Latest Updates
-
తొలి ఏకాదశి తేదీ, తిథి, పూజా విధానం, ఉపవాసం ఎలా విరమించాలి.. పూర్తి వివరాలు.! -
టమాటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయా? యూరాలజిస్ట్ చెబుతున్న అసలు నిజం ఇదే! -
వృశ్చికంలోకి చంద్రుడు.. రానున్న మూడు రోజులు ఈ రాశుల వారి గోల్డెన్ డేస్.! -
హిమాచల్ ప్రదేశ్ ఫేమస్ కధి పకోడి..వేడి వేడి అన్నంతో తింటే అమృతమే..ఈజీగా చేసుకోండిలా.. -
నాన్వెజ్ రుచిని మరిపించే మష్రూమ్ కర్రీ.. గ్రేవీ ఇలా చేశారంటే అద్భుతః అనాల్సిందే.! -
మీరు ఏ వంట నూనె వాడతారు.. ఆరోగ్యానికి ఎక్కువ ఏది మేలు చేస్తుందో తెలుసా.? -
ఆన్లైన్లో విపరీతంగా ఆభరణాలు కొంటున్నారా.. 'మెరిసే' నగలతో మోయలేని ఆరోగ్య సమస్యలు.! -
మీ భాగస్వామి ఈ విషయాల్లో మీకు దూరంగా ఉంటున్నారా.. ఈ సంకేతాలతో చాలా డేంజర్.! -
ఆలూ పరోటాకి మించిన రుచితో ఉల్లి పరోటా.. బరువు తగ్గాలనుకునేవారికి బెస్ట్ డైట్ ఫుడ్ ! -
భోజనం చేసిన వెంటనే కడుపు నొప్పిగా ఉంటుందా.?.. ఈ వ్యాధులకు సంకేతం కావచ్చు.!
వినాయకుడికి సమర్పించే 21 ఆకులలోని ఆశ్చర్యకర రహస్యాలు..!!
ఎటు చూసినా.. బొజ్జ గణపయ్య సందడే కనిపిస్తోంది. ఊరు వాడా గణపతి విగ్రహాలతో కళకళలాడుతోంది. ఇక అందరూ విగ్రహాలను తీసుకొచ్చే పూజలు చేసే ఏర్పాట్లలో మునిగిపోయారు. వినాయకచవితి అంటే సందడి అంతా ఇంతా కాదు. బొజ్జ గణపయ్యను ప్రసన్నం చేసుకోవడానికి కుడుములు, పత్రులు, పూలు, పండ్లు, పూర్ణాలు వంటి వంటకాల ఘుమఘుమలు, పూజల ఆర్భాటంతో భక్తులంతా సిద్ధమవుతున్నారు.
వినాయక చవితి రోజు చేసే పూజలో పత్రాలు ప్రధానమైనవి. విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లు, విశిష్టత గురించి చాలామందికి తెలియదు. 21 రకాల పత్రులు అనేవి సాధారణమైన ఆకులు కావు. మన బొజ్జ గణపయ్యకి వినాయక చవితి రోజు ఏకవింశతి పత్రాలతో పూజ చేస్తాం. ఏకవింశతి అంటే 21 రకాలు అని అర్థం.
పూజలో ఉపయోగించే ఆకులన్నింటిలో మహాత్కృష్టమైన, శక్తివంతమైన ఔషధ గుణాలు దాగున్నాయి. వాటితో పూజ చేయడం వల్ల కొత్త మట్టితో చేసిన ప్రతిమతో కలిసి వీచే గాలి మనలో ఉండే అనారోగ్యాలని హరిస్తుంది.
మరి వినాయకుడి పూజలో ఉపయోగించే ఆకుల వివరాలు, విశిష్టత తెలుసుకుందామా..

మాచీ పత్రం
మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చెందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి. ఈ ఆకు ఉపయోగించడం వల్ల ఒతిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది.

దూర్వా పత్రం
దూర్వా పత్రం అంటే గరిక. తెల్ల గరిక,నల్ల గరిక అని రెండు రకాలుంటాయి. గడ్డిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి. రోగ నిరోధకంగా పని చేస్తుంది.

అపామార్గ పత్రం
తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి. దగ్గు ,ఉబ్బసంకి బాగా పని చేస్తుంది.

బృహతీ పత్రం:
దీనిని ములక అంటారు. దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి. పత్రాలు వంగ ఆకులు మాదిరి. తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి. ఈ ఆకు ఉబ్బసాన్ని తగ్గిస్తుంది.

దుత్తూర పత్రం
దుత్తూర పత్రం అంటే ఉమ్మెత్త. ఇది వంకాయ జాతికి చెందినది. ముళ్లతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి. ఊపిరితితులను వ్యకోచిమ్పచేసి ఉబ్బసం తగ్గేలా చేస్తుంది.

తులసీ పత్రం
హిందువులకు తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్చనలో వాడతారు. శరీరంలో ఉష్ణాన్ని నియమ్త్రిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో తులసి చెట్టు ఉండాలి. ఆ గాలికి జలుబు,దగ్గు వంటివి దరి చేరవు.

బిల్వ పత్రం
బిల్వ పత్రం అంటే మారేడు ఆకు. మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం. శ్రీ మహాలక్ష్మీదేవికి కూడా ఇష్టమైనది. మధు మేహం,విరేచనాలకు విరుగుడుగా పని చేస్తుంది.

బదరీ పత్రం
బదరీ పత్రం అంటే రేగు. దీనిలో రేగు, జిట్రేగు, గంగరేగు అని మూడు రకాలు ఉంటాయి. చర్మ వ్యాధులకు మంచి విరుగుడు.

చూత పత్రం
చూత పత్రం అంటే మామిడి ఆకు. ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట స్థానం ఉంది. మామిడి తోరణం లేని ఇళ్లులు పండుగ రోజులలో కనిపించదు. నోటి దుర్వాసన,చిగుళ్ళ వాపు వంటి సమస్యల నుంచి ఉపసమనం ఇస్తుంది.

కరవీర పత్రం
దీన్నే గన్నేరు అంటారు. తెలుపు, పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది. గడ్డలు,పుల్లు తగ్గటానికి దీని వేరు,బెరడు వాడతారు.

మరువక పత్రం
దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత. మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది.

శమీ పత్రం
జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నోటి వ్యాధులను తగ్గిస్తుంది.

విష్ణుక్రాంత పత్రం
ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విష్ణుక్రాంత అంటారు. దీనిపై జరిగిన ఎన్నో పరిశోధనలు చెబుతున్న దేమిటంటే ఇది మంచి స్కిన్ కేర్ మందుగా పనిచేస్తుంది.

సింధువార పత్రం
సింధువార పత్రాన్నే వాడుకలో వావిలి అనికూడా పిలుస్తుంటారు. కీళ్లనోప్పులకు మంచి మందు.

అశ్వత్థ పత్రం
రావి ఆకులనే అశ్వత్థ పత్ర మంటారు. రావి చెట్టుకు పూజలు చేయటం మనసంప్రదాయం. చాలా ఔషధగుణాలు ఉన్నాయి.

దాడిమీ పత్రం
దాడిమీ అంటె దానిమ్మ ఆకు. శక్తి స్వరూపిణి అంబకు దాడిమీఫల నైవేద్యం ఎంతో ఇష్టం. వాంతులు,విరేచనాలు,అరికడుతుంది.శరీరంలో ఉన్నా హానికారక క్రిములను నాశనం చేస్తుంది.

జాజి పత్రం
ఇది సన్నజాజి అనే మల్లిజాతి మొక్క. వీటి పువ్వుల నుంచి సుగంధ తైలం తీస్తారు. చర్మ రోగాలు,స్త్రీ సంభంద వ్యాధులకు మంచిది.

అర్జున పత్రం
మద్దిచెట్టు ఆకులనే అర్జున పత్రమంటారు. ఇవి మర్రి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలో పెరిగే పెద్ద వృక్షం ఇది. రక్త స్తంభనం,గుండె ఆరోగ్యానికి ఇది చాల సహాయకారి.

దేవదారు పత్రం
దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దేవదారు. ఇది చాలా ఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకు సహజత్వం ఉంటుంది. శరీర వేడిని తగ్గిస్తుంది.

గండలీ పత్రం
దీనినే లతాదూర్వా అనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గడ్డిమాదిరి పెరుగుతుంది. అతిమూత్ర సమస్యనుంచి ఉపసమనం ఇస్తుంది.

అర్క పత్రం
జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు వేరుతో తయారుచేసిన వినాయకప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు. నరాల బలహీనత ఉన్నవరికిది దివ్య ఒషధం.చర్మ వ్యాధులను నివారిస్తుంది.
ఈ 21 పత్రాలతో వినాయక చవితి రోజున పూజించే వారికి సకల సంపదలు, అష్టైశ్వర్యాలు, కార్యసిద్ధి చేకూరుతుందని పండితులు అంటున్నారు.



Click it and Unblock the Notifications