Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
House Warming Ceremony: 2025లో గృహ ప్రవేశానికి అనుకూలమైన తేదీలు ఇవే
కొత్త ఇంటిని నిర్మించినా లేదా ఉన్న ఇంటిని మరమత్తు చేయించిన తర్వాత మంచి ముహూర్తం చూసుకొని ఆ ఇంట్లోకి అడుగుపెడతారు చాలామంది. గృహ ప్రవేశ వేడుక అనేది భారతీయ సంస్కృతిలో ప్రత్యేకంగా జరుపుకునే శుభ సందర్భం. కొత్త ఇంట్లోకి ప్రవేశించడం అనేది మతపరమైన, సామాజిక దశ. ఇది మంచి శుభ సమయంలో చేయడం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. హిందూమతం ప్రకారం మంచి ముహూర్తంలో నూతన ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఆ ఇంట్లో ఆనందం,శాంతి, శ్రేయస్సు లభిస్తాయని హిందూ మతం నమ్ముతుంది.
అయితే ప్రతి ఏటా గృహ ప్రవేశానికి అనుకూలమైన వివిధ తేదీలలో శుభ ముహూర్తాలు నిర్ణయించబడతాయి. త్వరలో కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం. ప్రస్తుతం ఇంటి నిర్మాణం చేస్తున్న చాలామంది కొత్త ఏడాది కొత్త ఇంట్లోకి ప్రవేశించాలని భావిస్తుంటారు. కొందరు అయితే వచ్చే ఏడాది ఎప్పుడు బాగుంది ఇంట్లోకి చేరడానికి అని ఇప్పటినుంచే పండితులను అడుగుతుంటారు. ఇక,వచ్చే ఏడాది ఇల్లు కట్టాలి అనుకున్నవాళ్లు కూడా ఇప్పటి నుంచే గృహ ప్రవేశం ఎప్పుడైతే బాగుంటదో ముహూర్తం చూసుకుంటున్నారు. ఇంటి నిర్మాణం పూర్తిగా అవకపోయినా కూడా మంచి ముహూర్తం ఉంటే చాలు కొందరు గృహప్రవేశం చేస్తుంటారు.

2025లో అనేక శుభప్రదమైన గృహ ప్రవేశ ముహూర్తాలు ఉన్నాయి. అయితే 2025 సంవత్సరంలో వచ్చే ప్రధాన గృహ ప్రవేశ ముహూర్తాల తేదీలు, సమయాల లిస్ట్ ని ఇక్కడ చూసి తెలుసుకోండి. తద్వారా మీరు మీ గృహ ప్రవేశాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
2025లో గృహ ప్రవేశం కోసం అనుకూలమైన తేదీలు
జనవరిలో గృహ ప్రవేశానికి శుభ సమయం లేదు.
ఫిబ్రవరిలో గృహ ప్రవేశ ముహూర్తం - 6, 7, 8, 14, 15, 17 తేదీలు
మార్చి- మార్చి 1, 5, 6, 14, 15
ఏప్రిల్- ఏప్రిల్ 30
మే - మే 1, 7, 8, 9, 10, 14, 17, 22, 23, 28
జూన్- జూన్ 4, 6
జూలై నుండి సెప్టెంబరు వరకు గృహ ప్రవేశానికి ఎలాంటి శుభ సమయం లేదు.
అక్టోబర్- 23, 24, 29
నవంబర్- నవంబర్ 3, 6, 7, 8, 14, 15, 24, 29
డిసెంబర్- 1, 5, 6.
Note: మత విశ్వాల ఆధారంగా ఈ కథనం ఇవ్వబడింది. బోల్డ్ స్కై తెలుగు దీనిని ధృవీకరించలేదు. దీనిని పాటించడం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.



Click it and Unblock the Notifications