Latest Updates
-
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి! -
వేళ్లు జుర్రుకుంటూ తినడం పక్కా.. కేవలం 20 నిమిషాల్లో నలుగురికి సరిపోయే మేథీ చమన్ కర్రీ.!
కార్తీకమాసంలో శివుడికి ఇలా ప్రదక్షిణలు చేస్తేనే కోరికలు నెరవేరుతాయి.. ఎలా చేయాలంటే?
హిందువులకు కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. ఈ కార్తీకమాసంలో హిందువులందరూ శివుడు, విష్ణువు ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. అలాగే దైవారాధన చేస్తుంటారు. ఈ దైవారాధనలో భాగంగా దేవుళ్ళ విగ్రహాల చుట్టూ ప్రదక్షిణాలు చేయడం హిందూ సంప్రదాయంలో సర్వ సాధారణం. కోరికలు నెరవేరడానికి, సమస్యలు తీరడానికి ఈ ప్రదక్షిణాలు ఎంతగానో దోహదపడతాయి.
అయితే ఈ ప్రదక్షిణలు చేయడంలో కూడా ఒక పద్ధతి ఉంటుందట. ఆ పద్ధతి ప్రకారం ప్రదక్షిణాలు చేస్తేనే కోరికలు నెరవేరడంతో పాటు దైవానుగ్రహం మనపైన ఉంటుందని పండిత నిపుణులతో పాటు భక్తులు కూడా విశ్వసిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో శివారాధన చేసే సమయంలో కొన్ని నియమాలు పాటిస్తూ ప్రదక్షిణలు చేస్తేనే కార్యం సిద్ధిస్తుంది. అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఎలాంటి నిమయాలు పాటించాలి? ఏ విధంగా ప్రదక్షిణాలు చేయాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శివాలయంలో ప్రదక్షిణాలు చేయాల్సిన విధానం..
కార్తీకమాసంలో శివుడు చుట్టూ ప్రదక్షణాలు చేయాలంటే ఒక ప్రత్యేకమైన పద్దతిలో చేయాలి. ఆ పద్దతిని వ్యాస మహర్షి తాను రచించిన లింగ పురాణంలో కూలంకుషంగా వివరించారు. ఆ లింగ పురాణం ప్రకారం.. శివుడికి ప్రదక్షిణలు చేసేటప్పుడు, శివాలయంలో శివుడి ధ్వజస్థంభం ముందు మొక్కుకొని ప్రదక్షిణలు ప్రారంభించాలి. ధ్వజస్థంభం నుంచి చండీశ్వరుడి వరకూ ప్రదక్షిణ చేయాలి.
అక్కడ చండీశ్వరున్ని దర్శించుకొని అక్కడి నుంచి మళ్ళీ ధ్వజస్థంభం వరకు వెళ్ళాలి. అక్కడ ఒక్క క్షణం ఆగిపోయి, అక్కడి నుంచి శివలింగం అభిషేక జలం బయటికి వెళ్లే సోమసూత్రం వరకు వెళ్లి, మళ్ళీ ధ్వజస్థంభం వరకు వెళ్ళాలి. అప్పుడే శివుడికి ఒక ప్రదక్షిణ పూర్తవుతుంది. మళ్ళీ వెనక్కి తిరిగి నందీశ్వరుడిని దర్శించుకుంటేనే శివుడి ప్రదక్షిణ పూర్తిగా చేసినట్లు అవుతుంది. దీనినే లింగ పురాణంలో సోమసూత్ర ప్రదక్షిణ, చండీ ప్రదక్షిణ అని చెప్తుంటారు. ఈ విధమైన ప్రదక్షిణ చేస్తే.. ఒక్క ప్రదక్షిణ పదివేల ప్రదక్షిణలతో సమానమని లింగ పురాణంలో పేర్కొన్నారు. ఇలా మూడు ప్రదక్షిణలు చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహం మీపై మెండుగా ఉంటుందట.
ఈ తప్పులు చేయకూడదు..
శివ ప్రదక్షిణ చేసే సమయంలో కొన్ని తప్పులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. అదేంటంటే శివ ప్రదక్షిణ చేసే సమయంలో శివుడి సోమసూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లో దాటకూడదు శివుడి అభిషేక జలం సోమసూత్రం నుంచి వెళ్తుంది. అక్కడ ప్రమాద గణాలు కొలువై ఉంటారట. వారిని దాటుకుంటూ వెళ్తే శివుడు కోపానికి గురవుతాడని చెప్తుంటారు.
సాధారణంగా ప్రతి శివాలయంలో శివుడి లింగానికి ఎదురుగా నందీశ్వరుడి విగ్రహం ఉంటుంది. అయితే ప్రదక్షిణలు చేసే సమయంలో శివుడికి, నందికి మధ్యలో నుంచి ఎట్టిపరిస్థితుల్లోనూ నడవకూడదని నిపుణులు చెప్తున్నారు. ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదంటున్నారు. అలాగే విగ్రహాన్ని మొక్కుకునేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడి మొక్కుకోవద్దని, పక్కకు జరిపి మొక్కుకోవాలంటున్నారు.
గమనిక: ఈ కథనంలో మేము పొందు పరిచిన అంశాలు పలువురు నిపుణుల సలహాలు, పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. వీటిని పాటించడం, విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications
