఇంటికి ఎటువంటి హాని జరగకూడదనే ఐక్యత ఉండాలి. ఇద్దరూ జీవితాంతం ఒకరితో ఒకరు జీవించాలి.
ఒకరినొకరు గౌరవించుకోవాలి
తల్లిదండ్రులు, భర్త, సోదరుడు, సోదరి ఇలా ఏదైనా బంధం బతకాలంటే ఒకరినొకరు గౌరవించుకోవాలి. మీరు మీ భాగస్వామిని గౌరవించాలి. అతని చిన్న విషయాలను పట్టించుకోకపోయినా, కానీ అతను చెప్పే ప్రతిదాన్ని జాగ్రత్తగా వినండి. మంచి-చెడు నిర్ణయం తీసుకోండి. మీరు సంబంధాన్ని గౌరవించడం ద్వారా మాత్రమే దాని పునాదిని బలోపేతం చేయవచ్చు.
ఒకరికొకరు సమయం, మద్దతు తెలపండి
అనంత్ అంబానీ చాలా కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు చాలా సందర్బాల్లో చెప్పాడు. అనారోగ్య సమస్య కారణంగా తీసుకున్న స్టెరాయిడ్ వల్ల అతను తన బరువు గురించి ఎప్పుడూ ఆందోళన చెందుతాడు. కానీ రాధిక మర్చంట్ అతని వ్యక్తిగత జీవితంలో చాలా కాలంపాటు ఉండటం వల్ల అవేవి ఆమె పట్టించుకోలేదు. ఆమె అతని చెయ్యి పట్టుకుని చూసుకుంటూ చాలా ప్రేమగా చూసుకోవడం కనిపిస్తుంది. ఏ ప్రేమ సంబంధంలోనైనా, ప్రతి సందర్భంలోనూ తన భాగస్వామికి బేషరతుగా మద్దతు ఇస్తుంది.
అపార్థం చేసుకోకండి
కలిసి ఎక్కువ సమయం గడిపినప్పుడు అపార్థాలు సాధారణం. కానీ అవి సమయానికి ముగియకపోతే, అది రిలేషన్ షిప్ విడిపోవడానికి అతిపెద్ద కారణం అవుతుంది. మీ ఇద్దరి మధ్య ఏదైనా అపార్థం ఉంటే, మీ భాగస్వామితో బహిరంగంగా మాట్లాడండి. ఇది సంఘర్షణకు కారణాన్ని వెల్లడిస్తుంది మరియు దానిని సరిదిద్దడానికి కూడా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications











