Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు భారీ శుభవార్త..తెలిస్తే ఎగిరి గంతేస్తారు
కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వరస్వామి కొలువై ఉన్న తిరుమల వెళ్తున్నాం అని ఎవరికైనా చెప్తే మాకు ఓ లడ్డూ తీసుకురండి అని బుంధువులు,తెలిసిన వాళ్లందరూ అడుగుతంటారు. అయితే ఒక్కో భక్తుడికి పరిమిత సంఖ్యలో 6-7 లడ్డూలను మాత్రమే తిరుమలలో ఇస్తారు. దీంతో అడిగినవాళ్లందరికీ లడ్డూ ప్రసాదాన్ని ఇవ్వలేకపోతుంటాం. అయితే తిరుమలలో ఇకపై అడిగిన లడ్డూలు ఇస్తారంట. అవును నిజమే. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) కొత్త చైర్మన్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన బీఆర్ నాయుడు కొత్త కొత్త నిర్ణయాలతో శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ లు చెప్తున్నారు.
శ్రీవారి భక్తులకు ఇకపై అడిగినన్ని లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అదనపు లడ్డూల తయారీకి అవసరమైన పోటు సిబ్బంది నియామకానికి సిద్దమవుతోంది. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి అదనంగా మరో 74 మంది శ్రీ వైష్ణవులత పాటు మరో 10మంది శ్రీవైస్ణవులు కాని వారిని నియమించనున్నట్లు తెలుస్తోంది.

రోజుకి ఎన్ని లడ్డూలు చేస్తారు
కాగా,ప్రస్తుతం టీటీడీ ప్రతిరోజూ 3.5లక్షల చిన్న లడ్డూలు, 6వేల కళ్యాణం లడ్డూ(పెద్ద లడ్డు)ని తయారు చేస్తోంది. తిరుమలతో పాటు హైదరాబాద్,బెంగళూరు,చెన్నై సిటీల్లోని స్థానిక ఆలయాల్లో కూడా శ్రీవారి లడ్డూ ప్రసాదాన్ని విక్రయిస్తున్నారు. అయితే వారాంతాలు,ప్రత్యేక పర్వదినాలు, బ్రహ్మోత్సవాల టైంలో లడ్డూ ప్రసాదంకి ఎక్కువ ఉంటోంది. దీంతో అదనంగా ప్రతిరోజూ మరో 50వేల చిన్న లడ్డూలు, 4వేల పెద్ద లడ్డూలు తయారు చేయాలని టీటీడీ నిర్ణయించింది. తిరుమల లడ్డూ ప్రసాదానికి పేటెంట్ కూడా ఉంది. 2009లోనే తిరుమల లడ్డూకి భౌగోళిక గుర్తింపు(GI) లభించింది.
వందల ఏళ్ల చరిత్ర
తిరుమల లడ్డూ ప్రసాదానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. తిరుమల శ్రీవారి ప్రసాదంగా లడ్డూ పంపిణీ సుమారుగా 300 ఏళ్ల కిందటే ప్రారంభమైంది. 1715 ఆగస్టు 2న తొలిసారిగా లడ్డూను తిరుమల ప్రసాదంగా భక్తులకు అందించారని తెలుస్తోంది. అయితే మొదట్లో బూందీగా ప్రారంభమైన తిరుమల లడ్డూ ప్రసాదం కాలక్రమంలో 1940 నాటికి లడ్డూగా మారినట్లు కొందరు పండితులు చెప్తారు. ఇక పల్లవుల కాలం నుంచే ప్రసాదాలు పంపిణీ చేసినట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి.
మూడు రకాల లడ్డూలు
సాధారణంగా మనకు తెలిసిన తిరుమల లడ్డూలు రెండే. భక్తులకు దర్శనంతో పాటు ఇచ్చేది..దీనిని అదనంగా కావాలంటే రూ. 50 పెట్టి కొనాలి. రెండో రకం కళ్యాణోత్సవం లడ్డూ దీని ధర రూ.200 ఉంటుంది. అయితే ఇవే కాకుండా ఆస్థానం లడ్డూ అని మరొకటి కూడా ఉంటుంది. ప్రత్యేక పండుగల సమయంలో, రాష్ట్రపతి,ప్రధానమంత్రి లాంటి విశిష్ఠ అతిథులు తిరుమల వచ్చిన సమయంలో వీటిని తయారుచేస్తారు. ఈ లడ్డు బరువు 750 గ్రాములు ఉంటుంది.



Click it and Unblock the Notifications