బ్రేకప్ తర్వాత కూడా..మాజీ లవర్ సోషల్ మీడియా ప్రొఫైల్స్ ఎందుకు చూస్తారు?

ఈ రోజుల్లో ప్రేమలు ఎంత వేగంగా పుడుతున్నాయో..అదే సమయంలో బ్రేకప్ లు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. అయితే బ్రేకప్ జరిగి నెలలు, ఏళ్లు గడుస్తున్నా.. చాలామంది చేసే ఒకే ఒక పని.. తమ మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి సోషల్ మీడియా ప్రొఫైల్‌ ను దొంగచాటుగా గమనించడం.

ఇలా తమ మాజీ లవర్ ప్రొఫైల్స్ చూస్తున్నారంటే.. వాళ్లను మళ్లీ తమ జీవితంలోకి ఆహ్వానించాలని అనుకుంటున్నారేమో అని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ అది వంద శాతం నిజం కాదు. ఈ అలవాటు వెనుక ఎవరికీ తెలియని ఆసక్తికరమైన మానసిక కారణాలు ఎన్నో ఉన్నాయి. అవేంటో ఇక్కడ చూడండి.

Why Do People Check Their Ex on Social Media After a Breakup

అలవాటుగా మారిన జ్ఞాపకం.. ఎడతెగని ఆరాటం

మనం ఒకరిని గాఢంగా ప్రేమించినప్పుడు.. వారి రోజువారీ దినచర్య మన జీవితంలో ఒక భాగమైపోతుంది. పొద్దున్నే లేచిన దగ్గరి నుండి రాత్రి పడుకునే వరకు వాళ్ల ప్రతి కదలికా మనకు తెలిసి ఉంటుంది. బ్రేకప్ తర్వాత ఆ అలవాట్లు ఒక్కసారిగా మాయం కావు. మెదడు ఆ పాత జ్ఞాపకాలను వెతుకుతూనే ఉంటుంది.

ఇప్పుడు తను ఎలా ఉంది, ఎలా ఉన్నాడు? పాత అలవాట్లు మార్చుకున్నారా? వాళ్ల జీవితంలోకి నా స్థానంలో కొత్తగా ఎవరైనా వచ్చారా? అనే ప్రశ్నలు మనసును తొలిచేస్తుంటాయి. ఎవరినీ నేరుగా అడిగి తెలుసుకోలేరు కాబట్టి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుక్కునే క్రమంలోనే తమ మాజీ భాగస్వామి ప్రొఫైల్‌ ను పదే పదే చెక్ చేస్తుంటారు.

శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా?

నేను లేకుండా సంతోషంగా ఉండగలరా?

ఒక బంధం ముగిసిన తర్వాత.. మనసులో ఎన్నో సమాధానం దొరకని ప్రశ్నలు మిగిలిపోతాయి. అందులో ముఖ్యమైనది..నేను లేకుండా తను నిజంగానే సంతోషంగా ఉండగలడా,ఉండగలదా?. ఈ ప్రశ్న కేవలం ప్రేమతోనే కాదు, కొద్దిగా అహంతో కూడా ముడిపడి ఉంటుంది.

వాళ్లతో మళ్లీ కలిసిపోవాలనే ఉద్దేశం ఏ కోశానా లేకపోయినా.. తమ లేమి అవతలి వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపిందో తెలుసుకోవాలనే ఆత్రుత కలుగుతుంది. అందుకే తమ మాజీ లవర్స్ సోషల్ మీడియా పోస్టులు, ఫోటోలు, స్టేటస్‌ లపై ఒక కన్నేసి ఉంచుతారు. అయితే సోషల్ మీడియాలో కనిపించే నవ్వుల వెనుక ఉన్న నిజమైన బాధ ఏంటో ఆ ఫోటోలు ఎప్పటికీ స్పష్టంగా చెప్పలేవు అన్నది కాదనలేని నిజం.

నిరంతర నిఘా.. మానసిక వేదనకే దారి

సోషల్ మీడియాలో మాజీ భాగస్వామిని ఫాలో అవ్వడం, వాళ్ళ ప్రొఫైల్స్ ను నిరంతరం గమనించడం వల్ల తాత్కాలిక ఉపశమనం లభించొచ్చు కానీ దీర్ఘకాలంలో ఇది సమస్యలకు దారి తీస్తుంది. 2026లో ప్రచురించబడిన ఒక ఆసక్తికరమైన అధ్యయనం ప్రకారం.. బ్రేకప్ తాలూకు బాధ నుండి బయటపడలేని వారే ఎక్కువగా తమ మాజీ భాగస్వాములను సోషల్ మీడియాలో వెంబడిస్తుంటారని తేలింది. దాన్ని వీలైనంత త్వరగా మానుకోవడం మానసిక ఆరోగ్యానికి మంచిది.

గమనించాల్సిన ఒక ముఖ్యమైన విషయం

బ్రేకప్ బాధను మర్చిపోలేకపోవడం అంటే వారు తమ మాజీ భాగస్వామిని ఇంకా ప్రేమిస్తున్నారని అర్థం కాదు. కేవలం ఆ పాత జ్ఞాపకాల ఊబిలో నుండి బయటకు రాలేకపోతున్నారని మాత్రమే.

Story first published: Saturday, October 3, 2026, 8:13 [IST]
Desktop Bottom Promotion