Latest Updates
-
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.?
ఈనెల 20న పెళ్లికాని యువతులు ఇలా చేయాలి.. లేకపోతే!
మహిళలు చేసుకునే అతిపెద్ద పండగల్లో ఒక పండగ అట్లతద్ది. పెళ్లి కానీ అమ్మాయిల నుంచి పెళ్ళైన స్త్రీల వరకు ప్రతీ ఒక్కరూ ప్రతి సంవత్సరం ఈ పండగను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండగను ఆశ్వయుజ మాసంలో దసరా పండుగ తరువాత వచ్చే తదియ తిథి రోజున జరుపుకుంటారు.
అట్లతద్ది ఎందుకు జరుపుకుంటారంటే?
ఈ సంవత్సరం ఈ పండుగ ఈనెల 20న అంటే రేపే వచ్చింది. ఉత్తర భారత దేశంలో కార్వాచౌత్‌గా జరుపుకునే ఈ పండుగను అయిదేళ్ల పై బడిన ఆడపిల్లల నుంచి పెద్దల వరకు జరుపుకుంటారు. ఈ పండగను పెళ్లి కాని యువతులు తమకు మంచి భర్త రావాలని, పెళ్ళైన స్త్రీలు తమకు మంచి భర్త దొరికినందుకు, భర్త దీర్గాయుష్షు బాగుండాలని కోరుకునేందుకు ఈ పండుగను జరుపుకుంటారు.

అట్లతద్ది పూజా విధానం:
అట్లతద్ది రోజు ఆడవాళ్లు తెల్లవారు జామునే నిద్రలేచి, స్నానాలు ఆచరించి, పదకొండు మంది ముత్తయిదువులతో కలిసి పొట్లకాయ, ముద్దపప్పు, గోంగూర పచ్చడి, పెరుగుతో కలిపిన భోజనం చేస్తారు. తరువాత సాయంత్రం వరకు ఉపవాసం ఉంటారు. అనంతరం ఆటపాటలు, ఊయల ఊగడం వంటి కార్యక్రమాలు చేస్తారు.
సాయంత్రం మళ్ళీ స్నానాలు చేస్తారు. ఒక పళ్లెంలో పూలను పేర్చి, గౌరీ చేసి.. గౌరీ పూజ చేస్తారు. పూజ చేసిన తరువాత పళ్లెంలో పెట్టిన పూలను చేతులకు కట్టుకోవడం, తలలో పెట్టుకోవడం వంటివి చేస్తారు. అనంతరం కుడుములు, పాలతాలికలు, పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు. మళ్ళీ ఇంకోసారి గౌరీపూజ చేసి, ఆరోజు రాత్రి చంద్రుడు ఉదయించాక రాత్రి భోజనం స్వీకరిస్తారు.
అట్లతద్ది రోజు మహిళలు ఏం చేయాలి?
అట్లతద్ది అనేది మహిళల పండగ. మహిళలు ఆరోజు ఉదయమే లేచి పైన పేర్కొన్నట్లుగా కూరగాయలతో భోజనం చేయాలి. రోజంతా ఉపవాసం ఉంటూ పండుగను జరుపుకోవాలి. సాయంత్రం గౌరీపూజ చేసి, నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకోవాలి. అప్పుడే పెళ్లిళ్లు కాబోయే అమ్మాయిలకు మంచి భర్త, పెళ్ళైన స్త్రీ భర్త దీర్గాయుస్సుతో ఉంటారని పెద్దలు చెబుతూ ఉంటారు.
వాయినం ఎలా ఇచ్చుకోవాలి
అట్లతద్ది రోజు ఒక్కో ముత్తైదువుకు 11 అట్లతో పాటు.. గౌరీదేవి పూజ కోసం అక్కడ పెట్టిన కుడుములు, తాంబూలం కలిపి వాయినం ఇస్తారు. అట్లతద్ది రోజు గౌరీ పూజలో పాల్గొనే మహిళలకు ఇలా వాయినం ఇవ్వడం అనేది తరతరాలుగా వస్తున్నటువంటి ఆచారం. అయితే ఇలా ఇచ్చిన వాయినం తీసుకున్న స్త్రీ లేదా ఆ స్త్రీ ఇంట్లోని కుంటుంబ సభ్యులు మాత్రమే తినాల్సి ఉంటుంది. అప్పుడే గౌరీ దేవి ఆశీస్సులు ఉంటాయని నమ్మకం
వాయినం తీసుకునేటప్పుడు మహిళలు తమ కొంగును ముందుకు చాచి అందులో తాంబూలం తీసుకోవాలి. ఇలా తీసుకునేటప్పుడు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ పాట పాడుతూ పుచ్చుకుంటారు.
అట్లతద్ది ఎలా వచ్చిందంటే?
అట్లతద్ది అనేది పది సంవత్సరాల పండుగ. పండగ అనడం కంటే నోము అనడం ఉత్తమం. దీనిని ఏ స్త్రీ అయినా పది సంవత్సరాలు చేస్తుంది. పూర్వం చిన్నప్పుడే మహిళలకు పెళ్లిళ్లు చేసే వారు కనుక.. మంచి భర్త రావడం అయిదు సంవత్సరాల నుంచే ఈ పండగను చేసుకోవడం మొదలుపెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతూ వస్తోంది.



Click it and Unblock the Notifications
