Latest Updates
-
చికెన్, మటన్ కాదు.. ఎప్పుడైనా కమ్మటి మునగకాయ బిర్యానీ ట్రై చేశారా? -
మనిషికి పంది కిడ్నీ.. ఏకంగా 271 రోజులు.. వైద్య చరిత్రలో మహాద్భుతం! -
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!
ఈ బావిలో తొంగి చూస్తే ఎప్పుడు చనిపోతామో తెలిసిపోతుంది, ఎక్కడుందంటే?
వారణాసి అనేది ఆధ్యాత్మికత నగరం. ఇక్కడ ఉన్న అనేక పురాతన ఆలయాలు, పవిత్రతతో కూడిన ప్రాంతాలు ఉన్నాయి. ఇక్క ప్రదేశాలు విశ్వవ్యాప్తంగా ఉన్న హిందువులకు ఎంతో ప్రత్యేకమైనవి. అందుకే వారణాసిలోని కాశీలో మరణించిన వారి అస్థికలు కలపడం లేదా అక్కడ ఖననం చేయడం వంటివి చేస్తుంటారు. అంత్యత పవిత్రమైన ఈ నగరంలో ఒక ప్రత్యేకమైన బావి ఉంది. ఈ బావి మరణం గురించి ముందే చెప్పేస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరణం గురించి ముందే చెప్పే బావి
సిద్ధేశ్వరి మందిర్ ప్రాంగణంలో ఉన్న చంద్రకూప్ అనే బావి అనేది ప్రత్యేకమైనది. ఈ బావి కేవలం నీటి ఆవశ్యకత కోసం కాదు, అది భవిష్యత్తు మరణాన్ని కూడా ముందే చెబుతుంది అనే నమ్మకం ఉంది. పురాణాల ప్రకారం, ఎవరైతే ఈ బావిలో ప్రతిబింబం చూడకపోతే, ఆ వ్యక్తి రాబోయే ఆరు నెలల్లో మరణిస్తాడని భావిస్తారు. అందుకే దీనిని "భవిష్యత్తు అంచనా వేసే బావి" అని కూడా పిలుస్తారు.

చంద్రుడు నిర్మించిన బావి
ఈ బావి పేరు 'చంద్రకూప్'. 'చంద్ర' అంటే చంద్రుడు, 'కూప్' అంటే బావి. హిందూ పురాణాల ప్రకారం, చంద్ర దేవుడు శివుని భక్తుడిగా తపస్సు చేసిన తర్వాత, శివుడు ఈ బావికి ప్రత్యేక శక్తులు ప్రసాదించాడు. అందులో ప్రతిభింబం కనిపించకపోతే, అది నొప్పి, రోగం లేదా మరణానికి సంకేతంగా భావించబడుతుంది. ఈ బావిలోకి చూస్తే మనస్సు, శరీరం, ఆత్మ శుద్ధి అవుతుందని స్థానికులు నమ్ముతారు.
పూజలు మరియు ఇతర విశేషాలు
చంద్రకూప్ బావి వద్ద పౌర్ణమి, అమావాస్య రోజుల్లో ఎక్కువగా భక్తులు పూజలు నిర్వహిస్తారు. ఈ బావి ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉంటుంది. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు భక్తులు ఈ ప్రదేశాన్ని సందర్శించవచ్చు. దీనికి మరొక ఆసక్తికరమైన విశేషం కూడా ఉంది. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌కు ఈ బావి పూర్వ కాలంలో ఒక సొరంగంతో అనుసంధానమయ్యిందని స్థానికులు చెప్తారు. మీరెప్పుడైనా వారణాసికి వెళ్తే ఈ బావిని దర్శించడం మాత్రం మరవకండి.



Click it and Unblock the Notifications
