Latest Updates
-
నోట్లో వేస్తే కరిగిపోయేలా ఎగ్ సలాడ్ శాండ్విచ్.. ఇలా చేశారంటే ఒక్కటి కూడా వదలరు.! -
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే!
ఆషాఢం అంటేనే అందరికీ అదే గుర్తొస్తుంది... అయితే అదొక్కటే కాదు.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలున్నాయి...
ఆషాఢ మాసం యొక్క ప్రాముఖ్యత మరియు విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం...
తెలుగు నెలలన్నీ ప్రకృతితో అనుబంధంగా ఉంటాయి. హిందూ క్యాలెండర్ కూడా రుతువుల ఆధారంగా, నక్షత్రాల ఆధారంగా నిర్ణయించబడుతుంది.

అలా పూర్వ ఆషాఢ నక్షత్రంలో పౌర్ణమి ఉన్న నెలను 'ఉత్తర ఆషాఢ' మాసంగా చెబుతారు పండితులు. ఈ ఆషాఢ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు. ఈ కాలంలో వర్షాలు ఎక్కువగా కురుస్తాయి.

ఈ మాసంలో నదీ, సముద్ర స్నానం చేయడం.. దానం చేయడం.. జపం, పారాయాణాలు వంటివి చేయడం వల్ల ఎన్నో ఫలితాలు లభిస్తాయని చాలా మంది నమ్ముతారు. అలాగే ఈ మాసంలో పాదరక్షలు, గొడుగు, ఉప్పును దానం చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.

ఈ ఆషాఢ మాసంలోనే దక్షిణాయానం కూడా ప్రారంభమవుతుంది. కర్కాటకంలోని సూర్యుడు ప్రవేశించిన కాలంలోనే ఇది ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుండి తిరిగి మకర రాశిలోకి ప్రవేశించే వరకు దక్షిణ యానం అంటారు. ఈ సమయంలో సూర్యుడు భూమధ్య రేఖకు దక్షిణంగా సంచరిస్తాడు. ఇది మన పూర్వీకులైన తండ్రులకు చాలా ఇష్టమైన సమయం అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఈ మాసంలో ఇంకా ఏయే ప్రత్యేకతలున్నాయో ఇప్పడు తెలుసుకుందాం...

వ్యాస పూర్ణిమ..
ఈ ఆషాఢ మాసంలోనే త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం గురు పూర్ణమి కూడా వస్తుంది. దీనినే వ్యాస పౌర్ణమి అని కూడా అంటారు. అలాగే ఆషాఢ శుద్ధ విదియ నాడు పూరీ జగన్నాథ, బలభద్ర, సుభద్ర రథయాత్ర కూడా జరుగుతుంది.

బోనాల ఉత్సవాలు..
ఈ ఆషాఢ మాసంలోనే తెలంగాణ రాష్ట్రంలో సంప్రదాయ పండుగ అయిన బోనాల ఉత్సవాలను భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. మహంకాళి అమ్మవారి కోసం తయారు చేసే భోజనాన్ని బోనంగా చెప్తారు. దీనిని అమ్మవారికి నివేదన చేసే పర్వదినాన్నే బోనాలు అంటారు.

అనారోగ్య మాసం..
ఆషాఢ మాసాన్ని అనారోగ్య మాసం అని కూడా అంటారు. అందుకే వాటి నుండి తమను కాపాడమని భక్తులందరూ అన్నం, బెల్లం, పెరుగు, పసుపు నీళ్లు, వేపాకులు ఈ బోనం కలిపి అమ్మవారికి సమర్పిస్తారు. ఇలా చేయడం వల్ల తాము అనారోగ్యం నుండి బయటపడతామని వారి నమ్మకం.

తేడా లేని రాత్రి, పగలు
ఈ ఆషాఢంలోని సప్తమిని భాను సప్తమి అని అంటారు. సూర్యుడు ఉత్తరం నుండి దక్షిణం దిశకు పయనిస్తూ మూడు నెలల తర్వాత మధ్యలో చేరుకుంటారు. ఆ రోజున పగలు, రాత్రి అనే తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి.

మతత్రయ ఏకాదశి..
ఆషాఢ మాసంలోని వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని మరియు శయన ఏకాదశి అని కూడా అంటారు. ఈరోజు చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతత్రయ ఏకాదశి అని కూడా అంటారు.

ఆషాఢ షష్టి రోజున..
ఈ మాసంలో ఆషాఢ శుద్ధ పంచమిని స్కంధ పంచమిగా చెబుతారు పండితులు. అలాగే ఆషాఢ షష్టిని కుమార షష్టిగా చెబుతారు. ఈ పవిత్రమైన రోజున సుబ్రహ్మాణ్య స్వామిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఈరోజున నీటిని మాత్రమే తీసుకుని, కఠినమైన ఉపవాసం ఉండి, తర్వాతి రోజు ఆలయానికి వెళ్లి దర్శించడం వల్ల వ్యాధులన్నీ తొలగిపోయి ఆయురారోగ్యాలు దక్కుతాయని పురాణాల్లో చెప్పబడింది.

అందరికీ గుర్తుకొచ్చేదీ..
ఇవన్నీ ఇలా ఉండగా ఆషాఢ మాసం అంటేనే అందరికీ టక్కున గుర్తొచ్చేది అత్తా, కోడలు ఒకేచోట ఉండరాదు. అలాగే భార్య భర్తలు కూడా కలయికలో అస్సలు పాల్గొనకూడదు. ఈ సంప్రదాయం గురించి చాలా మందికి తెలుసు.

ఎండలకు తట్టుకోలేరని..
ఒక వేళ భార్యభర్తలు ఈ నెలలో కలయికలో పాల్గొని భార్య గర్భం దాలిస్తే.. 9 నెలల తర్వాత డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన అది ఛైత్ర మాసం అంటే మార్చి, ఏప్రిల్ మధ్యన వస్తుంది. ఆ సమయంలో ఉండే వేడికి ఎండలకు తల్లీ,బిడ్డ ఇద్దరూ తట్టుకోలేరని భావించి, ఈ నియమాన్ని తీసుకొచ్చారు మన పూర్వీకులు.

ఎంత దూరంగా ఉంటే..
కొత్తగా పెళ్లి చేసుకున్న భార్యాభర్తల మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉండటం అనేది చాలా సహజమే. ఈ మాసంలో దూరంగా ఉంటే దూరమైనా బాధ వారికి తెలుస్తుంది. దీనర్థం ఎంత దూరంగా ఉంటే అంత ప్రేమ పెరుగుతుందట. ఈ దూరం వల్ల వారి కష్ట సుఖాలు పంచుకుని తర్వాత మరింత అన్యోన్యంగా నవ దంపతులు సుఖంగా జీవిస్తారనే ఒక ఆచారాన్ని తీసుకొచ్చారు. అందుకే మన పెద్దలు చెప్పిన ప్రతి ఒక్క మాటలోనూ ఏదో ఒక పరమార్థం దాగి ఉంటుందని చాలా మంది నమ్మకం.



Click it and Unblock the Notifications