Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
పుట్టపర్తితో వెనిజులా బంధం..నాటి ప్రెసిడెంట్ మదురో నుంచి నేటి ప్రెసిడెంట్ డెల్సీ వరకు అందరూ సాయి భక్తులే!
అమెరికాలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని, అక్రమ ఆయుధాలు కలిగి ఉన్నారంటూ,అమెరికా వ్యతిరేక చర్యలు చేపడుతున్నారన్న ఆరోపణలతో గత వారం వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అమెరికా ప్రత్యేక బలగాలు వెనిజులా రాజధాని కారకోస్ లో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి మదురో,ఆయన భార్యను కూడా బంధించి అమెరికా తీసుకెళ్లారు.
అయితే మదురో అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ తో ఆయనకు ఉన్న ప్రత్యేక అనుబంధంపై సోషల్ మీడియాలో ఫొటోలు,వీడియోలు పెద్ద ఎత్తున సర్క్యులేట్ అయ్యాయి. మదురో,ఆయన భార్య పుట్టపర్తి సాయిబాబా భక్తులు కాగా, గతంలో మదురో దంపతులు పుట్టపర్తి వచ్చి శ్రీ సత్యసాయిని దర్శించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మదురో ఆఫీసులో కూడా సత్యసాయి ఫొటో ఉండేదని సమాచారం. మదురోకు వివాహానికి ముందే తన భార్య ద్వారా సత్యసాయితో పరిచయం ఏర్పడింది. 2005లో మదురో విదేశాంగ మంత్రిగా ఉన్నప్పుడు, దంపతులిద్దరూ పుట్టపర్తికి వచ్చి సత్యసాయిని దర్శించుకున్నారు.
ప్రస్తుత ప్రెసిడెంట్ కూడా బాబా భక్తురాలే
ఇదిలాఉంటే, మదురోని అమెరికా అరెస్ట్ చేసిన తర్వాత వెనిజులాకు అప్పటివరకు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న డెల్సీ రోడ్రిగ్స్
ను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమించింది ఆ దేశ సుప్రీం కోర్టు.
విశేషం ఏంటంటే డెల్సీ రోడ్రిగ్స్ కూడా పుట్టపర్తి సాయి భక్తురాలే. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వెనిజులా నూతన అధ్యక్షురాలికి, మన ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తికి విడదీయరాని ఆధ్యాత్మిక అనుబంధం ఉందన్న విషయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పుట్టపర్తి బాబాకు పరమ భక్తురాలు
డెల్సీ రోడ్రిగ్స్ వెనిజులా ఉపాధ్యక్షురాలిగా ఉన్న సమయంలోనే పలుమార్లు శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిని సందర్శించారు. సాయికుల్వంత్ మందిరంలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో నివాళులు అర్పించారు. ముఖ్యంగా 2023 ఆగస్టులో, ఆ తర్వాత 2024 అక్టోబర్ లో ఆమె పుట్టపర్తికి విచ్చేసి ఆశీస్సులు తీసుకున్నారు.
ప్రశాంతి నిలయంలో ఆధ్యాత్మిక అనుభూతి
గత ఏడాది అక్టోబర్ 26న డెల్సీ రోడ్రిగ్స్ పుట్టపర్తికి వచ్చినప్పుడు ఆమెతో పాటు భారత్ లోని వెనెజువెలా రాయబారి కాపయా గొంజాలెజ్ కూడా ఉన్నారు. శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ఆమెకు సాదర స్వాగతం పలికి, ఆశ్రమంలోని విశేషాలను వివరించారు. ఆశ్రమంలోని గర్భగుడి, శాంతి భవన్ లలో ఆమె గడిపారు.

బాబా దివ్య సన్నిధిలో గడపడం నాకు ఎంతో మానసిక ప్రశాంతతను, శాంతిని ఇచ్చింది అని ఆమె ఆ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఏడాది వ్యవధిలోనే రెండుసార్లు భారత్‌కు వచ్చి పుట్టపర్తిని సందర్శించడం బాబా పట్ల ఆమెకున్న అపార నమ్మకానికి నిదర్శనం. ప్రస్తుతం ఆమె పాత పర్యటనలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
వెనిజులాలో భారతీయ ఆధ్యాత్మికత
వెనిజులాలో సత్యసాయి బాబా సేవా కేంద్రాలతో పాటు బ్రహ్మ కుమారీలు, రాధా స్వామి వంటి అనేక భారతీయ ఆధ్యాత్మిక సంస్థలు, సాంస్కృతిక కేంద్రాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ దేశ పగ్గాలు చేపట్టిన డెల్సీ రోడ్రిగ్స్ కూడా సాయి భక్తురాలిగా ఉండటం, భారతీయ ఆధ్యాత్మికత సరిహద్దులు దాటి విశ్వవ్యాప్తమైందనడానికి నిదర్శనంగా నిలుస్తోంది.



Click it and Unblock the Notifications