Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
మేడారం జాతరకు వెళ్లే భక్తురాళ్లు.. హఠాత్తుగా దేవతలయిపోతారా?
మనలో చాలా మంది ఈ మధ్యన ఏదైనా వేడుక లేదా జాతర వంటి కార్యక్రమాలొస్తే చాలు హంగులు, ఆర్భాటాలు ప్రదర్శించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.
సాధారణంగా ఏ ప్రాంతంలో అయినా సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. కానీ తెలంగాణలో మాత్రం మేడారం సమ్మక్క సారక్కల మహా జాతర మాత్రం రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది జాతర అంటే కోడిని లేదా మేక లేదా గొర్రె వంటి వాటిని బలి ఇవ్వడం. కొండకోనల నడుమ కుటుంబసభ్యులు లేదా స్నేహితులతో కలిసి మందు, విందు, చిందు... అంతకుముందు జంపన్న వాగులో స్నానం చేసి.. అమ్మలకు బెల్లం సమర్పించడం వంటివి చేసి తిరుగు పయనం అవుతారు.

అయితే ఈ మేడారం జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తురాళ్లు అందరూ హఠాత్తుగా దేవతలయిపోతారంట. వీరంతా కలిసి ఇతర లోకంలోకి వెళతారంట.. అదంతా మరో భక్తి లోకం లాంటిదట..

అక్కడ తమలో తాము దాచుకున్న భావాలు, ఆందోళనలు, సలహాలు, సూచనలు, కోపం, ప్రేమ వంటివి బయటికి తీసుకొస్తారట.. 2022 సంవత్సరంలో ఫిబ్రవరి 16వ తేదీ నుండి నాలుగురోజుల పాటు అంటే ఫిబ్రవరి 19వ తేదీ వరకు జరగనున్న మేడారం జాతర సందర్భంగా సమ్మక్క, సారక్కల గురించి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం ఈ స్టోరీని పూర్తిగా చూడండి...

ఎప్పుడో ఒకసారి..
మన హిందూ సంప్రదాయ వ్యవస్థలో కుటుంబాలలో ముఖ్యంగా మహిళలకు ఎన్నో అవమానాలు ఎదురవుతుంటాయి. అందుకే వారిలో అనేక అనుమానాలు.. ఆందోళనలు లోలోపల పెరుగుతూ ఉంటాయి. అవన్నీ ఎప్పుడో ఒకసారి బయటపడాలి.

దేవతలను ఆవాహన చేసుకుని..
మహిళల ఆందోళనలు వారిని మానసికంగా ఒత్తిడికి గురి చేస్తాయి. అందుకే ఈ జాతర సమయంలో వారు దేవతల్ని ఆవాహన చేసుకుని.. తామే దేవతలుగా మారి ఆ ఉద్వేగాలన్నింటిని ఓ అలౌకిక స్థితిలో బయటకు కక్కేందుకు ప్రయత్నిస్తారట.

జాతర అంటే..
మామూలుగా జాతర అంటే గద్దెలు, అమ్మవార్లు మాత్రమే కాదని మనందరం గుర్తుంచుకోవాలి. జాతర అంటే కుటుంబ సమేతంగా కలిసి, కష్టసుఖాలను పంచుకుంటూ బయలుదేరే ఒక ఉద్వేగ ప్రదర్శన వంటిదే ఈ నాలుగు రోజుల ఉత్సవం అని అందరూ గ్రహించాలి.

హంగులు వద్దండోయ్..
మనలో చాలా మంది ఈ మధ్యన ఏదైనా వేడుక లేదా జాతర వంటి కార్యక్రమాలొస్తే చాలు హంగులు, ఆర్భాటాలు ప్రదర్శించేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు. అచ్చం బతుకమ్మల్లాగే గుడారం నుండి మేడారం రూపాన్ని మార్చేస్తున్నారు. దీంతో ఈ జాతర వైభవం తగ్గిపోతుందని అందరూ తెలుసుకోవాలి.

విగ్రహాలు లేకపోవడం..
సాధారణంగా ఏ గుడి అయినా.. ఏ జాతర అయినా ఎక్కడైనా సరే ఏదో ఒక దేవుడి లేదా దేవత విగ్రహం కచ్చితంగా ఉంటుంది. అయితే ఈ మేడారం జాతరలో మాత్రం ఎలాంటి విగ్రహాలు ఉండవు.

నాలుగు రోజుల ఉత్సవం..
ఈ మేడారం జాతర ఫిబ్రవరి 5వ తేదీ నుండి ప్రారంభమవ్వనుంది. ఈ జాతర 5వ తేదీ నుండి 8వ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జరగనుంది. తొలి రోజు కన్నెపల్లి నుండి సారలమ్మను పూజారులు తీసుకుని జంపన్న వాగు నుండి దాటి వచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు.

రెండో రోజు..
ఫిబ్రవరి ఆరో తేదీన సమ్మక్కను గద్దె మీదకు చేరుస్తారు. సమ్మక్కను కూడా చిలకలగుట్ట మీద నుండి తీసుకొచ్చి గద్దెలపై ప్రతిష్టిస్తారు. ఈ తతంగం చూసేందుకు లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. సరిగ్గా ఈ సమయంలోనే కుంకుమ భరిణి రూపంలో సమ్మక్క ఆగమనంతో అందరూ పులకరించిపోతారు. ఈ సమయంలోనే అధికారుల సమక్షంలో గాల్లోకి కాల్పులు జరుపుతారు.

మూడో రోజు..
ఫిబ్రవరి 7వ తేదీన గద్దెలపై సమ్మక్క, సారలమ్మలు కొలువై భక్తులకు దర్శనమిస్తారు. ఈ సమయంలోనే భక్తులందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకుంటారు.

చివరి రోజు..
ఫిబ్రవరి 8వ తేదీ అయిన చివరి రోజున దేవతల వన ప్రవేశం ఉంటుంది. ఈ సమయంలో ఆ వనమంతా జనసంద్రంగా మారిపోతుంది. ఈ సమయంలో అమ్మవార్ల ఆగమనంతో భక్తులు పూనకాలతో, శివభక్తుల చిందులతో అక్కడ అంతా కమణీయమైన రమణీయమైన వాతావరణం ఏర్పడుతుంది.
ఈ మేడారం జాతరకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే.. సమ్మక్క సారక్క జాతరకు వచ్చే భక్తురాళ్లు అందరూ హఠాత్తుగా దేవతలయిపోతారంట. వీరంతా కలిసి ఇతర లోకంలోకి వెళతారంట.. అదంతా మరో భక్తి లోకం లాంటిదట..
2022 సంవత్సరంలో మేడారం జాతర ఫిబ్రవరి 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే అన్నీ ఏర్పాట్లను పూర్తి చేశారు. ప్రత్యేక బస్సులను కూడా నడిపిస్తున్నారు.



Click it and Unblock the Notifications