Latest Updates
-
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.!
ఇలాంటి శివలింగాలని ఇంట్లో పెట్టుకోవద్దు..! లేదంటే..!
శివారాధనను కులాలకు మతాలకు స్త్రీల పురుషులు అని తేడా లేకుండా ప్రతీ ఒక్కరూ శివారాధన చేయవచ్చు. శివపూజ లేనటువంటి ఇల్లు ఇల్లేకాదని శాస్త్రంలో కూడా అన్నారు. ఈ సృష్టికి ఆదిదంపతులు, తల్లిదండ్రులు శివపార్వతులు కాబట్టి ఎవ్వరినీ పూజంజకపోయినా శివపార్వతులను కచ్ఛితంగా పూజించాలి. శివలింగం లేనటువంటి ఇల్లు కాశీలో లేదు. శివలింగాన్ని ఎవ్వరైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. శివలింగం లేనటువంటి ఇంట్లో భోజనం చేయవద్దని శివపురాణంలో చెప్పబడి వుంది. బొటవేలి సైజులో లేదంటే ఐదు అంగులాల సైజులో వున్న శివలింగాన్ని పెట్టుకోవచ్చు. పాలరాతితో చేసిన శివలింగాన్ని పెట్టుకుంటే చాలా మంచిది. వెండితో చేసినటువంటి శివలింగాన్ని కూడా పెట్టుకోవచ్చు.

నర్మద శివలింగం ఇంట్లో వుంటే చాలా నియమనిష్టలు పాటిస్తూ పూజ చేయాలి, కాబట్టి ఈ శివలింగాన్ని పెట్టుకోవద్దు. పాదరసంతో చేసిన శివలింగాన్ని కూడా పెట్టుకోవద్దు. పాదరసంపైన పడిన నీళ్లు విషంగా మారే అవకాశం వుంది. కాబట్టి పాదరసం శివలింగాలను కూడా ఇంట్లో పెట్టుకోవద్దు. ఆడవాళ్లు కూడా శివలింగాన్ని ముట్టుకోవచ్చా, పూజచేయవచ్చా అని కొందరికి అనుమానం వుంటుంది. శివపురాణంలో సాక్షాత్తు నందీశ్వరుడే ఆడవాళ్లు శివలింగాన్ని ముట్టుకోవచ్చు, పూజచేయవచ్చని చెబుతాడు.
శివలింగానికి అభిషేకం చేయకపోయినా ప్రతీ నిత్యం శివలింగానికి నీళ్లు పోయాలి. అలా చేసిన తరువాత ఓం నమ:శివాయ అని శివపంచాక్షరీ మంత్రాన్ని జపించాలి. మాంసాహారం తిన్న రోజు శివలింగానికి పూజ చేయవద్దు. రుతుదోషం వున్న స్త్రీలు ఐదు రోజులూ శివలింగానికి పూజచేయవద్దు. మగవాళ్లు ప్రతీనిత్యం తలస్నానం చేసి శివారాధన చేయాలి.

శివున్ని పూజించిన వాళ్లకు అన్ని కోరికలూ సిద్ధిస్తాయ్. శివుణ్ని వేటితో పూజిస్తే ఎలాంటి ఫలితాలు మనకు లభిస్తాయో తెలుసుకుందాం. శివలింగాన్ని ఆవు పాలతో అభిషేకం చేస్తే మనకు సర్వసౌఖ్యాలు కలుగుతాయ్. ఆవు పెరుగుతో అభిషేకం చేస్తే ఆరోగ్యం, బలం లభిస్తుంది. అదే ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ఐశ్వర్యవృద్ధి కలుగుతుంది. మెత్తని పంచదారతో శివలింగానికి పూజ చేస్తే దుఖ:ం వుంటే అది దూరమౌతుంది. తేనెతో అభిషేకం చేస్తే మనకు తేజోవృద్ధి కలుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేస్తే..అంటే భస్మాన్ని నీళ్లల్లో వేసి దాంతో అభిషేకం చేస్తే మనం చేసిన పాపాలన్నీ తొలగిపోతాయ్. గంధం నీళ్లతో అభిషేకం చేస్తే పుత్రలాభం కలుగుతుంది. పుష్పోదకం, పువ్వులను నీళ్లల్లో కలిపి అభిషేకం చేస్తే భూ లాభం కలుగుతుంది. స్థలాలు కొనుక్కోవడం జరుగుతుంది. బల్వజలంతో అభిషేకం చేస్తే భోగభాగ్యాలను అనుభవిస్తాము.
నువ్వుల నూనెతో అభిషేకం చేస్తే మృత్యుదోషాలు తొలగిపోతాయ్. రుద్రాక్ష నీళ్లతో అభిషేకం చేస్తే మహాఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. బంగారాన్ని నీళ్లల్లో వేసి ఆ నీళ్లతో అభిషేకం చేస్తే మనకు వున్న దరిద్రబాధలు నశిస్తాయ్. అన్నంతో అభిషేకం చేస్తే రాజ్యప్రాప్తి, ఆయుర్‌వృద్ధి కలుగుతుంది. ఖర్జూర ఫలంతో శివలింగానికి అభిషేకం చేస్తే శత్రువులు నశించిపోతారు. నేరేడు పండ్లరసంతో అభిషేకం చేస్తే మనకు వైరాగ్యం కలుగుతుంది. నవరత్నాలను నీళ్లల్లో వేసి అభిషేకం చేస్తే ధాస్య, గృహప్రాప్తి లభిస్తుంది. మామిడి పండ్లసరంతో అభిషేకం చేస్తే దీర్ఘకాలిక రోగాలు వుంటే అవి నశించిపోతాయ్. పసుపు నీళ్లతో అభిషేకం చేస్తే సకల శుభాలు మనకు కలుగుతాయ్.
భస్మం నీళ్లల్లో వేసి అభిషేకం చేస్తే మనం మరణానంతరం శివలోకానికి వెళ్లిపోతాం. పైన చెప్పిన వస్తువులతో 41 రోజులు భక్తి శ్రద్ధలతో అభిషేకం చేస్తే మీకు శివానుగ్రహం లభించి మీరు అనుకున్నవి సిద్ధిస్తాయ్. భోళాశంకరుడు తప్పకుండా మీ కోరికలను నెరవేరుస్తాడు.
గమనిక : పైన చెప్పిన వివరాలన్నీ ప్రముఖ పండితుల నుంచి సేకరించినవి. వీటిని మేము ఎట్టి పరిస్థితుల్లో దృవీకరించము.



Click it and Unblock the Notifications