Latest Updates
-
ఐఫోన్ 18పై మోజు.. భార్యను సర్ప్రైజ్ చేసేందుకు భర్త ఏం చేశాడో తెలిస్తే నోరెళ్లబెడతారు.! -
రాయలసీమ కారం చికెన్: ఈ ఒక్క సీక్రెట్ మసాలాతో చేస్తే టేస్ట్ జబర్దస్త్ -
మంచింగ్కి మస్తుగా ఉండే గోంగూర మటన్ లివర్ ఫ్రై.. బ్యాచ్లర్స్ సైతం ఈజీగా చేసుకోవచ్చు.! -
హైదరాబాద్ లో పోలీస్ పైశాచికత్వం: మహిళను కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లి..వీడియో చూడండి -
రఫ్ క్యారెక్టర్లో తగ్గేదే లే.. ఈ రాశుల వారు తప్పున్నా సారీ కూడా చెప్పరట.! -
రాజస్థానీ మలై ప్యాజ్.. రోటీ, చపాతీల్లోకి బెస్ట్ సైడ్ డిష్..ఎలా చేసుకోవాలంటే.. -
చుక్క నూనె, ఇసుక లేకుండానే రోస్టెడ్ పల్లీలు.. ఎలా చేసుకోవాలంటే -
వీటిని ఫ్రిజ్లో పెట్టి తింటే క్యాన్సర్ రావడం పక్కా.. పొరపాటున కూడా ఈ పని చేయకండి.! -
అల్లుడిపై ఐదుగురు పిల్లల అత్త వ్యామోహం..కన్న కూతురికే సవతిలా మారి..చివరికి ఏమైందంటే.. -
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.!
స్పటికతో మీ కష్టాలన్నీ మాయం.. ఇలా చేసి చూడండి.. అద్భుతాలు జరుగుతాయ్..!!
మీరు ఏదైనా మార్వాడీ షాపులకు వెళ్తే అక్కడ తెల్లని రాయి ఒకటి కనబడుతుంది. దానికి కుంకుమ పెట్టి ఒక ప్టేటులో ఉంచి ఆ షాపు కౌంటర్ దగ్గర పెడతారు. ఇలాంటి తెల్లిని రాయే స్పటికగా మనం చెప్పుకుంటాం. బంగారు దుకాణాల్లో ఎక్కువగా వీటిని ఉపయోగిస్తారు. నరదృష్టి తొలగడానికి వ్యాపారవేత్తలు దీనిని తమ షాపులో పెట్టుకుంటారు. స్పటిక గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం.

నరదృష్టి తొలిగి ధనాకర్షణ పెరగడానికి పటికను ఈ విధంగా ఉపయోగించాలి. ఇంట్లో చికాకులు, గొడవలు లేకుండా ఉండాలన్నా నరఘోష నరపీడ తొలగాలి, ఆర్థికపరమైన చిక్కులు తొలగి ధనాకర్షణ పెరగాలన్నా కూడా స్పటికతో ఇక్కడ మేము చెప్పిన విధంగా చేయాలి. ఇలా చేయడం వల్ల సానుకూల శక్తిని పెంచుతుంది. ఈ పట్టికను అమావాస్యనాడు కొనకూడదు. సాయంత్రం 6:00 దాటిన తర్వాత కొనకూడదు. ఒక పెద్ద స్పటికను ఆది, సోమవారాల్లో ఇంటికి తెచ్చిపెట్టుకోవాలి. అమావాస్య నాడు లేదంటే పౌర్ణమి గడియల్లో, ఏదైనా శనివారం లేదా ఆది, సోమవారాలనాడు ఇంటి గుమ్మం పైన కట్టాలి.
ధారంతో లేదా వెంట్రుకలతో చేసిన తాడుతో కలిపి కట్టాలి. లేదంటే ఎరుపు రంగు వస్త్రంలో ఈ పట్టికను పెట్టి మూటగట్టి గుమ్మం పైన వేలాడదీయాలి. దీనిని ప్రతి అమావాస్యకు ఒకసారిగానీ మూడు నెలలకు లేదా ఆరు నెలలకు ఒకసారి గానీ మన వీలును బట్టి మార్చుకోవచ్చు. వాడిన స్పటికను నీటిలో వదలాలి. ఇంటిలోనికి తీసుకొని వెళ్లకూడదు. ఈ స్పటిక క్రింద నుంచి మనం వస్తూ వెళ్తూ ఉండడం వల్ల అది మనలో ఉన్న ప్రతికూల శక్తిని, నరదృష్టిని. లాగేసుకుంటుంది. తాంత్రిక ప్రయోగాలను తొలగించుకోవడానికి ఒక నల్లటి వస్త్రంలో స్పటికతో పాటు ఆరు లవంగాలు ఒక రూపాయి కాయిన్ వేసి కాలభైరవ స్వరూపంగా భావించి నల్లటి తాడుతో లేదా దారంతో తొమ్మిది సార్లు చుట్టి మూటగట్టి ఆఫీస్ బయటగాని ఇంటి గుమ్మంపైన గానీ కట్టినట్లయితే అన్నీ తొలగిపోయి జనాకర్షణ పెరుగుతుంది. నరఘోష ఎక్కువగా ఉంటే ఒక చిన్న స్పటిక ముక్కని దంచి నీటిలో కలిపి స్నానం చేస్తే నరదృష్టి దోషాలు అన్ని తొలగిపోతాయి.
పీడకలలు రాకుండా ఉండాలంటే దిండు క్రింద ఒక స్పటిక ముక్క పెట్టి పడుకోవాలి. వ్యాపార స్థలంలో ఒక పెద్ద స్పటిక ముఖ ఒక గాజు ప్లేటుపై ఉంచుకున్నట్లయితే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది. ఒక స్పటిక ముక్కను కదిలించకుండా ఒక గాజు గిన్నెలో పెట్టి ఎవరికీ కనిపించకుండా ఒక నెల వరకు ఒక మూల ఉంచినట్లయితే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ అంతా లాగేసుకుంటుంది. ఆ తర్వాత స్పటికను ఇంటి బయట ఎక్కడైనా ఒక గుంత తీసి పాతిపెట్టాలి. వ్యాపారం నష్టపోకుండా ఉండాలన్నా ఇంట్లో డబ్బు నిలవడానికి స్పటిక పౌడర్ ని నీటిలో కరగనిచ్చి ఆ నీటిలో తడిబట్ట వేసి ఇల్లంతా తుడుచుకోవాలి. దీనివల్ల ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. లక్ష్మీదేవికి ప్రీతిక కనుక స్పటికను ఇంట్లో ఈ విధంగా ఉపయోగించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా కలుగుతుంది.
స్పటికను కొనుగోలు చేసే ముందు దాని స్వచ్ఛతను, పారదర్శకతను పరీక్షించాలి. మంచి నాణ్యత గల స్పటికను మాత్రమే కొనుగోలు చేయాలి. స్పటికను శుభ్రమైన ప్రదేశంలో ఉంచడం, దానిని తరుచూ శుభ్రం చేయడం చాలా ముఖ్యం.



Click it and Unblock the Notifications
