Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
Good Friday 2025 wishes: ప్రభువు ఆశీస్సులు మీపై ఉండుగాక..గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలను తెలుగులో ఇలా చెప్పుకోండి
గుడ్ ఫ్రైడే క్రైస్తవులకు ఎంతో ముఖ్యమైన రోజు. లోకానికి శాంతిదూతగా వచ్చిన యేసుక్రీస్తుని 2వేల ఏళ్ల క్రితం శుక్రవారం రోజున కల్వరి గిరిపై శిలువ వేశారు. యేసుక్రీస్తు సిలువ వేయబడిన రోజును గుర్తుచేసుకోవడానికి ఈ పండుగను జరుపుకుంటారు. ఈ రోజున క్రైస్తవులు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. చర్చిలకు వెళ్లి ఏసుక్రీస్తుని స్మరించుకుంటారు. ప్రతి సంవత్సరం ఈస్గర్ ముందు శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడేని జరుపుకుంటారు. ఆవిధంగా ఈ ఏడాది ఏప్రిల్ 18,2025న గుడ్ ఫ్రైని జరుపుకుంటారు. గుడ్ ఫ్రైడే అనేది ఏదో కేవలం ఓ మతానికి సంబంధించనదిగా కాకుండా అది మన జీవితాలకు సరైన దిశానిర్దేశం చేసుకునే అవకాశాన్ని ఇస్తుంది.
ఏసు ప్రభువుని శిలువపై ఉంచి కాళ్లు,చేతుల్లోకి మేకులు దించానా రక్తం కారుతున్న తన శరీరంతో.."దేవుడా నా దేవుడా నన్నెందుకు చేయి విడిచావు" అంటూ ఆయన చేసిన ఆర్తనాదాలు ఆకాశం వరకు వినిపించాయి. వీరు చేస్తున్న తప్పు వీరికి తెలియదు కాబట్టి వీళ్లను క్షమించు అని ఏసు ప్రార్థించారు. మనుషులు చేసిన పాపాలకు ప్రక్షాళన కోరుతూ తన ప్రాణాన్ని విడిచి మరణాన్ని సైతం ఏసుక్రీస్తు ఓడించారని బైబిల్ లో పేర్కొన్నారు. అందుకే ఈ రోజుని గుడ్ ఫ్రెడే, గ్రేట్ ఫ్రైడేగా క్రిస్టియన్స్ అందరూ జరుపుకుంటారు.

గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ ప్రియమైనవారికి, బంధుమిత్రులకు ఆశీస్సులు, శుభాకాంక్షల సందేశాలను పంపండి..తద్వారా ఏసు ప్రభువు ఆశీస్సులు వారి జీవితాల్లో నిలిచి ఉంటాయి. ఫ్రెండ్స్, బంధువులు, కుటుంబసభ్యులు,ప్రియమైనవారికి పంపగల కొన్ని గుడ్ ఫ్రైడే శుభాకాంక్షల సందేశాలను ఇక్కడ చూడండి.
గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఇలా చెప్పండి
-ప్రభువు మీ జీవితంలో సంతోషాన్ని నింపాలని, మీ ఇంట ఆనందపు కాంతులు వెదజల్లాలని కోరుకుంటూ మీకు,మీ ముకుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-ఇతరుల కోసం మనం చేసే త్యాగమే గొప్ప త్యాగం అని ఈ రోజు మనకు బోధిస్తుంది. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-వాహనాలు బాగు చేసేవాడు మెకానిక్, చెడిపోయిన మెసీన్లను బాగుచేసేవాడు ఇంజనీర్, శరీరాన్ని బాగు చేసేవాడు డాక్టర్, చెడిపోయిన వారి స్థితిని బాగుచేసేవాడు దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తు ఆశీస్సులు మీ అందరిపై ఉండుగాక. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-నా యందు విశ్వాసముంచు ప్రతివారును చీకటిలో నిలచి యుండకుండనట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను..మీకు,మీ కుటుంబసభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-ప్రేమ,త్యాగం ద్వారా మాత్రమే జీవితంలో నిజమైన శాంతిని,ఆనందం పొందగలం అని గుడ్ ఫ్రైడే మనకు బోధిస్తుంది. ప్రభువు ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండుగాక.
-ప్రభువైన ఏసు కృప మీ జీవితాన్ని ప్రకాశవంతం చేసి ప్రతి అడుగులోనూ మీకు విజయాన్ని ప్రసాదించుగాక.
-పాపాల పరిహారం కోసం సిలువపై ప్రాణాలర్పించిన యేసు ప్రభువును గుర్తుచేసుకుంటూ.. మీ జీవితంలో వెలుగు నిండాలని కోరుకుంటూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-సిలువ వేదనలో మానవాళికి విముక్తిని ప్రసాదించిన కరుణామయుడు యేసు. ఆయన ప్రేమను, త్యాగాన్ని ఎప్పటికీ మరవద్దు. గుడ్ ఫ్రైడే.
-గుడ్ ఫ్రైడే కేవలం దుఃఖ దినం కాదు..ఇది దేవుని అపారమైన ప్రేమకు నిదర్శనం. ఈ రోజు మన జీవితాల్లో మార్పును తీసుకురావాలని ఆశిద్దాం.
-యేసు క్రీస్తు త్యాగం మనకు కొత్త జీవితాన్ని ఇచ్చింది.ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆయన బోధనలను ఆచరిద్దాం.
-మనందరం పాపం నుండి విముక్తి పొందేలా యేసు ప్రభువు తన జీవితాన్ని మనకోసం త్యాగం చేశాడు. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-మనందరం దేవుడి బిడ్డలం..ప్రసంచశాంతికి మనందరం కలిసుండాలి..మీరు,మీ కుటుంబసభ్యులు సుఖ సంతోషాలతో వర్థిల్లాలని ఆకాంక్షిస్తూ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-ఈ గుడ్ ఫ్రైడే ప్రత్యేక సందర్భంగా ఏసుక్రీస్తు మీకు,మీ కుటుంబానికి ఎల్లప్పుడూ సరైన మార్గాన్ని చూపించాలని,ఆయన ఆశీస్సులు మీపై ఉండాలని ప్రార్థిస్తున్నాను. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-ప్రభువైన ఏసుక్రీస్తు త్యాగాన్ని మర్చిపోవద్దు. మనం మత మార్గాన్ని అనుసరించి మన జీవితాన్ని ఇలాగే గడపాలి. మీకు,మీ కుటుంబ సభ్యులకు గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-మన ఆత్మను పవిత్రంగా ఉంచుకోడానికి ప్రతికష్టాన్ని మనం ఎదుర్కోవాలని యేసు త్యాగం మనకు బోధిస్తుంది. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-మన జీవితాల్లో శాంతిని తీసుకురావడానికి ప్రభువు చేసిన త్యాగం ఎల్లప్పుడూ మనకు స్ఫూర్తినిస్తుంది.
-యేసు క్రీస్తు బాధులు మనకు ఓర్పును, సహనాన్ని నేర్పుతాయి. ఈ గుడ్ ఫ్రైడే మీకు ధైర్యాన్ని, విశ్వాసాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను.
-యేసు క్రీస్తు చూపిన క్షమాగుణాన్ని మనం అలవర్చుకుందాం. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును..తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-సిలువపై ఏసు క్రీస్తు పొందిన బాధలు మనకు శాంతిని చేకూర్చుగాక. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-సిలువపై క్రీస్తు కార్చిన ప్రతి రక్తపు బొట్టు మనకు రక్షణ ఇచ్చింది. గుడ్ ఫ్రైడే.
-యేసు నామం జిపించడం ద్వారా మనకు శాంతి లభిస్తుంది.
-ఈ పవిత్రమైన శుక్రవారం మీకు,మీ ప్రియమైన వారికి శుభం చేకూర్చుగాక.
-బాధలోనూ వెలుగు చూపే రోజు గుడ్ ఫ్రైడే.
-క్రీస్తు ప్రేమను అనుభవిస్తూ..దానిని తోటివారికి పంచుదాం. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-దేవుని మార్గంలో నడుస్తూ ఆయన ప్రేమను పొందుదాం. గుడ్ ఫ్రైడే.
-యేసు క్రీస్తు ప్రేమ మనకు రక్షణ. గుడ్ ఫ్రైడే.
-ఆయన ఎవరినీ ద్వేషించలేదు..అందరి పాపాలను తనపైనే భరించాడు..అలాంటివాడు మన ప్రభువైన ఏసు..ఈ రోజు ఆయనకు అంకితం.. గుడ్ ఫ్రైడే.
-బంగారం మీతో రాదు..సంపద మీకు ఉపయోగపడదు..దేవుడు ఇచ్చిన ప్రేమ మాత్రమే మీతో చివరి వరకు ఉంటుంది. గుడ్ ఫ్రైడే 2025..ప్రభువైన ఏసుని గుర్తుంచుకో.
-మనం ఏసు ప్రభు పదాల దగ్గర ధూళిలం..ప్రేమ,త్యాగపు పుష్పాలం..ఆయన మార్గాన్ని అనుసరించడానికి ఈ రోజే ప్రతిజ్ణ చేద్దాం.. గుడ్ ఫ్రైడే.
-ఈ రోజు పవిత్రమైన గుడ్ ఫ్రైడే రోజు..మీ అందరికీ 2025 శుభ శుక్రవారం శుభాకాంక్షలు.
-సర్వశక్తిమంతుడు మీపై,మీ ప్రియమైనవారిపై ఉత్తమ ఆశీర్వాదాలను కురిపించుగాక. గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు.
-గుడ్ ఫ్రైడే స్పూర్తి మిమ్మల్ని నీతిమంతులుగా, మంచితనంతో కూడిన జీవితాన్ని గడపడానికి ప్రేరేపిస్తుంది.
-పరిశుద్ధాత్మ మిమ్మల్ని ప్రమాదం నుంచి కాపాడుగాక, దేవుడు మీకు ధర్మమార్గాన్ని చాపించును గాక.
-దేవుడు గొప్పవాడు. నువ్వు అతన్ని అడిగితే ఖచ్చితంగా నీకు అది లభిస్తుంది..నువ్వు దాని కోసం వెతికితే ఖచ్చితంగా నీకు అది లభిస్తుంది. అందుకే చెప్తున్నాను దేవుని తలుపులు తట్టండి..దేవుడు ఖచ్చితంగా మీ మాట ఆలకిస్తాడు..తలుపులు మీకోసం తెరవబడతాయి. గుడ్ ఫ్రైడే.



Click it and Unblock the Notifications











