Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
దేవుడు అంతటా ఉన్నప్పుడు గుడికి ఎందుకు వెళ్లాలి? స్వామి వివేకానంద అద్భుత సమాధానం!
దేవుడు సర్వాంతర్యామి..సృష్టిలో అణువణువునా ఆయన వ్యాపించి ఉన్నాడు అనేది అన్ని ప్రధాన మతాలు, ఆధ్యాత్మిక సంప్రదాయాలు చెప్పే పరమ సత్యం. మరి భగవంతుడు అంతటా ఉన్నప్పుడు, ఎక్కడో ఉన్న గుడికో, మసీదుకో, చర్చికి మాత్రమే ఎందుకు వెళ్లాలి? దేవుడిని దర్శించుకోవడానికి ప్రత్యేకంగా పవిత్ర స్థలాలను ఎందుకు నిర్మించుకోవాలి? చాలామందికి వచ్చే ఈ సహజమైన సందేహానికి, ఆధునిక భారతదేశపు గొప్ప ఆధ్యాత్మిక గురువు స్వామి వివేకానంద ఒక అద్భుతమైన ఉదాహరణతో సమాధానం చెప్పారు.

మన చుట్టూ గాలి అంతటా వ్యాపించి ఉంది. అది మనకు తెలుసు. కానీ ఆ గాలిని మనం బలంగా అనుభూతి చెందాలంటే మనం ఒక ఫ్యాన్ ఆన్ చేసుకుంటాం. అదే విధంగా ఈ విశ్వమంతా దైవత్వం వ్యాపించి ఉండవచ్చు. కానీ మన చుట్టూ అదృశ్యంగా ఉన్న ఆ దైవిక శక్తిని మనం మరింత లోతుగా అనుభూతి చెందడానికి, మనసును భగవంతుడిపై లగ్నం చేయడానికి దేవాలయాలు ఒక సాధనంగా ఉపయోగపడతాయని స్వామి వివేకానంద చెప్పారు.
గుడి దేవుడిని సృష్టించదు, కానీ ఉన్న దేవుడిని మనం ఫీల్ అయ్యేలా చేస్తుంది. అసలు దేవాలయాలు ఎందుకు అవసరం అంటే అందులో మూడు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి.
ఏకాగ్రతకు వేదిక
మన దైనందిన జీవితంలో మనసు ఎప్పుడూ ఎన్నో ఆలోచనలతో పరిగెడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్నప్పుడు లేదా ఆఫీసులో ఉన్నప్పుడు ప్రశాంతంగా కూర్చుని దేవుడిని ధ్యానించడం కష్టం. కానీ గుడిలోకి అడుగుపెట్టగానే ఆ వాతావరణం వేరుగా ఉంటుంది. అక్కడి అద్భుతమైన శిల్పకళ, గంటల నాదం, మంత్రోచ్ఛారణలు, అగరుబత్తీల సువాసన.. ఇవన్నీ క్షణాల్లో మనసును ప్రశాంతపరిచి, మన దృష్టిని అంతర్ముఖం చేస్తాయి.
ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు
హిందూ సంప్రదాయంలో దేవాలయాలను కేవలం నాలుగు గోడల భవనాలుగా కట్టరు. ఆగమ శాస్త్రాలు, పవిత్రమైన వాస్తు నియమాలు, యంత్ర స్థాపనల ఆధారంగా నిర్మిస్తారు. ప్రాణప్రతిష్ఠ చేసిన విగ్రహం నుంచి, నిత్యం అక్కడ చదివే మంత్రాల వల్ల ఆ ప్రదేశం అంతా ఒక శక్తివంతమైన పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. అది మనలోని అలసటను తీర్చి, ఆధ్యాత్మిక శక్తిని నింపుతుంది.
ఐక్యత
గుడి అనేది కేవలం భక్తికి మాత్రమే కాదు, ఒక సామాజిక అనుసంధానానికి కూడా వేదిక. పదిమందితో కలిసి దైవాన్ని ప్రార్థించడం వల్ల ఒక సామూహిక శక్తి ఉద్భవిస్తుంది. ఇది మనుషుల మధ్య బంధాన్ని, సాంస్కృతిక గుర్తింపును, ధర్మం పట్ల విశ్వాసాన్ని బలపరుస్తుంది.



Click it and Unblock the Notifications