Latest Updates
-
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.! -
నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగితే ఆ ప్రమాదం నుంచి బయటపడొచ్చా? -
మన పూర్వీకుల బలమైన ఆహారం.. రోగాల మాటే ఉండదు.. జొన్న సంగటి ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పొట్టపై స్ట్రెచ్ మార్క్స్‌కి ఖరీదైన ప్రొడక్ట్స్ వద్దు.. ఇంట్లోనే ఇలా చేశారంటే శాశ్వతంగా చారలు మాయం.! -
పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం..కట్ చేస్తే ఫ్యాన్ కి వేలాడుతూ..మౌనిక మృతికి కారణమేంటి? -
పులిసిపోయిన పెరుగుతో ఎన్ని లాభాలో.. ఇన్ని చేయొచ్చని తెలిస్తే ఇకపై అస్సలు పారబోయరు.!
ఎప్రిల్ 2024లో పండగలు, వ్రతాలు, పూజలు, శ్రీరామనవమి, హనుమాన్ జయంతి
ఎప్రిల్ నెలలో విశిష్టమైన హిందూ పండుగలున్నాయ్. తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది ప్రారంభమయ్యేది కూడా ఈ నెలలోనే. దీంతోపాటు శ్రీరామ నవమి, హనుమాన్ జయంతి కూడా ఇదే నెలలో జరగనున్నాయ్. హిందువుల పవిత్రపండగలే కాదు ముస్లిముల పవిత్ర పండగైన రంజాన్ కూడా ఇదే నెలలో జరుపోకున్న విషయం తెలిసిందే. పండగలే కాదు.. ఈ నెలలో పవిత్రంగా జరుపుకునే ఇతర వ్రతాలు, ఉపవాసాల గురించి తెలుసుకుందాం.

శీతల అష్టమి:
ఎప్రిల్ 2వ తేదీన శీతల అష్టమిని జరుపుకుంటాం. ఆ రోజున శీతల మాతను పూజింజి దీక్ష తీసుకున్నవారు ఉపవాసం ఉంటారు. శీతల మాతను పూజించి పిల్లలను ఆరోగ్యంగా వుంచాలని కోరుకుంటారు. శీతలమాత ఆశిస్సులు ఉంటే పిల్లలకు ఎలాంటి అనారోగ్యాలు రావని భక్తుల అపార నమ్మకం.
ఏకాదశి:
ఎప్రిల్ 5న ఏకాదశి వస్తోంది. ఆరోజు విష్ణుమూర్తికి పూజ చేసి ఉపవాస దీక్షను ఆచరిస్తే కష్టాలు, బాధలు ఉంటే తొలగిపోతాయ్ సుఖసంతోషాలు కలుగుతాయ్.
చతుర్ధశి శివపూజ:
శివభక్తులు ఈ నెలలో ఎప్రిల్ 7వ తేదీన వచ్చే చతుర్ధశికి ఉపవాసదీక్షను ఆచరిస్తారు. ఇలా చేస్తే ఆ మహాశివుడు తమని కష్టాల నుంచి తొలగిస్తాడని భక్తుల అపార విశ్వాసం.
సోమవతి అమావాస్య:
ఎప్రిల్ 8న సోమవతి అమావాస్యను జరుపుకుంటారు. సోమవారం నాడు అమావాస్య వస్తుంది కాబట్టి ఆరోజును సోమవతి అమావాస్యగా పిలుచుకుంటారు.
రంజాన్:
ముస్లిముల పవిత్ర పండగ రంజాన్ ఎప్రిల్ 12న జరుపుకోనున్నారు. దానికి ముందు రోజు ఎప్రిల్ 11న నెలవంక దర్శనం కానుంది. పంగకి నెల రోజుల ముందు నుంచే ముస్లిములు ఉపవాస దీక్షలు పాటించి ప్రార్థనలు చేస్తారు.
మేష సంక్రాంతి:
ఎప్రిల్ 13న మేష సంక్రాంతి జరుపుకుంటారు. సూర్యుడు మీనం నుంచి మేషంలోకి సంచరిస్తారు. కాబట్టి అదే రోజు మేష సంక్రాంతి జరుపుకుంటారు. స్యుర్య క్యాలెండర్‌ను బట్టి హిందూ నూతన సంవత్సరం ప్రారంభయ్యేది కూడా ఈ మేష సంక్రాంతి నుంచే.
శ్రీరామనవమి:
ఇక చైత్ర నవరాత్రల్లో నవమి రోజున అంటే ఎప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమిని భక్తులు జరుపుకోనున్నారు. అయోధ్యలో శ్రీరామనవమి ఉత్సవాలు మందెన్నడూ లేనంత ఘనంగా జరగనున్నాయ్. వీధుల్లో, గుళ్లో శ్రీ సీతారాముల కళ్యాణాలు ఘనంగా జరుపుతారు.
కామద ఏకాదశి:
ఎప్రిల్ 19వ తేదీన కామద ఏకాదశిని జరుపుకుంటారు. చైత్ర మాసంలో శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని కామద ఏకాదశిగా పిలుస్తారు. ఆరోజు ఉపవాస దీక్షతో విష్ణుమూర్తిని పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని భక్తుల నమ్మకం.
శ్రీ హనుమాన్ జయంతి:
హిందువులు ఘనంగా జరుపుకునే పండగల్లో శ్రీ హనుమాన్ జయంతి గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హైదరాబాద్‌లో జులూస్‌లు, హనుమాన్ రథయాత్రలు పెద్ద ఎత్తున జరుగుతుంటాయ్. చైత్ర మాసంలో పౌర్ణమి రోజున ఎప్రిల్ 23వ తేదీన హనుమాన్ జయంతిని జరుపుకోనున్నారు.



Click it and Unblock the Notifications
