Ashada Amavasya 2021: ఈ ఏడాది ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది... బోనాలు ప్రారంభం అప్పుడేనా?

ఆషాఢ మాసం ఆచారాలు, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందూ మతం ప్రకారం, ప్రతి ఒక్క నెలకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అలాగే ఆషాఢ మాసానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా ఆషాఢ అమావాస్య తేదీని చాలా ప్రత్యేకంగా పరిగణిస్తారు.

Ashada Amavasya 2021 Date, Muhurat Timing, Rituals And Significance in Telugu

ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య ఆషాధి అమావాస్య లేదా హలహరి అమావాస్య అని కూడా అంటారు. వ్యవసాయం చేసే ప్రజలకు ఈరోజు చాలా ముఖ్యమైన రోజు. ఈ పవిత్రమైన రోజున రైతులు తమ పొలాలు పచ్చగా ఉండాలని దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేస్తారు.

Ashada Amavasya 2021 Date, Muhurat Timing, Rituals And Significance in Telugu

అలాగే నాగలి మరియు వ్యవసాయ పనిముట్లను పూజిస్తారు. ఈరోజున పూర్వీకులను తలచుకుని దానం కూడా చేస్తారు. ఈ సందర్భంగా 2021 సంవత్సరంలో ఆషాఢ అమావాస్య ఎప్పుడొచ్చింది? అమావాస్య శుభ ముహుర్తం, సమయం, ఆరాధన పద్ధతుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

ఆషాఢ అమావాస్య తేదీ..

ఆషాఢ అమావాస్య తేదీ..

హిందూ క్యాలెండర్ ప్రకారం, ఆషాఢ మాసం నాలుగో నెల. ఛైత్ర, వైశాఖ, జ్యేష్ట మాసం తర్వాత ఆషాఢం వస్తుంది. 2021 సంవత్సరంలో జులై 9వ తేదీన శుక్రవారం నాడు ఆషాడ అమావాస్య ప్రారంభమవుతుంది.

అమావాస్య ప్రారంభ తిథి : జులై 9న ఉదయం 5:16 గంటలకు

అమావాస్యత తిథి ముగింపు : జులై 10న ఉదయం 6:46 గంటలకు

పదో తేదీన ఉపవాసం ఉండాలి.

అమావాస్య ఆరాధన పద్ధతి..

అమావాస్య ఆరాధన పద్ధతి..

* ఆషాఢ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి

* ఈరోజున బ్రహ్మ ముహుర్త సమయంలో పవిత్ర నదిలో లేదా ప్రవహించే నీటిలో స్నానం చేయాలి. అయితే ఇప్పుడు కరోనా కారణంగా అలాంటి పరిస్థితి లేకపోతే.. నదిలోని నీటిని బాటిల్ లో నింపుకుని వాటిని మీ ఇంట్లో స్నానం చేసే పాత్రలో వేసుకుని స్నానం చేయండి.

* సూర్యోదయం సమయంలో సూర్యభగవానుడికి నీరు అర్పించండి.

* ఈరోజున మీ పూర్వీకులను తలచుకోండి.

* వారి ఆత్మ శాంతి కోసం ఈరోజున ఉపవాసం ఉండాలి.

* నిరుపేదలకు విరాళాలు ఇవ్వండి (మీ సామర్థ్యం మేరకు)

* బ్రహ్మాణులకు ఆహారాన్ని అందించండి.

ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత..

ఆషాఢ అమావాస్య ప్రాముఖ్యత..

ఈ అమావాస్య గురంచి చాలా గ్రంథాలలో పేర్కొనబడింది. ఈరోజున చాలా మంది శుభకార్యాలను చేయడాన్ని వాయిదా వేస్తారు. ఈ పవిత్రమైన రోజున పూర్వీకులను తలచుకుని, నది స్నానం చేసి దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని చాలా మంది నమ్ముతారు. ఇది మాత్రమే పిత్రు దోషాల నుండి కూడా విముక్తి లభిస్తుందని భావిస్తారు. అందుకే ఈ రోజున పిత్రు కర్మకు చాలా పవిత్రంగా భావిస్తారు.

విరాళం ఇవ్వండి..

విరాళం ఇవ్వండి..

ఆషాఢ అమావాస్య రోజున ఎవరైనా పేద వ్యక్తికి మీ సామర్థ్యం మేరకు విరాళం ఇవ్వండి. అదే విధంగా ఈరోజున ఉదయాన్నే రావి చెట్టుకు నీరు అర్పించి, సాయంకాలం వేళ దీపాన్ని వెలిగించాలి. అలాగే అవసరమైన వారికి ఆహారాన్ని అందించాలి.

దక్షిణయానం ప్రారంభం..

దక్షిణయానం ప్రారంభం..

ఆషాఢ మాసంలోనే సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇలా ప్రవేశించే సమయాన్ని దక్షిణయాణం అంటారు. ఈ దక్షిణ యాణం తిరిగి మకర రాశిలోకి వెళ్లే వరకు సుమారు ఆరు నెలల సమయం పడుతుంది. భూమధ్యరేఖకు దక్షిణంగా సూర్యగమనం ఉండటం వల్ల ఈ కాలం పిత్రు కర్మలకు ప్రీతికరం. అంతేకాదు ఆషాఢ అమావాస్య సమయంలో తెలంగాణ బోనాలు, పూరీలోని జగన్నాథుని రథయాత్ర నిర్వహిస్తారు.

తెలంగాణ బోనాలు..

తెలంగాణ బోనాలు..

తెలంగాణ ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకునే బోనాలు ఈ ఏడాది జులై 11 నుండి ప్రారంభం కానున్నాయి. నెలరోజుల పాటు అంగరంగవైభవంగా సాగనున్నాయి. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం అమావాస్య తర్వాత వచ్చే గురువారం లేదా ఆదివారం రోజున బోనాలు ప్రారంభిస్తారు. ఈ బోనాలు చారిత్రక గోల్కోండ కోటలోని శ్రీ జగదాంబిక(ఎల్లమ్మ) ఆలయంలో తొలి పూజ జరిగిన తర్వాతే రాష్ట్రవ్యాప్తంగా బోనాలు ప్రారంభమవుతాయి.

Story first published: Tuesday, July 6, 2021, 16:39 [IST]
Desktop Bottom Promotion