Latest Updates
-
చపాతీలో ఫేవరెట్ పనీర్ మెంతి కర్రీ.. రెస్టారెంట్ స్టైల్లో ఇలా అదరగొట్టేయండి.! -
ఒకసారి స్టెంట్ వేశాక మరోసారి గుండెపోటు వస్తుందా.. చేదు నిజాలివే.! -
నోరూరించే కాజు చికెన్ పకోడీ.. ఇలా చేస్తే ఎంత తిన్నా తృప్తి తీరదు! -
ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ కోసం భార్యాభర్తలు ఎలా కలవాలి.? -
తల్లిపాల వారోత్సవాలు.. బిడ్డే కాదు బాలింత కోసం కుటుంబీకులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు! -
పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా.. ఈ వడను తిన్నారంటే మినప గారెలను మరిచిపోతారు.! -
బుధాదిత్య యోగం.. ఈ నాలుగు రాశుల వారికి అదృష్టం ఇంటి ముంగిటే.! -
గంటల తరబడి ఫ్రిజ్‌లో పెట్టాల్సిన పనిలేదు.. అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టంట్ ఫిష్ ఫ్రై.! -
రెస్టారెంట్ స్టైల్ తవా చికెన్..వేళ్లు నాకుతూ తినడం గ్యారెంటీ..ఈజీగా చేసుకోండిలా.. -
35 ఏళ్లకే కోరికలు తగ్గిపోయాయా.. దాంపత్య సుఖం కోసం తప్పనిసరిగా ఫాలో అవ్వాల్సిన టిప్స్.!
Diwali 2024: దీపావళి అసలైన కథ ఇదే.. పండగ ముందే తెలుసుకోండి!
రేపే దీపావళి. మన దేశంలో అత్యంత వైభవంగా జరుపుకునే పండగల్లో ఈ దీపావళి కూడా ఒకటి. మొత్తం అయిదు రోజుల పండగ అయినా ఈ దీపావళిని హిందువులతో పాటు సిక్కులు, జైనులు కూడా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈసారి ఈ పండగ తిథులు రెండు రోజులు వచ్చినప్పటికీ, అసలైన ముహూర్తం ఉన్న పండగను మాత్రం రేపే జరుపుకోనున్నారు.
నిజానికి ఈ దీపావళికి మూడు రోజుల పాటు దీపాలను వెలిగిస్తూ ఉంటారు. కానీ సమయం కుదరని వాళ్ళు, సమయం లేని వ్యక్తులు ఒకరోజు మాత్రమే ఈ దీపాలను వెలిగిస్తారు. అయితే ఈ దీపావళికి అసలైన కథ వేరే ఉంది. ఆ కథ ఏంటి, ఎందుకు దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారు అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

దీపావళి కథ ఏంటంటే..
దీపావళి అంటే దీపాల పండగ. ఈ దీపావళి నాడు దీపాలను వెలిగించి పండగను అత్యంత వైభవంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం దీపాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తుంటారు. దీపాన్ని కొలిస్తే స్వయంగా ఆ దేవుళ్లను కొలుస్తున్నట్లు విశ్వసిస్తారు. అందుకే ఈ దీపావళి రోజున దీపాలను వెలిగించి, ఆ దేవుళ్లను పూజిస్తారని నమ్ముతుంటారు.
అలాగే పూర్వం శ్రీరాముడు రావణాసురుడిని అంతం చేసి, యుద్ధంలో గెలిచి సీతమ్మను తీసుకొని అయోధ్యకు వచ్చారట. అలా వచ్చినప్పుడు శ్రీరాముడి రాకను పండగలా జరుపుకునేందుకు అయోధ్యలోని ప్రతి ఇంట్లో దీపాలను వెలిగించి అయోధ్య మొత్తం కాంతిని వికసింపజేసేలా చేశారట. అప్పటి నుంచి దీపావళిని జరుపుకుంటారని పురాణాల్లో ఉంది.
అలాగే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించేందుకు కూడా దీపాలను వెలిగిస్తారని, దీపాలను వెలిగించి లక్ష్మీదేవికి పూజ చేయడం వల్ల ఆమె సంతృప్తి చెంది ఇంట్లోకి ప్రవేశిస్తుంది చెబుతుంటారు. అందుకే దీపాలను వెలిగిస్తారని ప్రచారం ఉంది. అంతేకాదు దీపాన్ని జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందాలకు చిహ్నంగా భావిస్తుంటారు. దీపాలను వెలిగించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాయాలు బాగా భోగ్యాలు వెల్లివిరుస్తాయని పేర్కొంటారు. అందుకే దీపావళి రోజు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాలను వెలిగిస్తారు.
సైన్స్ ఏం చెబుతుందంటే..
దీపావళికి పురాణాల ప్రకారమే కాదు సాంకేతికంగానూ ఓ ప్రత్యేకత ఉంది. అలాగే ఓ కథ కూడా ఉంది. దీపావళి వచ్చేది శీతాకాలంలో వస్తుంది. ఆ సమయంలో చాలా మంది దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యలతో బాధ పడుతూ ఉంటారు. అయితే దీపావళి రోజున నువ్వుల నూనెతో వెలిగించిన దీపం దగ్గర కూర్చుంటే వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందట. నువ్వుల నూనె నుంచి వచ్చే వాసనను పీల్చడం వల్ల దగ్గు, జలుబు నుంచి ఉపశమనం లభిస్తుందట. అందుకే దీపావళి రోజు దీపాలను వెలిగిస్తారని సైన్స్ చెబుతుంది.
దీపావళి మనం ఏ విధంగా జరుపుకున్నప్పటికీ అది మంచిదే. కానీ ప్రకృతిని నాశనం చేసే క్రాకర్స్ ను కాల్చడం వల్ల కాలుష్యం ఏర్పడుతుంది. తద్వారా ప్రకృతి నాశనం అవడంతో పాటు మనిషి యొక్క జీవన విధానంపై ప్రభావం పడుతుంది. అందుకే ఈ దీపావళికి కాలుష్య రహితమైన క్రాకర్స్‌ను మాత్రమే కాల్చండి.
గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం, పలు అధ్యయనాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత.



Click it and Unblock the Notifications