Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Chotu Baba: 32 ఏళ్లుగా స్నానం చేయని చోటూ బాబా.. అయినా అందరికంటే ఆరోగ్యంగా ఎలా ఉన్నారో తెలుసా?
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో గల త్రివేణి సంగమం వద్ద కుంభమేళా ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న ఈ ఆధ్యాత్మిక పండగలో పాల్గొనేందుకు భక్తులతో పాటు, సాధువులు, సన్యాసులు కూడా త్రివేణి సంగమంకు చేరుకుంటున్నారు. దానికి సంబంధించిన వార్తలన్నీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతుండగా.. ఛోటూ బాబా అనే ఆధ్యాత్మిక గురువు ప్రస్తుతం చర్చల్లో నిలిచారు.
ఈయన గత 32 సంవత్సరాల నుంచి స్నానం చేయలేదు. దీంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యారు. ఇంతకీ ఛోటూ బాబా స్నానం చేయకపోవడానికి కారణాలు ఏంటి? స్నానం చేయకుండా ఆయన అన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగారు? స్నానం చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయనేది ఈ స్టోరీలో చూద్దాం.

ఛోటూ బాబా ఎవరు
ఛోటూ బాబా అసలు పేరు గంగాపురి మహరాజ్. ఈయన చాలా ప్రసిద్ధి చెందిన ఆథ్యాత్మిక గురువు. అస్సాంకు చెందిన ఈ సన్యాసి, తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో భాగంగా 32 సంవత్సరాలుగా స్నానం చేయలేదు. ఇటీవల మహాకుంభమేళాలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను మీడియా ప్రశ్నలు అడగడంతో ఈ విషయం బయటికి వచ్చింది.
ఎందుకు స్నానం చేయడం లేదు?
గత 32 సంవత్సరాలుగా తాను ఎందుకు స్నానం చేయడం లేదో ఛోటూ బాబా స్వయంగా చెప్పారు. తనకు ఓ ముఖ్యమైన కోరిక ఉందని, ఆ కోరిక తీరే వరకు స్నానం చేయకూడదని నిర్ణయించుకున్నానని అన్నారు. మహా కుంభమేళాలో తమ ఆత్మను పరమాత్మతో అనుసంధానించుకోవడమే తమ లక్ష్యమని చెప్పారు.
స్నానం చేయకపోవడం వల్ల కలిగే ప్రభావాలు
ఒక వ్యక్తి రోజూ స్నానం చేయకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయన్నది అక్షర సత్యం. ఛోటూ బాబా విషయంలో కూడా ఇదే జరిగే అవకాశం ఉంది. స్నానం చేయకపోవడం వల్ల కలిగే కొన్ని సాధారణ సమస్యలు ఇవే.
చర్మంపై దుమ్ము, చెమట, బ్యాక్టీరియా పేరుకుపోవడం వల్ల చర్మ వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే శరీరం నుండి చెడు వాసన వస్తుంది. చర్మంలో తేమ లేకుండా పోతుంది. దీని కారణంగా డ్రైగా మారిపోవడంతో పాటు చర్మంపై మొటిమలు వంటివి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు దీర్ఘకాలంగా స్నానం చేయకపోవడం వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
ఆధ్యాత్మిక కోణం
ఛోటూ బాబా తమ నిర్ణయానికి ఆధ్యాత్మిక కారణాలను చెప్పినప్పటికీ, ఆరోగ్య నిపుణులు స్నానం చేయడం శరీర శుభ్రతకు ఎంతో అవసరం అని చెబుతున్నారు. ఆధ్యాత్మికత మరియు శారీరక ఆరోగ్యం రెండూ ముఖ్యమైనవే. ఛోటూ బాబా విషయం సమాజంలో విభిన్న అభిప్రాయాలకు దారితీసింది. కొంతమంది ఆయనను ఆధ్యాత్మిక గురువుగా భావిస్తే, మరికొంతమంది ఆయన ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
ఛోటూ బాబా జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది. ఆధ్యాత్మికత ఎంతో ముఖ్యమైనదే అయినప్పటికీ, శారీరక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యం అని మనం మరచిపోకూడదు. ఆరోగ్యంగా ఉండటమే నిజమైన ఆధ్యాత్మిక సాధన అని చెప్పవచ్చు.



Click it and Unblock the Notifications