Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే.. ఎట్టిపరిస్థితుల్లో సాయంత్రం చేయకూడనివి..!
సాధారణంగా.. మన ఇంట్లో పెద్దవాళ్లు ఉంటే.. సాయంత్రం అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని సూచిస్తూ ఉంటారు. కానీ.. కొన్ని సందర్భాల్లో వాళ్ల మాటలు పట్టించుకోకుండా.. నియమాలను నిర్లక్ష్యం చేస్తుంటాం. కానీ.. మనకు ఉన్న కొన్ని అలవాట్లు.. మనపై, మన కుటుంబంపై లక్ష్మీదేవి ఆగ్రహించేలా చేస్తాయట.
హిందువుల ప్రకారం లక్ష్మీదేవిని సంతోషపెట్టినప్పుడు, మన ఇంటిని ఆమె ఆకర్షించేలా చేసినప్పుడు.. సంపద, శ్రేయస్సు ఎప్పటికీ.. మీ ఇంటిని వదిలివెళ్లదు. సంపద, శ్రేయస్సు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయని మన శాస్త్రాలు, హిందూ పురాణాలు చెబుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం పొందితే.. ధనం మన ఇంటికి వస్తుందని చెబుతాయి.
మీకు తెలుసా ? మీకున్న చిన్న చిన్న అలవాట్లే.. మీ అదృష్టాన్ని, ఆర్థిక పరిస్థితులను వెంటనే మార్చేస్తాయి. మీరు శాస్త్రాలను నమ్మేట్టు అయితే.. మీరు ఖచ్చితంగా.. కొన్ని నియమాలను పాటించాలి. మన చిన్న చిన్న అలవాట్లే.. ఆర్థిక స్తోమతపై చాలా ప్రభావం చూపుతాయి. మీకు దురదృష్టం, లక్ష్మీదేవికి ఆగ్రహం తీసుకొచ్చే అలవాట్లేంటో ఇప్పుడు చూద్దాం..వాటికి దూరంగా ఉందాం.

లక్ష్మీదేవి అనుగ్రహం
లక్ష్మీదేవి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉన్న ఇళ్లు.. ధనంతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే.. ఎక్కడైతే.. ఎక్కువ భక్తి, అనుకూలంగా ఉంటుందో.. అక్కడికి లక్ష్మీదేవి వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి.. ఎప్పుడూ.. లక్ష్మీదేవిను పూజిస్తూ ఉండాలి.

తులసిని పూజించడం
హిందూ పురాణాలు, శాస్త్రాల ప్రకారం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తులసీని పూజించడం, ముట్టుకోవడం నిషేధం. ఇలా చేస్తే దురదృష్టం, పేదరికం మీ కుటుంబాన్ని వెంటాడుతుంది.

తులసికి నీళ్లు పోయడం
తులసి మొక్కను పూజించడం, నీళ్లు పోయడం చాలా పవిత్రంగా భావిస్తాం. కానీ.. సాయంత్రంపూట ఇది మంచిది కాదు.

దీపం
సాయంత్రం కేవలం నెయ్యితో తులసి దగ్గర దీపం వెలిగించాలి. ఇలా చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. అలాగే..లక్ష్మీదేవిని ఇంటికి ఆకర్షించవచ్చు.

సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం
సూర్యాస్తమయం తర్వాత.. చెత్త ఊడవడాన్ని అపవిత్రంగా భావిస్తారు. శాస్త్రాల ప్రకారం ... సూర్యాస్తమయం తర్వాత చెత్త ఊడవడం వల్ల.. మీ సంతోషాన్ని, అదృష్టాన్ని కూడా ఊడ్చేసినట్టే అవుతుందట.

శారీరక సంబంధం
సాయంత్రం సమయంలో.. శారీరకంగా కలవడం వంటి పనులు.. మంచిది కాదని శాస్త్రాలు చెబుతాయి. హిందూ పురాణాల ప్రకారం.. సాయంత్రం సమయంలో శారీరర సంబంధం.. దురదృష్టాన్ని తీసుకొస్తుంది.

సాయంత్రం నిద్రపోవడం
సూర్యాస్తమయం సమయంలో.. నిద్రపోవడం వల్ల దురదృష్టంతో పాటు, నెగటివ్ ఎనర్జీ తీసుకొస్తుంది.

అనారోగ్య సమస్యలు
అలాగే సాయంత్రం పూట నిద్రపోతే.. ఒబేసిటీ, ఇతర అనారోగ్య సమస్యలకు.. కారణం అవుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

పాత్రలు కడగడం
తిన్న వెంటనే.. పాత్రలు శుభ్రం చేయకపోతే.. శని, చంద్రుల దుష్ప్రభావం మీ మీద పడుతుంది. అలాగే.. అన్నం తిన్నవెంటనే ప్లేట్ శుభ్రం చేయడం వల్ల.. లక్ష్మీదేవి అనుగ్రహం, సంపద, శ్రేయస్సు పొందగలుగుతారు.

చదువుకోవడం
సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోకూడదు అంటే.. కాస్త ఆశ్చర్యంగా ఉంటుంది కానీ.. పురాణాల ప్రకారం సూర్యాస్తమయం సమయంలో.. చదువుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.

ఆడుకోవాలి
సాయంత్రంపూట ఇంట్లో కూర్చుని చదువుకోవడం కంటే.. పిల్లలు బయట ఆడుకోవడం లేదా, ఫిజికల్ యాక్టివిటీస్ లో పాల్గొనడం మంచిదట.

ఉమ్మేయడం
మీ చుట్టూ ఉన్న పవిత్ర ప్రదేశాల్లో, ఉమ్మేయకూడని చెప్పిన ప్రాంతాల్లో ఉమ్మేడం వల్ల దురదృష్టం మిమ్మల్ని వెంటాడుతుంది. ఇలా చేయడం వల్ల.. మీ చుట్టు పక్కల ప్రాంతాలను అసహ్యంగా మార్చుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుందట.



Click it and Unblock the Notifications