Latest Updates
-
విడివిడిగా కాదు.. ఒకే గిన్నెలో క్రీమీ ముద్దపప్పు ఆవకాయ అన్నం..స్వర్గానికి నిచ్చెన వేసే అద్భుతమైన రెసిపీ! -
హైదరాబాద్ నుంచి ఒక్క రోజులో విజిట్ చేసే బెస్ట్ టూరిస్ట్ స్పాట్స్.. ఒక్కో వీకెండ్కి ఒక్కో ఎక్స్పీరియన్స్ -
బొటనవేలుపై ఈ గుర్తు ఉన్నోళ్లు ప్రపంచాన్ని జయించగలరు! -
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.!
శివుడికి సోమవారం నాడు బిల్వపత్ర ఆకులు సమర్పించేందుకు గల కారణాలేంటో తెలుసా...
శివుని పూజ కోసం బిల్వపత్ర ఆకులలో తెల్లని మచ్చలు ఉండకూడదు. అలాగే ఆకులు చిరిగిపోయి ఉండకూడదు. అలాగే ఈ బిల్వపత్ర ఆకుల మీద ఎలాంటి పురుగులు ఉండకూడదు.
హిందూ పురాణాల ప్రకారం శివుడిని అనేక పేర్లు ఉన్నాయి. మంజునాథస్వామి, మల్లికార్జున స్వామి, పరమేశ్వరుడు, విశ్వేశ్వరుడు, భోళా శంకరుడితో మరెన్నో పేర్లను ఈశ్వరుడిని హిందువులో ఎంతో భక్తితో కొలుస్తారు. ఈ కైలాసనాథుడిని ఆరాధించేటప్పుడు అనేక మంది ముందుగా బిల్వపత్రాలతో పూజించడం పూర్వ కాలం నుండి ఆనవాయితీగా వస్తోంది.

శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు మారెడు చెట్టుకు గల బిల్వ పత్ర ఆకులతో పూజిస్తే భక్తుల కోరికలన్నీ తీరుస్తారని చాలా మంది నమ్ముతారు. అసలు ఈ చెట్టుకు, బిల్వపత్ర ఆకులకు శివుడికి గల సంబంధం ఏమిటి? మారెడు చెట్టు ప్రాముఖ్యత ఏమిటి? ఇవి అంటే ఆ పరమశివుడికి ఎందుకు అంత ఇష్టమో తెలుసుకోవాలంటే ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

బిల్వ పత్ర ఆకులు...
బిల్వపత్ర ఆకులను చూస్తే బ్రహ్మ, విష్ణు మరియు శివుడు అనే ముగ్గురు త్రిమూర్తులు ఉన్నారని అనేక మంది హిందూ భక్తులు నమ్ముతారు. అలాగే ఈ బిల్వ పత్రాలలో ముందు భాగంలో అమృతం, వెనుక భాగంలో యక్షులు ఉన్నాయి అని కూడా పురాణాలలో పేర్కొనబడింది. అందుకే ఈ మారేడు చెట్టును ఒక దైవంగా భావించి ఆ చెట్టును కూడా అనేక మంది హిందువులు కొలుస్తారు.

శివుడిని ప్రేమించే ఆకులు..
హిందూ పురాణాల ప్రకారం ఈ బిల్వ పత్ర ఆకులు శివుడిని ప్రేమిస్తాయట. దీని గురించి మూలస్కంద పురాణంలో కూడా ప్రస్తావించబడింది. పార్వతీ దేవి చెమట హనీ మందారా పర్వతం మీద పడినప్పుడు ఈ పవిత్రమైన మారెడు చెట్టు పుట్టింది. పార్వతీ దేవి ఈ చెట్టు యొక్క మూలంలో ఉంది. అందుకే ఈ చెట్టు ఆకులు శివుడిని ప్రేమిస్తాయని పురాణాలలో పేర్కొనబడింది.

శివుని అనుగ్రహం..
బిల్వ పత్ర ఆకులతో, ఎంతో భక్తి శ్రద్ధలతో శివుడికి పూజ చేస్తే భక్తుల కోరికలను త్వరగా నెరవేరతాయని అనేకమంది హిందువుల నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం శివుడి ప్రత్యేకత ఏంటో తెలుసుకోండి. శివ అనే పేరులోనే ప్రత్యేకమైన అంతరార్థం దాగుంది. ‘శి‘ అంటే శాశ్వత ఆనందం. పురుషుల శక్తి అని, ‘వ‘ అంటే మహిళల శక్తి అర్థం. శివుడిని లింగ రూపంలో పూజించడం వల్ల ఆ వ్యక్తి తన జీవితంలో ఉన్నతస్థాయికి చేరుకుంటారని వేదాలు వివరిస్తాయి.

శివాలయాల వద్ద బిల్వ మొక్కలు...
శివుడిని ఆరాధించే అనేక మంది భక్తులు, శివాలయాల వద్ద బిల్వ మొక్కను ఎక్కువగా పెంచుతారు. బిల్వ చెట్టు శివుని రూపం అని కూడా చాలా మంది నమ్ముతారు. బిల్వ ఆకులు మూడు వేదాలు అని, వాటి కొమ్మలు ఉపనిషత్తులు, బిల్వ పత్ర చెట్టు రాజు అని అనేక మంది హిందువుల నమ్మకం. అలాగే మారెడు చెట్టును ఆరాధిస్తే పేదరికం నుండి విముక్తి లభిస్తుందని పురాణాలలో చెబుతున్నాయి.

బిల్వపత్రంలో ఇవి ఉండకూడదు...
శివుని పూజ కోసం బిల్వపత్ర ఆకులలో తెల్లని మచ్చలు ఉండకూడదు. అలాగే ఆకులు చిరిగిపోయి ఉండకూడదు. అలాగే ఈ బిల్వపత్ర ఆకుల మీద ఎలాంటి పురుగులు ఉండకూడదు. అందుకే శివుని పూజకు ఈ ఆకులను తీసుకునేటప్పుడు వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.

బిల్వపత్రాలతో సానుకూల శక్తి...
బిల్వపత్రంలోని మూడు ఆకుల నుండి వచ్చే శక్తి మనకు కూడా లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. శివతత్వ ఆకుల చివర నుండి వాతావారణంలోకి వ్యాపించి సానుకూల శక్తిని ఇస్తుంది.

బిల్వ పత్రాలతో పాటు...
శివుడికి ఎంతో ఇష్టమైన సోమవారం నాడు బిల్వప్రతాలతో అనేక మంది పూజ చేస్తారు. శివుడికి బిల్వపత్ర ఆకులతో పాటు గంధపు చెక్క, పువ్వులు, పండ్లు, నువ్వులు కూడా సమర్పించవచ్చు. అలాగే శివుడికి పూజ చేసే సమయంలో ‘ఓం నమః శివాయ‘ అనే మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రం చాలా శక్తివంతమైనది.

మారెడు చెట్టు ప్రాముఖ్యత...
మారెడు చెట్టు ఎలాంటి వాతావరణంలో అయినా పెరుగుతుంది. ఈ చెట్టు కరువు కాటకాలతో సంబంధం లేకుండా ఎంతటి ఉష్ణోగ్రతను అయినా తట్టుకుని పెరుగుతుంది. ఈ చెట్టుకు గల ఆకులను కోసిన తర్వాత ఏడు రోజుల వరకు పాడవకుండా ఉంటాయి. ఇంతటి పవిత్రత గల ఈ పత్రాలను శివలింగం సన్నిధిలో ఉంచితే వాటి పరిమళం, ఔషధి తత్వాలతో భక్తులకు ఆరోగ్యాన్ని అందిస్తాయని పురాణాలలో పేర్కొనబడింది. అంతేకాక వీటి వల్ల ఇంకా ఎన్నో ప్రయోజనాలున్నాయని పేర్కొనబడింది. ఇవి తమ పరిమళంతో చుట్టూ ఉండే వాతావరణాన్ని ఇట్టే మార్చేస్తాయని ఇంతటి విశేషాలున్న మారెడు పత్రాలను శివుడు ఎక్కువగా ఇష్టపడతాడని వేద పండితులు చెబుతున్నారు.
ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్లయితే బంధు మిత్రులకు, మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. ఇలాంటి అనేక ఆధ్యాత్మిక, ఆరోగ్య, సౌందర్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ ఆర్టికల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ విభాగంలో తెలియజేయండి.



Click it and Unblock the Notifications