Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
జనవరి నెలలో వివాహాలకు దివ్యమైన ముహుర్తాలివే...!
జనవరి నెలలో వివాహ సంబంధాలు చూసే వారి కోసం ముఖ్యమైన తేదీలు మరియు శుభ ముహూర్తాల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి
ఆంగ్ల నూతన సంవత్సరం అయిన జనవరి మాసంలో పెళ్లి కాని ప్రసాదులంతా 2020లో వివాహ వేడుకను ఘనంగా జరుపుకోవాలనుకుంటున్నారా? మీ భాగస్వామి మెడలో మూడు ముళ్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారా?

తమకు నచ్చిన భాగస్వామితో ఏడడుగులు వేసేందుకు శుభముహుర్తాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే జ్యోతిష శాస్త్రం ప్రకారం నిర్ణయించిన పవిత్రమైన తేదీలను తెలుసుకోండి. మీ నక్షత్రాలు, రాశులకు అనుుణంగా పండింతులచే సూచించబడిన ముహుర్తాలలో మీ భాగస్వామి మెడలో మూడు ముళ్లు వేసేయండి.

కళ్యాణం వచ్చినా.. కక్కు వచ్చినా ఆగదు అని తెలుగులో ఓ సామెత ఉంది. ఇద్దరు వ్యక్తులు తమ జీవితంలో ఒక కొత్త అనుభూతిని పొందేందుకు జరిగే అద్భుతమైన ఘట్టం ఇది. ఎందుకంటే పెళ్లి ద్వారా ఇద్దరు వ్యక్తులు కలకాలం జీవించాలి కాబట్టి.

వారు హిందూ ఆచారాల ప్రకారం పండితుల సలహాలను, సూచనలను పాటిస్తారు.ఈ సందర్భంగా జనవరి నెలలో వివాహ సంబంధాలు చూసే వారి కోసం ముఖ్యమైన తేదీలు మరియు శుభ ముహూర్తాల వివరాలను ఈ స్టోరీలో తెలుసుకోండి. మీ ప్రియమైన వారిని మీ జీవితంలో భాగస్వామిగా చేసుకోండి.. జీవితాంతం ఆనందంగా జీవించండి...

జనవరి 15వ తేదీ
జనవరి 15వ తేదీ బుధవారం నాడు అంటే ఆంగ్ల నూతన సంవత్సరం ఏ రోజు అయితే ప్రారంభమైందో అదే రోజు అన్నమాట. ఆరోజు వివాహానికి దివ్యమైన ముహార్తం అని పండితులు చెబుతున్నారు.
ఆరోజు వివాహ కార్యక్రమాన్ని ఉదయం 5:57 నుండి మధ్యాహ్నం 12:10 గంటల వరకు నిర్ణయించారు.
నక్షత్రం : ఉత్తర ఫాల్గుణ

జనవరి 16వ తేదీ..
జనవరి 16వ తేదీ గురువారం రాత్రి నుండి తిరిగి శుక్రవారం అర్ధరాత్రి వరకు వివాహానికి అద్భుత సమయం ఉందని పండితులు నిర్ణయించారు. ఇక ఆరోజు ముహుర్త సమయాన్ని ఈ విధంగా సూచించారు. గురువారం రాత్రి 8:32 నుండి తిరిగి శుక్రవారం అర్థరాత్రి 2:30 గంటల వరకు
నక్షత్రం : హస్త

జనవరి 20వ తేదీ..
జనవరి 20వ తేదీ అయిన సోమవారం నాడు వివాహాది శుభకార్యాలకు ఉదయం 7:58 నుండి రాత్రి 11:30 గంటల వరకు మంచి ముహుర్తం అని పండితులు సూచించారు. ఆరోజు అనురాధ నక్షత్రం ఉందని స్పష్టం చేశారు.

జనవరి 22వ తేదీ..
వివాహాది శుభకార్యాలకు జనవరి 22వ తేదీ బుధవారం అర్థరాత్రి అద్భుతమైన ముహుర్తం ఉందని పండితులు సూచించారు.
ముహుర్త సమయం : బుధవారం అర్ధరాత్రి 12 గంటల నుండి రాత్రి 1:45 గంటల వరకు
నక్షత్రం : మూల

జనవరి 29వ తేదీ..
జనవరి 29వ తేదీ అయిన బుధవారం నాడు మధ్యాహ్నం 12:13 నుండి మధ్యాహ్నం 1:19 గంటల వరకు దివ్యమైన ముహర్తం ఉందని పండితులు సూచించారు. అలాగే ఆరోజు ఉత్తర భాద్రపద నక్షత్రం కూడా ఉందని తెలిపారు.

జనవరి 31వ తేదీ..
జనవరి 31వ తేదీ అంటే ఈ నెల ఆఖరి రోజు అయిన శుక్రవారం నాడు మధ్యాహ్నం 3:52 నుండి సాయంత్రం 6:10 గంటల వరకు అద్భుత ఘడియలు ఉన్నట్లు పండితులు చెప్పారు. అలాగే ఆరోజున రేవతి నక్షత్రం ఉందని వివరించారు.



Click it and Unblock the Notifications