Latest Updates
-
వట్టి నీళ్లు తాగలేకపోతున్నారా? డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే 5 అద్భుతమైన ఆహారాలు ఇవే! -
మే 3, 2026: ఈ రాశుల వారికి అదృష్టం వరించనుంది.. పట్టిందల్లా బంగారం కావాల్సిందే! -
వరియాన్ యోగం, విశాఖ నక్షత్రం.. ఈరోజు మీ సంపదను ఎలా పెంచుతాయో తెలుసా? -
ఈ ఆమ్లెట్ రుచి చూశారంటే మతి పోవాల్సిందే..నోట్లో వెన్నలా కరిగిపోతుంది -
హనుమాన్ జయంతి వేడుకలు: మాల విరమణకు సిద్ధమవుతున్నారా? భక్తులు తప్పక తెలుసుకోవాల్సిన ఆసక్తికర విషయాలివే! -
శని దేవుడి కరుణ: ఈ రాశుల వారికి నేడు అదృష్టం, మరికొందరికి కఠిన పరీక్ష! -
వృషభం, సింహం, కుంభ రాశుల వారికి ఈ వారం ధన యోగం.. మీ రాశి ఉందా? - 03 నుండి 09 మే 2026 వరకు -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి ఆదివారం అదృష్ట యోగం..! - ఆదివారం, 03 మే 2026 -
వేసవి స్పెషల్.. ఎవరూ ఊహించని పుచ్చకాయ తొక్క హల్వా.. వావ్ అనాల్సిందే! -
రొటీన్ మామిడికాయ పచ్చళ్లతో బోర్ కొట్టిందా? అయితే క్యారెట్ మామిడి పచ్చడి ట్రై చేయండి..వేడి అన్నంలోకి నెయ్యితో..
దమయంతిపై ఇంద్రుడితో పాటు ముగ్గురు కన్నేస్తారు కానీ ఆమె నలుడిని చేసుకోవడంతో నలుడ్ని నాశనం చేస్తారు
నలుడు ఒక మంచి చక్రవర్తి. నిషధ రాజ్యాన్ని పాలించిన రాజు ఈయన. వీరసేనుడి కుమారుడు. నలుడు ప్రజలకు ఎంతో మేలు చేశాడు. నలుడు అనుక్షణం న్యాయం వైపే నిలబడ్డాడు. ప్రజలందరికీ నలుడు అంటే ప్రాణం.
నలుడు ఒక మంచి చక్రవర్తి. నిషధ రాజ్యాన్ని పాలించిన రాజు ఈయన. వీరసేనుడి కుమారుడు. నలుడు ప్రజలకు ఎంతో మేలు చేశాడు. నలుడు అనుక్షణం న్యాయం వైపే నిలబడ్డాడు. ప్రజలందరికీ నలుడు అంటే ప్రాణం.
అలాగే నలుడికి ఒక ప్రేమ కథ ఉంది. ఒక రోజు ఒక సరస్సు నిండా హంసలుండడం నలుడు చూశాడు. సరదాగా వాటిని పట్టుకుందామని నలుడు వెళ్లాడు. ఆ గుంపు మొత్తం ఎగిరిపోగా ఒక్క హంస మాత్రం నలుడి చేతికి దొరికింది. ఆ హంసకు నలుడి గురించి మొత్తం తెలుసు.

దమయంతికి నీ గురించి చెబుతా
ఆయనెంతో మంచి వాడని కానీ తన సమూహాన్ని విడిచిపెట్టి తాను ఉండలేనని, తనను విడిచిపెడితే దమయంతికి నీ గురించి చెబుతానని నలుడితో అంటుంది హంస. సరే దాన్ని వదిలిపెడతాడు నలుడు. ఆ హంస విదర్భలోని దమయంతికి నలుడి గురించి చాలా మంచిగా చెబుతుంది. దీంతో దమయంతి నలుడిని స్వయం వరానికి ఆహ్వానిస్తుంది. దమయంతి చాలా అందగత్తె. ఆమెను మనువాడాలని దేవతలు సైతం కూడా పరితపిస్తుంటారు. ఇక ఈ విసయం ఇంద్రలోకంలోని దేవతలకు తెలుస్తుంది.

ఒక్క అవకాశం ఇవ్వలేదు
ఇదేమీ విచిత్రం. దేవలోకంలో దమయంతి కోసం కన్నులు కాయలు కాసేలా వేచి చూస్తుంటే మాకు ఒక్క అవకాశం ఇవ్వలేదు.. ఈ దమయంతి అని అనుకుంటారు. వెంటనే నలుడి దగ్గరకు ఇంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని దేవుడు, వస్తారు. ముందుగా నలుడి నుంచి ఒక మాట తీసుకుంటారు. తర్వాత నలుడికి అసలు విషయం చెబుతారు.

దమయంతి ఆనందపడిపోతుంది
మా నలుగురిలో ఎవరినైనా సరే దమయంతి పెళ్లి చేసుకునేలా నువ్వే మనస్సు మార్చాలని కోరుతారు. తర్వాత నలుడికి ఒక ఉంగరం ఇస్తాడు ఇంద్రుడు. నలుడు బాధపడతాడు. కానీ మాట ఇచ్చానని ఇంద్రుడు తనకు ఇచ్చిన ఉంగరాన్ని ధరించగానే అదృశ్యమై దమయంతి దగ్గరకు వెళ్లిపోతాడు. ఒంటిరిగా ఆమె దగ్గరకు వెళ్లి తన గురించి చెప్పుకుంటాడు. దమయంతి ఆనందపడిపోతుంది.

ఇంద్రలోకంలోని వారికి ఈర్ష్య కలుగుతుంది
కానీ ఇంద్రుడు చెప్పిన మాటలను దమయంతి చెబితే ఆమె కోప్పడుతుంది. నేను నిన్ను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను అంటుంది. తర్వాత స్వయం వరానికి నలుడి రూపంలో ఇంద్రుడు, వరుణుడు, వాయుదేవుడు, అగ్ని దేవుడు వస్తారు. వారితో పాటు నలుడు కూడా వస్తాడు. అయితే తన మనస్సు చెప్పిన వాడి మెడలోనే దమయంతి పూల మాల వేస్తుంది. వాస్తవానికి అతనే నిజమైన నలుడు. తర్వాత నలుడు, దమయంతి పెళ్లి చేసుకుంటారు. ఇంద్రలోకంలోని వారికి ఈర్ష్య కలుగుతుంది.

నలుడిలోకి కలిని ప్రవేశింపజేస్తారు
వారు నలుగురు నలుడిని ఎలా అయినా నాశనం చెయ్యాలనుకుంటారు. ఒకరోజు నలుడిలోకి కలిని ప్రవేశింపజేస్తారు. దాంతో నలుడు కొన్ని వ్యసనాలకు బానిస అవుతాడు. రాజ్యాన్ని కోల్పొతాడు. కట్టుబట్టలతో అడవుల పాలవుతాడు.

న్యాయంగానే బతికాడు
తన వల్ల దమయంతి కష్టాలుపడుతుందని భావించి తన భార్యకు దూరంగా వెళ్లిపోతాడు. దీంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోతుంది. నలుడు ఎక్కుడున్నా కూడా న్యాయంగానే బతికాడు. ఈ క్రమంలో ఒక రోజు అడవిలో కర్కోటకుడనే ఒక పాము రక్షిస్తాడు. అయితే ఆ పాము నలుడిని కాటు వేస్తుంది. దీంతో అతని రూపం మాత్రం వికారంగా మారుతుంది.

బాహుకుడిగా మార్చుకుంటాడు
అయినా నలుడు కుంగిపోడు. తన వ్యక్తిత్వాన్ని ఎప్పుడూ కూడా చంపుకోడు. తర్వాత తన పేరును బాహుకుడిగా మార్చుకుంటాడు. ఋతు వర్ణుడనే రాజు దగ్గర గుర్రాలకు శిక్షకుడిగా మారుతాడు. వంటవాడిగా పని చేస్తాడు. వంటలో అతనికి మించిన వారు లేరన్నట్లుగా వంట చేస్తాడు. నలుని వ్యక్తిత్వాన్ని చూసి చివరకు కలి నలుడి నుంచి దూరంగా వెళ్తాడు.

కుంగిపోకుండా జీవించాడు
తర్వాత తన భార్య దమయంతికి మళ్లీ స్వయంవరం నిర్వహిస్తున్నారని తెలుసుకుంటాడు. తర్వాత అక్కడికి వెళ్తాడు. కురూపిగా ఉన్న నలుడుని దమయంతి గుర్తు పట్టి అతన్నే పెళ్లి చేసుకుంటుంది. తర్వాత నలుడు మళ్లీ తన పూర్వ రూపాన్ని తెచ్చుకుంటాడు. నలుడు ఎప్పుడూ కుంగిపోకుండా జీవించాడు కాబట్టే ఇప్పటికీ చరిత్రలో నిలిచిపోయాడు. ధర్మాన్ని, న్యాయానికి కట్టుబడి ఉన్న మహారాజు నలుడు.



Click it and Unblock the Notifications