పవర్ ఫుల్ హనుమాన్ మంత్రాలు..ఇవి జపిస్తే సకల సుఖాలు,శత్రువుల పీడ పోతుంది!

దేశవ్యాప్తంగా ఇవాళ హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.వాస్తవానికి హనుమాన్ జయంతిని ఏటా రెండుసార్లు జరుపుకుంటారు. నార్త్ ఇండియాలోని అనేక ప్రాంతాల్లో హనుమంతుడు చైత్రమాసంలోని శుక్ష పక్షమి పౌర్ణమి నాడు జన్మించాడని నమ్ముతారు. వాల్మీకి రామాయణం ప్రకారం కార్తీక మాసంలోని కృష్ణ పక్ష చుతుర్దశి నాడు స్వాతి నక్షత్రంలో ఆంజనేయుడు జన్మించాడని చెప్పారు. అందుకే ఆ రోజుని కూడా హనుమాన్ జయంతిగా జరుపుకుంటారు. ఇదే రోజున సీతాదేవి ఆంజనేయస్వామికి చిరంజీవిగా వరం ప్రసాదించిందని కూడా చెబుతారు.

ఇవాళ చైత్రమాస శుక్ష పక్షమి పౌర్ణమి సందర్భంగా యావత్ భారతదేశం హనుమాన్ జన్మోత్సవాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. శ్రీరామచంద్రుని పరమభక్తుడైన హనుమంతుడు జన్మించిన ఈ పవిత్రమైన రోజున భక్తులు స్వామి అనుగ్రహం కోసం ఉపవాస దీక్షలు చేపడతారు, సుందరకాండ వంటి పవిత్ర గ్రంథాలను పారాయణం చేస్తారు, విశేష పూజలు నిర్వహిస్తారు. కొన్ని ప్రత్యేక హనుమంతుడి మంత్రాలను జపిస్తే ఆర్థిక స్థిరత్వం, దీర్ఘకాలిక ఋణాల నుండి విముక్తి,జీవితంలో వెల్లువెత్తే సానుకూల శక్తి లభిస్తాయని నమ్మకం. మీ విధిని సైతం మార్చగల శక్తి కలిగిన, హనుమాన్ కృపాకటాక్షాలను అందించే ఆ ప్రభావవంతమైన మంత్రాలను వాటి జప విధానాన్ని ఇక్కడ చూడండి.

Hanuman Jayanti 2025 Powerful Mantras to Transform Your Destiny

ఓం హనుమతే నమః

ఇది హనుమంతుని ఆరాధనలో అత్యంత ప్రాథమికమైన, శక్తివంతమైన బీజ మంత్రం. బీజం అంటే విత్తనం.. ఎలాగైతే ఒక చిన్న విత్తనంలో మహావృక్షం దాగి ఉంటుందో, అలాగే ఈ మంత్రంలో హనుమంతుని సకల శక్తులూ నిక్షిప్తమై ఉంటాయి. దీనిని నిరంతరం, శ్రద్ధతో జపించడం వల్ల మనసును పట్టి పీడిస్తున్న అనవసర భయాలు, అనుమానాలు, నిరాశా నిస్పృహలు, మానసిక అస్థిరతలు క్రమంగా తొలగిపోతాయి. ఆత్మన్యూనతా భావం నశించి, అపారమైన ఆత్మవిశ్వాసం పెంపొందుతుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా ధైర్యంగా నిలబడే మానసిక స్థైర్యాన్ని ఈ మంత్రం ప్రసాదిస్తుంది. విద్యార్థులు, ఉద్యోగార్థులు, మానసిక ఒత్తిడితో బాధపడేవారు ఈ మంత్రాన్ని రోజూ జపించడం వల్ల విశేష ప్రయోజనం పొందుతారు.

ఓం ఐం హ్రీం హనుమతే శ్రీ రామ దూతాయ నమః
ఈ మంత్రం కార్యసిద్ధికి, అడ్డంకుల నివారణకు అత్యంత ప్రసిద్ధమైనది. 'ఐం' సరస్వతీ బీజాక్షరం కాగా 'హ్రీం' శక్తి బీజాక్షరం .. ఇవి మంత్రానికి అదనపు శక్తిని చేకూరుస్తాయి. మీరు తలపెట్టిన పనులలో తరచుగా ఆటంకాలు ఎదురవుతున్నా, ఎంత ప్రయత్నించినా పనులు ముందుకు సాగకపోయినా ఈ మంత్రాన్ని జపించడం వల్ల సత్వర ఫలితం కనిపిస్తుంది. ఈ మంత్రం మీ వృత్తి, వ్యాపారాలలో ఎదురయ్యే పోటీని తట్టుకుని నిలబడటానికి, అభివృద్ధి సాధించడానికి, కోర్టు కేసులు, న్యాయపరమైన చిక్కులలో విజయం సాధించడానికి దోహదపడుతుందని ప్రగాఢంగా విశ్వసిస్తారు. ఎవరి అదృష్టం అయితే స్తంభించిపోయి, ఏ ప్రయత్నం చేసినా కలిసి రావడం లేదో వారికి ఈ మంత్ర జపం నూతన ఉత్తేజాన్ని అందించి, అదృష్ట మార్గాలను తెరుస్తుంది.

ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి. తన్నో హనుమత్ ప్రచోదయాత్

ఇది హనుమాన్ గాయత్రీ మంత్రం. గాయత్రీ మంత్రాలు మన బుద్ధిని ప్రచోదనం చేసి, సన్మార్గంలో నడిపించే అపార శక్తి కలిగినవి. ఈ మంత్రం ప్రత్యేకించి విద్యార్థులు, పరిశోధకులు, ఉపాధ్యాయులు మరియు జ్ఞానాన్ని అభ్యసించే ప్రతి ఒక్కరికీ అత్యంత ప్రభావవంతమైనది. ఇది మేధస్సును పదును పెట్టి, గ్రహణ శక్తిని వృద్ధి చేస్తుంది. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది,ముఖ్యంగా ఏకాగ్రతను పెంచుతుంది. చదువుపై శ్రద్ధ నిలపడానికి, క్లిష్టమైన విషయాలను సులువుగా అర్థం చేసుకోవడానికి ఈ మంత్ర జపం ఎంతగానో ఉపకరిస్తుంది. ఆధ్యాత్మిక సాధనలో ఉన్నత సోపానాలను అధిరోహించాలనుకునే వారికి కూడా ఇది మార్గనిర్దేశం చేస్తుంది.

ఓం నమో హనుమతే రుద్రావతారాయ సర్వశత్రునాశాయ నమః

హనుమంతుడు రుద్రుని అవతారంగా కీర్తించబడ్డాడు, అందువల్ల ఈ మంత్రం అపారమైన రక్షణ శక్తిని కలిగి ఉంటుంది. ఇది మీ చుట్టూ ఒక శక్తివంతమైన ఆధ్యాత్మిక రక్షణ కవచంగా పనిచేస్తుంది. ప్రత్యక్ష, పరోక్ష శత్రువుల నుండి వచ్చే ఆటంకాలు, ఈర్ష్య, అసూయల వల్ల కలిగే నరదృష్టి ఇతర దుష్టశక్తులు, ప్రతికూల శక్తుల నుండి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుతుంది. జీవితంలో ఏదైనా అంతుచిక్కని సంఘర్షణ, తెలియని భయం లేదా నిరంతర సమస్యలు వేధిస్తుంటే ఈ మంత్ర జపం వాటి మూలాలను కనుగొని వాటిని సమూలంగా నాశనం చేస్తుంది. గృహంలో, వ్యాపార స్థలంలో ప్రతికూల శక్తుల ప్రభావం ఉందని భావిస్తే,ఈ మంత్రాన్ని జపించడం ద్వారా శాంతి, సామరస్యం నెలకొంటాయి.

Take a Poll

మంత్ర జప విధానం

-మంత్రాల శక్తి వాటిని ఉచ్చరించే విధానంపై, సాధకుడి శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది. కేవలం యాంత్రికంగా కాకుండా పూర్తి భక్తిశ్రద్ధలతో, నిర్దేశిత పద్ధతిలో జపించినప్పుడే మంత్రాలు సంపూర్ణ ఫలాన్ని అందిస్తాయి.

-మంత్రాన్ని జపించే ముందు, ఉదయం లేదా సాయంత్రం స్నానం చేసి,ఉతికిన శుభ్రమైన వస్త్రాలు ధరించాలి. హనుమంతునికి ఎరుపు లేదా కుంకుమ రంగు వస్త్రాలు అత్యంత ప్రీతికరమైనవి కాబట్టి, వాటిని ధరించడం మరింత పవిత్రమైనదిగా, ఆయన అనుగ్రహాన్ని త్వరగా అందించేదిగా పరిగణిస్తారు. ఇది మనసును, శరీరాన్ని జపానికి సిద్ధం చేస్తుంది.

-తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసి ప్రశాంతమైన, ధ్యానానికి అనుకూలమైన ఏకాంత ప్రదేశంలో ఒక శుభ్రమైన ఆసనం (దర్భాసనం, ఉన్ని ఆసనం లేదా శుభ్రమైన వస్త్రం)పై స్థిరంగా కూర్చోండి.

-ప్రార్థనా స్థలాన్ని గంగాజలం లేదా పసుపు నీటితో శుద్ధి చేసి అక్కడ హనుమంతుని విగ్రహం లేదా చిత్రపటాన్ని భక్తితో ప్రతిష్టించండి.

-జపానికి ముందు, దీపం (నెయ్యి లేదా నువ్వుల నూనెతో) వెలిగించి, సుగంధభరితమైన ధూపం వేసి ఎర్రటి పువ్వులు (కనకాంబరాలు, మందారాలు), బెల్లం కలిపిన శనగపప్పు (వడపప్పు), అరటిపండ్లు,కుంకుమను హనుమంతుడికి భక్తితో సమర్పించండి. ఈ ఉపచారాలు వాతావరణాన్ని ఆధ్యాత్మికంగా చైతన్యవంతం చేసి, మీ సాధనకు అవసరమైన సానుకూల శక్తిని అందిస్తాయి. మీరు ఏ ప్రయోజనం కోసం జపం చేస్తున్నారో స్పష్టంగా సంకల్పం చెప్పుకోండి.

-మంత్రాన్ని లెక్కించడానికి తులసి, ఎర్రచందనం లేదా రుద్రాక్ష జపమాలను ఉపయోగించడం శ్రేష్ఠం. జపమాలలో సాధారణంగా 108 పూసలు ఉంటాయి. ఇది విశ్వాంతరాళంలోని దివ్య సంఖ్యకు ప్రతీక. జపించేటప్పుడు ప్రతి పూసపై ఒకసారి మంత్రాన్ని పూర్తి ఏకాగ్రతతో జపించాలి. మేరుపూసను దాటరాదు..మాలను వెనుకకు తిప్పి జపాన్ని కొనసాగించాలి.

-జపించేటప్పుడు, మీ కళ్ళు మూసుకుని ఉండటం లేదా అర్ధనిమీలిత నేత్రాలతో స్వామి రూపంపై దృష్టి కేంద్రీకరించడం మంచిది. మీ మనస్సు ఇతర ఆలోచనల వైపు మళ్ళకుండా, ఇక్కడ, అక్కడ అనవసరంగా తిరుగుతూ ఉండనివ్వకండి. హనుమంతుని పరాక్రమాన్ని, భక్తిని, సేవా తత్పరతను మననం చేసుకుంటూ, మీ భావోద్వేగాలను, ప్రార్థనను ఆయన పాదాల చెంత కేంద్రీకరించండి.

-మంత్ర ఉచ్చారణ స్పష్టంగా, నెమ్మదిగా, లయబద్ధంగా, దోషరహితంగా ఉండాలి. మంత్రంలోని ప్రతి అక్షరం దాని నిర్దిష్ట కంపనాలను కలిగి ఉంటుంది, కాబట్టి సరైన ఉచ్చారణ ముఖ్యం. మంత్ర ఉచ్చారణ కేవలం పెదవులకే పరిమితం కాకూడదు, అది మీ హృదయాంతరాళాల నుండి పూర్తి భక్తిభావంతో రావాలి. బిగ్గరగా జపించలేని పరిస్థితుల్లో మానసికంగా (మనసులోనే) జపించడం కూడా దాదాపు అంతే ప్రభావవంతంగా ఉంటుంది.

-జపం పూర్తయిన తర్వాత, కనీసం కొన్ని నిమిషాల పాటు మౌనంగా ధ్యానం చేయండి. ఆపై హనుమంతుడి పాదాలకు సాష్టాంగ నమస్కారం చేసి మీ మనసులోని కోరికలను, సమస్యలను నివేదించుకోండి.

-చివరిగా హనుమంతునికి మీ శక్తికొలది నైవేద్యాన్ని సమర్పించండి. లడ్డూ, బెల్లం-శనగపప్పు, బూందీ లేదా పానకం వంటివి ప్రసాదంగా స్వామికి అర్పించి, ఆ ప్రసాదాన్ని కుటుంబ సభ్యులకు, వీలైతే ఇరుగుపొరుగు వారికి పంచి, మీరు కూడా స్వీకరించండి. ఇది భగవంతుని అనుగ్రహాన్ని ఇతరులతో పంచుకోవడాన్ని, సమష్టి ఆనందాన్ని సూచిస్తుంది.

Story first published: Thursday, May 22, 2025, 14:06 [IST]
Desktop Bottom Promotion