Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
అమావాస్య రోజు పొరపాటున కూడా ఈ పనులను చేయకండి..!
అమావాస్య రోజు కొన్ని పనులను అస్సలు చేయకూడదని హిందూ శాస్త్రం, పండితులు హెచ్చరిస్తున్నారు. ఒక వేల చేస్తే చాలా కష్టాలు అనుభవించాల్సి వుంటుంది. అమావాస్యను శుభదినంగా పేర్కొనరన్న విషయం మనకు తెలిసిందే. అమావాస్యను శూన్య తిధిగా పరిగణిస్తారు. అమవాస్య రోజు సూర్యుడు ఉదయించకముందే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా పొద్దేక్కే వరకు పడుకోకూడదు. మిగితా రోజులు ఎప్పుడు నిద్రలేచినా సరిపోతుంది కానీ అమావాస్య రోజు మాత్రం కచ్ఛితంగా సూర్యోదయాని కంటే ముందుగానే నిద్రలేవాలి. అమావాస్య రోజు తలకు నూను కూడా పెట్టుకోవద్దు. మహిళలకు కూడా ఈ నియమం వర్తిస్తుంది. ఇంట్లో ఆడవారని మాత్రమే కాకుండా ఇంటిల్ల పాది అమవాస్య రోజున తలస్నానం చేయాలి. అమావాస్య ఏ రోజున వచ్చిందనే దానితో సంబంధం లేకుండా తల స్నానం చేయాలి.

తలస్నానం చేసిన తరువాత లక్ష్మీదేవిని పూజించాలి. లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం. ఈ మంత్రాన్ని.. "లక్ష్మీం క్షీరసముద్రరాజు తనయామ్ శ్రీరంగదామేశ్వరం దాసి భౌత సమస్త దేవ వనిత లోకైక దీపం శ్రీమన్మంద కటాక్ష లబ్ద విభవ బ్రహ్మేంద్ర గంగాధరమ్ స్వామి వందే ముకుంద ప్రియా"..ఈ శ్లోకాన్ని చదువుతూ లక్ష్మీదేవికి పూజ చేసి ఒక తామరపువ్వును సమర్పించాలి. అప్పుడు లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
అమావాస్య రోజున లక్ష్మీదేవికి పూజ చేయకపోతే దరిద్రమని శాస్త్రంతో పాటు పండితులుచెబుతున్నారు. అమవాస్య రోజు కొత్తబట్టలు కొనద్దు వేసుకోవద్దు. పిల్లలకు పుట్టిన రోజు అయినా సరే పిల్లలకు అమావాస్య రోజున కొత్త బట్టలు అస్సలు కొనరాదు. తప్పక కొనాలని అనుకుంటే పుట్టిన రోజుకు ఒక రోజు మందుగానైనా కొనిపెట్టుకొని ఒకసారి వేసుకొని విప్పి, కొంత పసుపు రాని తరువాత అమావాస్య రోజున ఆ కొత్త బట్టలను వేసుకోవచ్చు.
అమావాస్య రోజున హెయిర్ కటింగ్ కూడా చేయించుకోకూడదని శాస్త్రం చెబుతోంది. కనీసం గడ్డం కూడా చేసుకోవడానికి వీలు లేదని పండితులు చెబుతున్నారు. గోళ్లను కూడా కత్తిరించుకోవద్దని అంటున్నారు. అమావాస్య రోజున గోర్లు కత్తిరించి బయట వేసినా లేదా జుట్టు కత్తిరించి బయట వేసినా అది మన శత్రువులకు చిక్కితే దానితో చేతబడి చేసే అవకాశం వుంది. అందుకే పెద్దలు మనకు ఎన్నో ఏళ్ల నుంచి అమావాస్య రోజు గోళ్లు కత్తిరించుకోవద్దు, హెయిర్ కటింగ్ చేసుకోవద్దని చెబుతూ వస్తున్నారు.
అమావాస్య రోజున పెద్దలకు ప్రత్యేకంగా ప్రసాదాన్ని చేసి పెట్టాలి. పెద్దలు కాకుల రూపంలో వచ్చి దాన్ని ఆరగిస్తారని నమ్మకం. ఇలా అమావాస్య రోజున చేయడం వల్ల పెద్దల ఆశీర్వాదం, అనుగ్రహం కలుగుతుంది. ఇదంగా చేసిన తరువాత కాళ్లు, చేతులు కడుక్కొని నెత్తిపై కొన్ని నీళ్లు పోసుకోవాలి.
అమావాస్య రోజు ఎవ్వరికీ డబ్బు ఇవ్వకూడదు. అలాగే ఎంతటి దగ్గరివారైనా సరే అప్పు ఇవ్వకూడదు. కచ్ఛితంగా ఇవ్వాల్సి వస్తే.. అమావాస్య ముందు రోజు గానీ లేదా తరువాత రోజు గానీ ఇవ్వాలి. ఆసుపత్రిలో వుండి తప్పని పరిస్థితిలో ఇవ్వాల్సి వస్తే.. లక్ష్మీదేవికి ప్రార్థన చేసుకుంటూ అమావాస్య రోజు డబ్బులు ఇస్తుున్నందున క్షమించమని ప్రార్థించాలి.
అమావాస్య రోజున మధ్యాహ్నం సాయంత్ర వేళలో నిద్రించకూడదు. ఆ రోజు స్నానం చేసి లక్ష్మీదేవిని పూజించాలి. అమావాస్య రోజు దీపం వెలిగిస్తే కచ్ఛితంగా లక్ష్మీ దేవి అనుగ్రహం కలుగుతుంది. పౌర్ణమి రోజున దీపం వెలిగించడం కంటే అమావాస్య రోజున దీపం వెలిగించడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. అమావాస్య రోజున ప్రపంచం మొత్తం చీకటిగా వుంటుంది. ఆలాంటి చీకట్లో దీపం వెలిగిస్తే దేవతలు సంతోషిస్తారని శాస్త్రం చెబుతుంది.



Click it and Unblock the Notifications











