Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఈ ప్రసాదం తింటే పిల్లలు పుడతారట.. ఎక్కడో తెలుసా? దాని కోసం ఏం చేయాలంటే?
మన దేశంలో పిల్లల కోసం నోములు, వ్రతాలు, పూజలు చేస్తుంటారు. వివిధ గుడులకు వెళ్తూ.. కొన్ని ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసంలో ఈ పూజలు అధికంగా ఉంటాయి. అయితే కొందరి ప్రయత్నాలు, పూజలు ఫలిస్తే మరికొందరు అలానే ఉండిపోతారు.
ఇంకొందరు వైద్యంతో సంతానంపై పొందాలని చూస్తూ ఉంటారు.
IVF పద్దతిలో ఇలా సంతానం పొందిన వారు కూడా ఉన్నారు. అయితే ఇలాంటి వారికోసం ఈ కథనంలో గురించి చెప్తాను. ఈ కొన్ని ఆలయానికి వెళ్లి, ఆ దేవుళ్లను పూజించి, ఆ శివుడి ప్రసాదాన్ని తింటే.. కచ్చితంగా సంతానం కలుగుతుందనే నమ్మకం ఉంది. ఇది ఇప్పటి వరకు నిజమైంది కూడా. అయితే ఆ ఆలయం ఏమిటి? ఎప్పుడు దస్ర్శించుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
గుంటుపల్లి గుహలు
కార్తీక మాసం వచ్చిందంటే చాలు.. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలంలోని గుంటుపల్లి గుహలకు భక్తులు పోటెత్తుతారు. మరీ ముఖ్యంగా కార్తీకమాసం మూడో సోమవారం భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. ఆ రోజు శివుడి విగ్రహం ముందు మహిళలు నిద్రపోతారు. అలా పడుకున్నప్పుడు వారి కలలో పిల్లలు ఆడుకునే వస్తువులు, బొమ్మలు కనిపిస్తే సంతాన భాగ్య కలుగుతుందని నమ్మకం.

పశ్చిమ గోదావరిలో శివుడి ఆలయం
పశ్చిమ గోదావరి జిల్లాలోని శివదేవుని చిక్కాల గ్రామంలో ఉండే శివుడి దేవాలయంలో శివరాత్రి రోజు మొక్కలు నాటుతారు. కొబ్బరి మొక్కలు నాటితే మగ పిల్లాడు, గులాబీ మొక్కలు నాటితే ఆడపిల్ల పుడుతుందని ప్రతీతి ఉంది.
చిలుకూరు బాలాజీ ప్రసాదం
చిలుకూరు బాలాజీ ఆలయంలోని గరుడ ప్రసాదం కోసం మహిళలు ఎక్కువగా వెళ్తుంటారు. ఈ చిలుకూరు బాలాజీ ఆలయంలో ఏడాదికి ఒకసారి జరిగే బ్రహ్మోత్సవాల్లో ఈ గరుడ ప్రసాదం లభిస్తుంది. ఈ ప్రసాదం తింటే కచ్చితంగా పిల్లలు పుడతారని నమ్ముతుంటారు.
ద్వారకా తిరుమలేశుడి ప్రసాదం
అయితే ద్వారకా తిరుమలలోని చినవెంకన్న ఆలయంలో ఇలాంటి బ్రహ్మోత్సవాలు ఏడాదికి రెండుసార్లు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో గురుత్మంతునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఆ పూజల కోసం అర్చకులు గరుడ ప్రసాదాన్ని ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. ఆ గరుడ ప్రసాదాన్ని పూజ అనంతరం అందరికీ పంచుతారు.
ఎవరైతే సంతానం లేని మహిళలు ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారో, వారికి కచ్చితంగా సంచలనం కలుగుతుందనే నమ్మకం ఉంది. సంతానం లేని మహిళలకు సైతం అర్చకులు ప్రత్యేకంగా గరుడ ప్రసాదాన్ని అందిస్తుంటారు.
గరుడ ప్రసాదాన్ని ఎలా స్వీకరిస్తారో తెలుసా?
ఈ గరుడ ప్రసాదాన్ని స్వీకరించే ముందు మహిళలు చాలా నిష్ఠతో ఉంటారు. ప్రసాదం స్వీకరించే ముందు మూడు రోజులు, స్వీకరించిన తరువాత మూడు రోజులు బాగా నిష్ఠతో ఉంటారు. నాన్ వెజ్ వంటలు అస్సలు ముట్టరు. దేవుళ్ళకు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని స్వీకరిస్తారు.



Click it and Unblock the Notifications