Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
కార్తీకమాసం స్పెషల్.. ఈరోజు ఈ విధంగా దీపం వెలిగించి, ఈ వస్తువులు దానం చేయాలి.. అష్ట ఐశ్వర్యాలు మీకే సొంతం!
హిందువులు కార్తీక మాసాన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తుంటారు. దేవుడి స్వరూపంగా భావించే ఈ నెలలో హిందువులు ఎక్కువాగా శివుడు, విష్ణువు ఆలయాల్లో పూజలు చేస్తుంటారు. ప్రతిరోజూ ఇంట్లో పూజలు చేయడంతో పాటు ఆలయాల్లో కూడా కార్తీక దీపాలు వెలిగించి తమ భక్తిని చూపుకుంటారు. అయితే ఈ కార్తీకమాసంలో కార్తీక శనివారం కూడా అత్యంత ప్రముఖమైనది.
ఈరోజున భగవంతుని అనుగ్రహం పొందడానికి ప్రత్యేకమైన దీపాన్ని వెలిగించాలి. అలాగే కొన్ని పరిహారాలు చేయాలి. అలా చేయడం వల్ల భగవంతుని అనుగ్రహంతో పాటు శనీశ్వరుడు దోషాలు కూడా తొలిగిపోతాయి. అయితే ఆ పరిహారాలు ఏంటి? ఏ విధమైన దీపం వెలిగించాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

శని దేవాలయాన్ని సందర్శించడం
ఈ కార్తీక శనివారం రోజున శని దోషం ఉన్నవారు శని ఆలయాన్ని సందర్శించి, నువ్వుల నూనెలో మీ ముఖాన్ని చూసి, ఆ నూనెను ఇతరులకు దానం చేయాలి. ఇలా చేయడం ద్వారా శని దోషాలు తొలిగిపోవడంతో పాటు కష్టాలు తగ్గుతాయి.
శివుడి అభిషేకం
ఈ కార్తీక శనివారం రోజు మహా శివుడికి అభిషేకం చేయడంతో పాటు శివ మంత్రాలను పఠించాలి. ఓం నమఃశివాయా అనే మంత్రాన్ని జపించడంతో పాటు, శివ పూజ చేయాలి. ఇలా చేయడం వల్ల శివుడి అనుగ్రహంతో శనిదోషాలు తొలిగిపోతాయి.
దానం చేయడం..
ఈ కార్తీక శనివారం రోజున మీకు తోచినంత మీ శక్తి మేరకు దానం చేయండి. దానం చేసే వ్యక్తులంటే శనీశ్వరుడికి ఎంతో ఇష్టం. అందుకే దానం చేయడం వల్ల ఆ వ్యక్తులపై శని తన ప్రేమను చూపించి, తన చెడు ప్రభావాన్ని తొలగించుకుంటాడు. నువ్వుల నూనె, అన్నదానం, నువ్వులు, వస్త్రాలు, నల్ల తివాచి దానం చేస్తే శ్రేయస్కరంగా ఉంటుంది.
మర్రిచెట్టు కింద దీపం వెలిగించడం..
ఈ కార్తీక శనివారం రోజున మర్రిచెట్టు కింద నువ్వుల దీపం వెలిగిస్తే గొప్ప ఐశ్వర్యం కలుగుతుంది. ఇలా దీపం వెలిగించడం వల్ల శని దోషం ఉంటే ఆ దోషాలు తగ్గుతాయి. శనిదోషం ఉన్న వ్యక్తులు కేవలం కార్తీక శనివారం రోజున మాత్రమే కాకుండా ప్రతి శనివారం ఇలా దీపం వెలిగిస్తే ప్రయోజనం లభిస్తుంది.
ఏ రాశుల వారికి శని దోషం ఉందంటే..
మకర, కుంభ, మీన రాశులలో శని దోషం నడుస్తోంది. ఈ రాశికి శనిదోషం ఉండటం వల్ల ఈ కాలంలో ఈ రాశికి చెందిన వ్యక్తులు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మకర రాశి వారికి 2025లో శని దోషం ముగుస్తుంది. అప్పుడు మకర రాశి జీవితంలో సానుకూల మార్పు ఉంటుంది.
కార్తీకమాసంలో దీపాన్ని ఎందుకు వెలిగిస్తారు?
కార్తీక మాసంలో దీపం వెలిగించడం శుభప్రదంగా భావిస్తుంటారు. దీపం వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహం మనపై ఉంటుంది. ప్రతికూలత తొలగిపోతుంది, జీవితంలో ఆనందం శాంతి నెలకొంటుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు.



Click it and Unblock the Notifications
