Latest Updates
-
ఆది శంకరాచార్యుడు 32 సంవత్సరాలలో చేసిన పనిఒక్క మనిషి హిందూధర్మాన్ని ఎలా రక్షించాడు -
జూన్ 21 వేసవి అయనాంతం: ఈ రాశుల వారికి అదృష్టం, కెరీర్లో ఊహించని మార్పులు! -
తోపుడు బండి స్టైల్ పుదీనా కొత్తిమీర చట్నీ..దోసెలు,ఇడ్లీలు ఎన్ని తింటారో మీకే తెలీదు! -
సింహం, ధనుస్సు రాశుల వారికి ధన యోగం.. ఈ రాశుల వారు జాగ్రత్త! - శుక్రవారం, 19 జూన్ 2026 -
సాయి బాబా ఇచ్చిన 11 మాటలు జీవన సూత్రాలు -
మీద పడ్డ ప్రియురాలు..ఆ బరువుకి చచ్చిపోయిన ప్రియుడు..షాకింగ్ వీడియో -
అల్లం వెల్లుల్లి పేస్ట్ నెలల తరబడి ఫ్రెష్ గా ఉండాలంటే ఇలా చేయండి -
భర్తలు మిస్ అవుతున్న ఈ చిన్న విషయం.. విడాకులకి దారితీస్తుందని తెలుసా.? -
వ్యసనాలను వదులుకోలేకపోతున్నారా.. యోగాతో ఇలా చెక్ పెట్టేయొచ్చు.! -
హార్ట్ ఎటాక్ వచ్చే 10 రోజుల ముందే కనిపించే లక్షణాలు ఇవే!
అధిక శ్రావణంలో శివ పూజ.. కోర్కెలు నెరవేర్చే భోళా శంకరుడు, మీ రాశిని బట్టి ఇలా పూజించండి
శ్రావణ మాసం అంటే ఆ పరమేశ్వరుడికి అత్యంత ప్రీతికరమైన నెల. అలాగే శ్రావణ మాసాన్ని ఆధ్యాత్మిక నెలగా కూడా పరిగణిస్తారు. శ్రావణ మాసంలో శివుడిని ఆరాధిస్తే కష్టాలు తొలగిపోతాయని, కోరిన కోర్కెలు నెరవేరుతాయని, తలపెట్టిన పనిలో విజయం అందుకుంటారని విశ్వాసం. శ్రావణ సోమవారం పరమేశ్వరుడి ఆరాధన వల్ల ఆయన అనుగ్రహం లభించి జీవితం సమస్యలు లేకుండా హాయిగా, సాఫీగా సాగుతుందని నమ్ముతారు.
పరమేశ్వరుడిని భోళా శంకరుడు అని కూడా పిలుస్తుంటారు. బిల్వ పత్రం సమర్పించినా, మంచి నీటితో అభిషేకం చేసినా శివుడు సంతోషించి అనుగ్రహిస్తాడు. సకల పాపాలు తొలగిపోతాయని, అంతా మంచే జరుగుతుందని నమ్ముతారు భక్తులు. ఈ ఏడాది శ్రావణ మాసం అధికంగా వస్తోంది. నెల రోజుల పాటు ఉండే శ్రావణం ఈ ఏడాది మాత్రం రెండు నెలల పాటు వస్తుంది. 19 సంవత్సరాల తర్వాత ఇలా శ్రావణ మాసం అధికంగా వచ్చింది. ఈ అధిక మాసంలో కూడా శివారాధన వల్ల మంచి ఫలితాలు వస్తాయంటున్నారు నిపుణులు. జ్యోతిష్యం ప్రకారం అధిక శ్రావణ మాసంలో శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు, ఆయన అనుగ్రహం పొందేందుకు ఏ రాశి వారు ఎలా పూజ చేయాలో ఇప్పుడు చూద్దాం.

మేషరాశి
మేష రాశి వారు అధిక శ్రావణ మాసంలో లింగానికి పాలు, నీళ్లతో అభిషేకం చేయాలి. బిల్ప పత్రాలు, చందనం, ఎర్రని పూలతో పూజించాలి. గులాబీ నీటిలో కొద్దిగా బెల్లం కలిపి పెడితే శివయ్య సంతోషిస్తాడు.
వృషభరాశి
వృషభ రాశి వారు ఆవు పాలు, పెరుగు, తేనెతో శివుడికి అభిషేకం చేయాలి. తెల్లని పూలు సమర్పించాలి. అలాగే వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
మిథునరాశి
మిథునరాశి వారు నెయ్యితో పరమేశ్వరుడికి అభిషేకం చేస్తే రెట్టింపు ప్రయోజనం పొందుతారు. పచ్చి పాలు, చెరకు రసాన్ని సమర్పించినా శుభఫలితాలు వస్తాయి.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారు అధిక శ్రావణ మాసంలో తెల్లని పూలు, చందనం, సుగంధ ద్రవ్యాలతో పాటు ఆవు పాలను సమర్పించాలి. నెయ్యితో అభిషేకం చేయాలి.
సింహ రాశి
సింహ రాశి వారు అధిక శ్రావణ మాసంలో తేనె, పంచదార, పచ్చి పాలతో లింగానికి అభిషేకం చేయాలి. తెల్లనిపూలు, గోధుమలు, ఎర్రని పూలు సమర్పించాలి. నెయ్యితో దీపం వెలిగించి ఆరాధించాలి.
కన్యా రాశి
కన్య రాశి వారు పరమేశ్వరుడికి బిల్వ పత్రాలు, చందనం సమర్పించి గంగాజలంతో అభిషేకం చేయాలి. చెరకు రసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.
తులారాశి
అధిక శ్రావణ మాసంలో తులా రాశి వారు బిల్వ పత్రాలతో శివుడిని ఆరాధించాలి. విభూది, పెరుగు, తేనెతో రుద్రాభిషేకం చేయాలి, శివారాధన సమయంలో ఓం నమః శివాయ మంత్రాన్ని జపించాలి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు అధిక శ్రావణ మాసంలో పాలు దానం చేస్తే మంచిది. గులాబీ పూలను లేదా ఎర్రని పూలను సమర్పించాలి.
ధనుస్సు రాశి
ధనుస్సు రాశి వారు తేనెతో పాటు పసుపు రంగు పూలను, చందనాన్ని, బిల్వ పత్రాలను శివయ్యకు సమర్పించాలి. పసుపు, ఆవు పాలతో అభిషేకం చేయాలి.
మకర రాశి
నీలి రంగు పూలు, బిల్వ పత్రాలు, దాతురాలను సమర్పిస్తే మంచి జరుగుతుంది. శివుని అనుగ్రహం పొందేందుకు గంగాజలంతో అభిషేకం చేయాలి.
కుంభ రాశి
చెరకు రసంతో పాటు నీలి రంగు పూలు, శమీ పూలను సమర్పించే శివయ్యను ఆరాధించాలి. నువ్వుల నూనెతో రుద్రాభిషేకం చేసినా మంచి జరుగుతుంది.
మీనరాశి
చెరకు రసం సమర్పించాలి. కుంకుమ పూలు, పసుపు రంగు పూలతో పూజించాలి. శివలింగానికి 11 సార్లు జలాభిషేకం చేయాలి.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications