Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
శివుడి ఈ రహస్యాలు మీకు తెలుసా..?
శివుడు హిందూ మతంలో అత్యంత పవిత్రమైన, శక్తివంతమైన దేవుడు ఎవరంటే మనకు గుర్తుకువచ్చేది ఆ పరమేశ్వరుడే, ఆ మహాశివుడే. ఆయనలో శక్తి, సృష్టి, సంహారం తత్వాలు ఉన్నాయ్. ఆయన వివిధ పేర్లతో పిలువబడతాడు: మహాదేవుడు, నీలకంఠుడు, శంభూ, శంకరుడు, ఇలా ఎన్నో నామాలు ఆయనకు ఉన్నాయ్. శివుడి తత్త్వాలను అర్థం చేసుకోవడం, ఆయన రహస్యాలను తెలుసుకోవడం భక్తులకు, ఆధ్యాత్మిక సాధకులకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మరి ఆ మహాదేవుడి గురించిన కొన్ని రహస్యాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

శివ లింగం
శివ లింగం శివుడికి ప్రతీక. ఇది ఆయన ఆధ్యాత్మిక శక్తిని, సృష్టి, సంహారం తత్వాన్ని సూచిస్తుంది. శివ లింగాన్ని పూజించడం వలన భక్తులు శాంతి, సుఖం, సంతోషాన్ని పొందుతారు. వేల యేళ్ల నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఈ శివలింగాలను పూజిస్తూ ఉన్నారు. శివుడు లింగం రూపంలో భక్తులకు దర్శనమిస్తాడు. భారత దేశంలో శివుడు స్వయంగా శివలింగంగా వెలిసిన 12 పవిత్రమైన జ్యోతిర్లింగాల ప్రదేశాలున్నాయ్.
త్రినేత్రం
శివుడు త్రినేత్రుడు, అంటే మూడు కళ్ల దేవుడు. ఈ మూడు కళ్ళు గతం, వర్తమానం, భవిష్యత్తును సూచిస్తాయి. ఆయన మూడవ కంటి శక్తి వలన సంహారం, మార్పు, పునరుద్ధరణ జరుగుతాయి. మూడో కన్నుతో విధ్వంసాలను, వినాశాలను కలుగ జేస్తాడు.
నీలకంఠుడు
శివుడు నీలకంఠుడు అని పిలువబడతాడు. సముద్ర మథనం సమయంలో విషాన్ని తాగడం వలన ఆయన కంఠం నీలంగా మారింది. ఈ సంఘటన శివుడి కరుణ, త్యాగాన్ని, ప్రపంచాన్ని రక్షించేందుకు ఆయన చేసిన సిధ్దిని సూచిస్తుంది. కాబట్టి నీలకంఠేశ్వరుడు ఈ శివుడు.
శివ తాండవం
శివుడు తన తాండవ నృత్యం ద్వారా సృష్టి, సంహారం, పునరుద్ధరణను సూచిస్తాడు. ఈ నృత్యం ఆయన శక్తి, ప్రతాపాన్ని ప్రదర్శిస్తుంది. శివ తాండవం సృష్టి యొక్క నిరంతర మార్పును, స్థితిని ప్రతిబింబిస్తుంది. రావణుడు శివుడి మహా భక్తుడు అన్న విషయం మనకు తెలిసిందే. శివుడిపై రావణుడు శివతాండవ స్తోత్రాన్ని రచించాడు.
వాహనం
శివుడి వాహనం నంది. ఈ నంది.. శక్తి, ధైర్యం, నమ్మకం, భక్తిని సూచిస్తుంది. నందిని పూజించడం వలన భక్తులు శివుడి అనుగ్రహాన్ని పొందుతారు. నంది లేనిదే శివలింగాన్ని ప్రతిష్టించరు. నందికి పూజ చేయనిదే శివ పూజ పూర్తి కాదు.
శివుడి పంచాక్షరి మంత్రం
శివుడికి అంకితమైన పంచాక్షరి మంత్రం "ఓం నమః శివాయ" అనేది పవిత్రమైన మంత్రం. ఈ మంత్రాన్ని జపించడం వలన భక్తులు ఆధ్యాత్మిక శాంతి, శక్తితో పాటు శివుడి అనుగ్రహాన్ని పొందుతారు. రోజూ ఉదయం పంచాక్షరీ మంత్రాన్ని స్నానం చేసిన తరువాత పఠిస్తే వారి జీవితంలో కొన్ని రోజుల్లోనే మంచి ఫలితాలను రావడం చూస్తారు. శివుడి అనుగ్రహం పొందాలంటే పంచాక్షరీ మంత్రాన్ని కచ్ఛితంగా పఠించాలి.
కైలాసం
శివుడు కైలాసంలోనే ఉంటారు. శివుడి నివాసం కైలాసమే. కైలాసమనేది శివుడి భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. మంచు కొండలతో ఈ కైలాసం ఉంటుంది. టిబెట్‌లో ఉన్న కైలాస పర్వతంలోనే ఈ కైలాసం ఉందని అంటారు. అక్కడే శివుడి కుటుంబం ఉందని పండితులు చెబుతుంటారు. ఆ కైలాస పర్వతాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ పూర్తిగా అధిరోహించలేదంటే అర్థం చేసుకోవచ్చు.
రుద్రాక్ష
రుద్రాక్ష మాలను ధరించడం శివుడి అనుగ్రహాన్ని పొందటానికి ఒక సాధన. రుద్రాక్ష బలాన్ని, ఆధ్యాత్మిక శక్తిని, శాంతిని అందిస్తుంది. రుద్రాక్షలో ఎన్నో శక్తులు దాగి ఉన్నాయని శాస్త్రీయ పరిశోధనలో తేలింది. ఎంతో మంది వైద్యులు కూడా రుద్రాక్షను ధరించమని ప్రోత్సహిస్తున్న విషయం మనకు తెలిసిందే.
రుద్రాభిషేకం
శివుడికి రుద్రాభిషేకం చేయడం ఆయనకు అత్యంత ప్రీతికరం. ఈ అభిషేకం శాంతి, సుఖం, సకల శుభాలను అందిస్తుంది. ఈ రుద్రాభిషేకం చేయించడం వల్ల మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. శివుడి ఉపాసన చేయడం వలన భక్తులు ఆధ్యాత్మిక సాధనలో ఉన్నతిని పొందవచ్చు. ఆయన అనుగ్రహం ద్వారా సుఖం, శాంతి మరియు ధైర్యం పొందవచ్చు.



Click it and Unblock the Notifications
