Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
ఆగస్టు 2020 : ఈ నెలలో గణేష్ చతుర్థి, జన్మాష్టమితో పాటు ప్రధాన పండుగలివే...
హిందూ క్యాలెండర్ ప్రకారం ఆగస్టు మాసం శ్రావణ మాసానికి చెందిన శుక్ల పక్ష త్రయోదశితో ప్రారంభమైంది. ఈ 2020 సంవత్సరం ఆగస్టు నెలలో అనేక ముఖ్యమైన పండుగలు మరియు వ్రతాలు రాబోతున్నాయి.

ఇదే నెలలో శ్రావణ మాసంలోని చివరి లేదా ఐదో సోమవారం కూడా వస్తుంది. అంతేకాదు రాఖీ పౌర్ణమి మరియు జన్మాష్టమి వంటి ప్రత్యేకమైన పండుగలు కూడా ఈ నెలలోనే జరగనున్నాయి

ఇవొక్కటే కాదు ఈ నెలలోనే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను మరియు అది ముగిసిన వారం రోజులకే వినాయక చతుర్థి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఈ పండుగలతో పాటు మిగిలినవి ఏ తేదీన ఏ పండుగ జరుపుకుంటారో ఇప్పుడు తెలుసుకుందాం...

శని ప్రదోష్ మరియు బక్రీద్..
ఈ నెలలో శని ప్రదోష్ ఆగస్టు ఒకటో తేదీ అయిన శనివారం నాడు వచ్చింది. ఈరోజున బోలేనాథ్, మాతా పార్వతీని పూజిస్తారు. మరోవైపు ఇదే రోజున ముస్లింల పవిత్ర పండుగ బక్రీద్ లేదా ఈద్ -ఉల్ -జుహా కూడా జరుపుకుంటారు.

రక్షా బంధన్..
ఆగస్టు 3వ తేదీ హిందువులకు చాలా ప్రత్యేకమైనది. ఈరోజున పౌర్ణమి కాబట్టి.. రాఖీ పౌర్ణమి పండుగను జరుపుకుంటారు. ఈ పవిత్రమైన పర్వదినాన అన్నదమ్ములకు.. అక్కాచెల్లెళ్లంతా రాఖీలు కట్టి తమకు జీవితాంతం రక్షణగా ఉండాలని కోరుకుంటారు.

కాద్రీ తీజ్ పండుగ..
ఆగస్టు 6వ తేదీన కాద్రీ తీజ్ పండుగను జరుపుకుంటారు. ఇది భాధ్రపద మాసం క్రిష్ణ పక్షం మూడో రోజున వస్తుంది. అయితే ఈ పండుగను ఎక్కువగా ఉత్తర భారతంలో జరుపుకుంటారు. ఈ పండుగను ఎక్కువగా మహిళలు జరుపుకుంటారు.

క్రిష్ణ జన్మాష్టమి..
ఆగస్టు 12వ తేదీన దేశవ్యాప్తంగా క్రిష్ణుడి జయంతి సందర్భంగా జన్మాష్టమి వేడుకలను జరుపుకుంటారు. భాద్రపద మాసంలో క్రిష్ణ పక్షం యొక్క ఎనిమిదో రోజున శ్రీక్రిష్ణుడు జన్మించాడు. ఈ ఏడాది క్రిష్ణుని జన్మాష్టమి సందర్భంగా ద్వారక నగరంలో 11, 12వ తేదీన ఈ వేడుకలను జరుపుకోనున్నారు.

అజా ఏకాదశి..
ఈనెల 15వ తేదీన అజా ఏకాదశి కూడా వచ్చింది. ఈరోజు విష్ణువును ఆరాధించి, ఉపవాసం ఉంటారు. ఈ పవిత్రమైన రోజు విష్ణుదేవుని ఆశీర్వాదం పొందడానికి, తమ సమస్యల నుండి విముక్తి పొందుతామని భావిస్తారు.

బ్రిటీష్ పాలన నుండి విముక్తి..
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ప్రతి ఏటా ఘనంగా జరుపుకోవడం అనేది అందరికీ తెలిసిందే. ఈరోజునే మన దేశానికి బ్రిటీష్ పాలన నుండి విముక్తి లభించింది.

హర్తలాజ్ తీజ్..
ఈ ఆగస్టు నెలలో 21వ తేదీ హర్తలాజ్ తీజ్ పండుగను, భాద్రపద మాసంలో శుక్ల పక్షంలో త్రుతీయ తిథి సందర్భంగా జరుపుకుంటారు. అయితే ఈ పండుగను ఎక్కువగా వివాహిత మహిళలు అది కూడా ఉత్తర భారతంలోనే ఎక్కువగా జరుపుకుంటారు.

వినాయక చవితి..
మన భారతీయులందరికీ ఎంతో ఇష్టమైన పండుగ వినాయక చవితి. ఆ పండుగ కూడా ఈ నెల 22వ తేదీన వచ్చింది. ఈరోజున దేశవ్యాప్తంగా గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.

రాధాష్టమి..
మనలో చాలా మందికి క్రిష్ణుని జన్మదినం.. క్రిష్ణ జన్మాష్టమి గురించి మాత్రమే తెలుసు. అయితే ఇదే నెలలో రాధష్టమి పండుగను కూడా జరుపుకుంటారు. ఈ పండుగ ఈ నెల 25వ తేదీన వచ్చింది. క్రిష్ణ భగవానుడికి ఎంతో ప్రియమైన రాధ జయంతి సందర్భంగా ఈ పండుగను జరుపుకుంటారు.



Click it and Unblock the Notifications