Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, జుట్టు, గోళ్లను ఎప్పుడు కత్తిరించుకుంటే శుభ ఫలితాలొస్తాయో తెలుసా...
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రోజున జుట్టు కత్తిరించుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం మనలో చాలా మంది ఎప్పుడు ఖాళీ సమయం దొరికితే.. అప్పుడు మాత్రమే హెయిర్ కట్ చేసుకుంటున్నారు. అయితే మన పెద్దలు మనకు కొన్ని ప్రత్యేక రోజులలో, ప్రత్యేక సమయాల్లో మాత్రం కటింగ్ షేవింగ్ చేసుకోవద్దని చెబుతుంటారు.

ఒకప్పుడు మాత్రం హెయిర్ కట్ చేసుకోడానికి వారం, వర్జ్యం, సమయం వంటివి కచ్చితంగా చూసేవారట. ఆ సమయం దాటితే అస్సలు జుట్టు జోలికి వెళ్లేవారే కాదట. ఎందుకంటే పురాణాల ప్రకారం.. ఏ రోజు పడితే.. ఆరోజు జుట్టును కటింగ్ చేసుకోకూడదట.

అలాగే గోర్లను కూడా కత్తిరించకూడదట. ఒక వేళ అలా చేసుకుంటే.. ప్రతికూల ఫలితాలు వస్తాయని భావించేవారట. ఈ నేపథ్యంలో శాస్త్రాల ప్రకారం.. ఏ రోజున హెయిర్ కట్ చేసుకోవాలి.. ఏ సమయంలో జుట్టు కత్తిరించుకుంటే శుభ ఫలితాలొస్తాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

ప్రతిరోజూ..
శాస్త్రాల ప్రకారం, మీరు కటింగ్ ఎప్పుడు చేసుకున్నా ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 గంటలలోపే పూర్తి చేయాలి. అప్పుడే మీకు శుభ ఫలితాలు వస్తాయి. సాయంకాలం వేళలో మరియు చీకటి పడ్డాక ఎప్పటికీ కటింగ్ చేసుకోకూడదు. అలాగే తండ్రి, కుమారులు ఒకేరోజున, అన్నదమ్ములు కూడా ఒకేరోజున కటింగ్ చేసుకోకూడదు అనే నియమం ఉంది.

సోమవారం..
సోమవారం రోజున కటింగ్ చేసుకుంటే.. మీ ఏడు నెలల ఆయుష్షు పెరుగుతుంది. మీకు సంపద, శ్రేయస్సు లభిస్తుంది. అయితే పిల్లలు కావాలనుకువాళ్లు.. ఒకే కుమారుడు ఉండే వారు సోమవారం రోజున కటింగ్, షేవింగ్ వంటివి చేసుకోకూడదు.

మంగళవారం..
సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మంగళవారం రోజున కటింగ్ షాపులు మూసేస్తారు. ఎందుకంటే ఈరోజున కటింగ్ చేసుకుంటే ఎనిమిది నెలల ఆయుష్షు తగ్గిపోతుందట. దీని ఫలితంగా మీ ఇంట్లో దుఃఖం కలుగుతుందట. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయట.

బుధవారం..
ఈరోజున కటింగ్ చేసుకున్న వారికి ఐదు నెలల ఆయుష్షు పెరుగుతుందట. అంతేకాక మీరు ఆరోగ్యవంతంగా ఉండేందుకు సహాయపడుతుంది. అలాగే సంపద కూడా పెరుగుతుందట. మీ కుటుంబ జీవితం కూడా సంతోషంగా ఉంటుందట.

గురువారం..
ఈరోజున కటింగ్ చేసుకుంటే.. మీకు పది నెలల ఆయుష్షు పెరుగుతుందట. అయితే లక్ష్మీదేవి ఇంట్లో ఉండాలని కోరుకునే వారు.. ఈరోజున కటింగ్, షేవింగ్ వంటివి చేయించుకోకూడదు. ఒకవేళ మీరు అలా చేస్తే.. ధన నష్టం జరగొచ్చు. పిల్లల నుండి కొన్ని సమస్యలు రావొచ్చు.

శుక్రవారం..
ఈరోజున కటింగ్, షేవింగ్ చేసుకుంటే.. పదకొండు నెలల ఆయుష్షు పెరుగుతుంది. అయితే అక్కా,చెల్లెళ్లు ఉన్నవారు ఈరోజున కటింగ్, షేవింగ్ వంటివి చేయించుకోకూడదు.

శనివారం..
ఈరోజున కటింగ్, షేవింగ్ చేసుకున్న వారికి ఏడు నెలల ఆయుష్షు తగ్గిపోతుంది. అంతేకాదు మీరు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంటుంది.

ఆదివారం..
చాలా మందికి ఆదివారం సెలవు రోజు కాబట్టి.. ఈ రోజున కటింగ్, షేవింగ్ చేసుకునేందుకు, అదే సమయంలో గోళ్లను కత్తిరించుకుంటూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఒక నెల ఆయుష్షు తగ్గిపోతుంది. ఎందుకంటే ఆదివారం నారాయణుడికి అంకితం చేయబడింది. అంతేకాదు ఈరోజున కటింగ్ చేసుకుంటే, శరీరం అధిక వేడి పొందుతుంది.

క్షవరానికి అనుకూల తిథులు..
శాస్త్రాల ప్రకారం, క్షురకర్మకు అనుకూలమైన తిథులు ఇవే. విదియ, తదియ, పంచమి, సప్తమి, త్రయోదశి శుభప్రదమైనవి.
అదే విధంగా ఆదివారం, శనివారం, మంగళవారం నాడు క్షవరం చేయించుకోవడం మంచిది కాదు.



Click it and Unblock the Notifications