Astrology Remedies : ఈ పరిహారాలు పాటిస్తే మంచి జాబ్ కొడతారంట...! ఉద్యోగులకు సమస్యలన్నీ తొలగిపోతాయట...!

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మంచి జాబ్ రావడానికి ఈ పనులు చేయాలట..

కరోనా మహమ్మారి దెబ్బకు ప్రపంచంలోని చాలా మంది చాలా మందికి గడ్డుకాలం ఏర్పడింది. మన దేశంతో పాటు అనేక దేశాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయాయి. లాక్ డౌన్ పేరిట అనేక ఇండస్ట్రీలు మూతబడటంతో.. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు.

Astrology Remedies for getting a good job in Telugu

అయితే ఇప్పుడిప్పుడే లాక్ డౌన్ దశలవారీగా ఎత్తివేయడంతో చాలా కంపెనీలు తమ ఉద్యోగులను వెనక్కి పిలుస్తున్నాయి. కానీ చాలా కండిషన్లు పెడుతున్నాయి. మరికొందరు కొత్త ఉద్యోగాలను పొందడంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.

Astrology Remedies for getting a good job in Telugu

ఒకవేళ జాబ్ దొరికినా అక్కడా ఏ మాత్రం కుదురుగా ఉండట్లేదు. పనిఒత్తిడి ఎక్కువ అవ్వడం.. అరకొర జీతం రావడంతో ఏమి చేయాలో తెలియని పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఇలాంటి సమస్యలన్నింటికీ పరిష్కారం ఉందంటోంది జ్యోతిష్యశాస్త్రం.

Astrology Remedies for getting a good job in Telugu

దీని ప్రకారం మీకు జాబ్ లేకున్నా.. లేదా మీరు చేసే జాబ్ లో ఏదైనా సమస్యలుంటే కొన్ని పరిహారాలు పాటించాలట. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలు ఉంటాయట. మరి ఇంకెందుకు ఆలస్యం మీ జాబ్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి ఎలాంటి పరిహారాలు పాటించాలనే వివరాలను ఇప్పుడే చూసెయ్యండి...

ఈ రత్నాలను ధరిస్తే..

ఈ రత్నాలను ధరిస్తే..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మంచి జాబ్ పొందేందుకు లేదా క్యాంపస్ సెలక్షన్లలో ఆఫర్ రావాలంటే మీరు భాగ్య రత్నం లేదా దశమేష రత్నాన్ని ధరించాలి. ఈ రత్నాలను ధరించడం వల్ల జాబ్ లో ఉండే వారికి సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ వేటలో ఉండే వారికి త్వరలో జాబ్ గురించి శుభవార్త వినిపిస్తుంది. అంతేకాదండోయ్ మీరు పని చేసే చోట కొలిగ్స్, ఉన్నతాధికారుల నుండి ఏదైనా ఒత్తిడి ఉన్నా అది కూడా తొలగిపోతుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నంలోనూ అడ్డంకులన్నింటినీ అధిగమించి విజయం సాధిస్తారు.

భాస్కరుడికి నీటి సమర్పణ..

భాస్కరుడికి నీటి సమర్పణ..

మీరు మంచి జాబ్ సంపాదించడానికి లేదా మీరు చేస్తున్న జాబ్ లో ప్రమోషన్ పొందేందుకు భాస్కరుడు(సూర్యుడు)కి నీటిని అర్పించడం ద్వారా మంచి ప్రయోజనాలు పొందొచ్చు. ఇలా చేయడం వల్ల మీరు పని చేసే చోట ఇతరుల వద్ద నమ్మకాన్ని పెంచుకుంటారు. ఎందుకంటే జ్యోతిష్యశాస్త్రంలో సూర్యుడిని రాజుగా పరిగణిస్తారు. దీని కారణంగా జాబ్ లో ఉండే వారు, రాజకీయాలలో ఉన్న వారు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారు. అలాగే సూర్యోదయం సమయంలో నీటిని సమర్పించడం వల్ల మీకు అనుకూల ఫలితాలు రావడమే కాదు.. మీ కోరికలన్నీ నెరవేరుతాయి.

శ్రీయంత్రాన్ని..

శ్రీయంత్రాన్ని..

నిరుద్యోగులు మంచి జాబ్ కోసం ప్రయత్నిస్తుంటే.. మీరు శ్రీయంత్రాన్ని పూజించాలి. ఈ యంత్రం లక్ష్మీదేవి సంపదకు సూచికగా తెలియజేస్తారు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, శుక్రవారం రోజున శ్రీయంత్రాన్ని ఆరాధించి కనకధర స్తోత్రాన్ని పఠించాలి. అలాగే శ్రీ యంత్రాన్ని రోజ్ కలర్ క్లాత్ లో ఉంచి ప్రత్యేక పూజలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అంతేకాదు మీరు లక్ష్మీదేవి అనుగ్రహం పొందుతారు. ఉద్యోగంలో ఉండే వారికి సమస్యలన్నీ తొలగిపోతాయి.

రుద్రాక్షలను ధరించాలి..

రుద్రాక్షలను ధరించాలి..

మన దేశంలో రుద్రాక్షల్లో చాలా రకాలున్నాయి. ప్రతి ఒక్క రుద్రాక్ష పరిమాణం, నాణ్యత కారణంగా దాని ప్రయోజనాలు భిన్నంగా ఉంటాయి. ఉద్యోగ సంబంధిత సమస్యల నుండి బయటపడటానికి దశముఖి రుద్రాక్ష ధరించడం ఉత్తమమైందిగా భావిస్తారు. దశముఖి రుద్రాక్ష శ్రీమహా విష్ణువు రూపంగా భావిస్తారు. దీన్ని ధరించడం వల్ల జాబ్ లో ఉండే వారి సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుంది. మీ కుటుంబంలో మరియు పిల్లలకు సంబంధించిన సమస్యలు ముగిసిపోతాయి. ఈ రుద్రాక్షలను ధరిస్తే, మీకు ఇప్పటివరకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి, ఆనందం, ఆరోగ్యం లభిస్తుంది.

కుడి పాదంతో..

కుడి పాదంతో..

మీరు మంచి జాబ్ కోసం ఇంటర్వ్యూకు వెళ్లినప్పుడు, మీ కుడి పాదాన్ని ముందుకు వేసి ఆవుకు బెల్లం, గోధుమపిండితో చేసిన రొట్టెలు తినిపించడం ద్వారా ఉద్యోగావకాశాలు బలపడతాయి. స్వయంగా మీ చేతులతో ఆవుకు ఆహారమివ్వాలని గుర్తుంచుకోవాలి. ఇదే సమయంలో లంఖిస్తున్న హనుమంతుడు ఫొటోను మీ పర్సులో ఉంచుకోండి. ఈ విధంగా చేయడం ద్వారా ఇంటర్వ్యూల్లో మీరు సక్సెస్ అవుతారు.

రావిచెట్లకు..

రావిచెట్లకు..

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రావి చెట్టును దేవతలు, పిత్రు దేవతల నివాసంగా భావిస్తారు. ప్రతి ఆదివారం ఉదయం రావి చెట్టుకు నీటిని అందించాలి. శనివారం రోజున నీటిలో కొద్దిగా పాలు, సాయంత్రం దీపారాధన చేయండి. ఇలా చేయడం వల్ల నిరుద్యోగులకు మంచి జాబ్ దొరుకుతుంది. అంతేకాకుండా ఉద్యోగాన్వేషణ కూడా ముగుస్తుంది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి కూడా సమస్యలు ముగిసిపోయి, ప్రశంసలు అందుకుంటారు.

Desktop Bottom Promotion