Latest Updates
-
పడుకునే ముందు నెయ్యితో పాదాలకు మసాజ్ చేస్తే ఏమవుతుందో తెలుసా? -
దాబా స్టైల్ బట్టర్ చికెన్ సీక్రెట్ రెసిపి..రుచి చూస్తే ఒక్కసారితో ఆగరు -
బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? -
గోంగూర చికెన్ పచ్చడి ఇలా చేశారంటే..దాసోహం అవ్వాల్సిందే -
నాలికకు కిక్కిచ్చే చేప వెల్లుల్లి కారం..ఇలా చేశారంటే స్వర్గానికి బెత్తెడే దూరం! -
సమంత సీక్రెట్ ఇదే..రోజూ ఉదయం అలా చేస్తే లైఫ్ జిల్ జిల్ జిగా జిగా.. -
షుగర్, బీపీకి చెక్ పెట్టే కొర్రల కిచిడీ..వారంలో 2 రోజులు తింటే బరువు తగ్గడమే కాకుండా రోజంతా సూపర్ ఎనర్జీ! -
చికెన్, మటన్ బిర్యానీలను మరిపించే స్పైసీ టమాటా బిర్యానీ..కుక్కర్ లో ఈజీగా చేసేయండిలా.. -
తులసి తీర్థం మహిమ? చనిపోయిన మహిళ బతికింది! -
రెస్టారెంట్ రుచిని మించేలా ఇంట్లోనే బిసిబేలే బాత్.. సులభంగా ఎలా చేయాలంటే?
అధిక మాసంలో ఈ 4 వస్తువులు ఇంట్లో ఉంటే చాలా డేంజర్.. వెంటనే తీసేయండి.!
అధిక మాసం.. ప్రతి మూడేళ్లకొకసారి వచ్చే ఈ మాసంలో శుభ కార్యాలకు, పుణ్య కార్యాలకు నిషేధం ఉంటుంది. కానీ ఈ మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తూ జపాలు, దాన ధర్మాలు వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహిస్తారు. అందుకే ఈ నెలను పురుషోత్తమ మాసం అంటారు. మే 17 న ప్రారంభమైన అధిక జ్యేష్ఠ మాసం.. జూన్ 15 వరకు కొనసాగుతుంది. అయితే ఈ నెలలో కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవద్దని శాస్త్రం చెబుతోంది. మరి ఆ వస్తువులేంటి.. వాటిని ఎందుకు పారవేయాలి.. ఈ కథనంలో తెలుసుకుందాం..

అధిక మాసానికి సంబంధించి కొన్ని నియమాలను శాస్త్రాలు ప్రత్యేకంగా విశదీకరిస్తున్నాయి. ఈ నెలలో ఇంట్లో ప్రతికూలతను వ్యాపింపజేసే కొన్ని వస్తువులను తొలగించడం మంచిదని.. లేదంటే వాస్తు దోషం కలిగి ఇంట్లో సంతోషాన్ని, శాంతిని కోల్పోతారని శాస్త్రం చెబుతోంది. ముఖ్యంగా ఒక నాలుగు వస్తువులు మీ ఇంట్లో ఈ పరిస్థితిలో ఉంటే వెంటనే వాటిని బయటపారేయడం మంచింది.
విరిగిన విగ్రహాలు: వాస్తు శాస్త్రం ప్రకారం, అసలు విరిగిన విగ్రహాలు లేదా పగిలిన దేవుడి ఫొటోలను పూజ గదిలో ఉంచకూడదు. ముఖ్యంగా అధిక మాసంలో విరిగిన దేవతా విగ్రహాలను పూజ గది నుంచి తొలగించి నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. ఎందుకంటే, వీటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల వాస్తు దోషాల ప్రభావం తీవ్రంగా ఉంటుందట. అవి మీ కుటుంబ సుఖసంతోషాలను ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్ర్రం చెబుతోంది.
ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కలు: ఈ మాసంలో ఎండిపోయిన లేదా వాడిపోయిన మొక్కలను ఇంటి ప్రాంగణంలో ఉంచకూడదు. వీటి వల్ల ప్రతికూల శక్తి పెరిగి కుటుంబ సభ్యుల మనస్తత్వం, మానసిక స్థితిపై ప్రభావం చూపి మనశ్శాంతిని దూరం చేస్తుంది.

పగిలిన గాజు సామాను: అధిక మాసంలో ఇంట్లో పగిలిన గాజు సామాను ఉంచవద్దని వాస్తు శాస్త్రం చెబుతోంది. పగిలిన, బీటలు వారిన గాజు సామాను వాస్తు దోషాలను కలుగజేస్తుంది. అందుకే వాటిని ఇంట్లో ఉంచకపోవడం శ్రేయస్కరం.
విరిగిన లేదా ఆగిపోయిన గడియారాలు: వాస్తు శాస్త్రం ప్రకారం, ఈ మాసంలో ఇంట్లో విరిగిన గడియారాలు, లేదా ఆగిపోయిన వాచ్‌లు కుటుంబ సభ్యుల పురోగతికి అడ్డంకులు కలిగిస్తాయి. అందుకే అవి మీ ఇంట్లో ఉన్నట్లయితే వెంటనే వాటిని బయటపారేయడం ఉత్తమం.
శ్రీ మహావిష్ణువుకి ప్రీతికరమైన ఈ మాసంలో నిత్యం స్వామివారి ఆరాధన చేస్తూ, ఆయనకి ఇష్టమైన నైవేద్యాలు సమర్పించడం ద్వారా మీ ఇంటితో పాటు శరీరంలో ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి. దానధర్మాలు, జపాలు, పుణ్యకార్యాలు చేస్తూ అధిక మాసాన్ని గడపడం ద్వారా సానుకూల శక్తిని మీ ఇంట్లో నింపుకోవచ్చు.



Click it and Unblock the Notifications
