Latest Updates
-
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.!
Mahakumbh 2025: ఇంటి దగ్గరే ఈ పని చేస్తే.. మహాకుంభ స్నానానికి సమానమైన పుణ్య ఫలితం
ప్రపంచంలోనే అతిపెద్ద మత కార్యక్రమం ఏదైనా ఉందంటే అది కుంభమేళానే. హిందూ క్యాలెండర్ ప్రకారం సాధారణ కుంభ మేళా ప్రతి నాలుగు ఏళ్లకు ఒకసారి, అర్ధ కుంభమేళా ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి.. పూర్ణ కుంభ మేళా ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరుగుతుంది. 12 పూర్ణ కుంభ మేళాలు పూర్తైన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. ఈ కాలంలో నదులు అమృతంగా మారతాయని చెబుతారు.
ఈ ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్ రాజ్ లో మహాకుంభమేళా(MahaKumbh Mela 2025) నిర్వహించనున్నారు. ఈ మహాకుంభమేళాకి దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు. చాలా మంది సాధువులు, ఋషులు ప్రయాగరాజ్ చేరుకుంటున్నారు. మహాకుంభ మేళా సమయంలో త్రివేణి సంగమంలో స్నానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు.

కాస్మిక్ ఎనర్జీ ఎక్కువగా
మహాకుంభ సమయంలో రాజ స్నానం చేసే ప్రక్రియ సాధారణ ప్రక్రియ కాదని.. ఈ సమయంలో కాస్మిక్ ఎనర్జీ గరిష్ట స్థాయికి చేరుకుంటుందని.. ఆ సమయంలో గంగాస్నానం చేసేవారికి ఆ శక్తి ప్రయోజనం లభించి మోక్షాన్ని ,పుణ్యాన్ని పొందుతారని, పాపాలు కూడా నశిస్తాయని పండితులు చెబుతారు. అయితే చాలామందికి మహాకుంభమేళా వెళ్లాలని ఉన్నా కూడా కొన్ని కారణాల వెళ్లలేక బాధపడుతుంటారు. అయితే మీరు కూడా వెళ్లాలని కూడా ఉండి కూడా కుదరక వెళ్లలేకపోతే ఇంటి దగ్గరే ఉండి మహాకుంభ స్నానం సమానమైన పుణ్యఫలాన్ని పొందవచ్చు.
ఇంట్లోనే మహాకుంభస్నానం చేసిన పుణాన్ని పొందడం ఎలానో చూడండి
నది-చెరువులో స్నానం చేయడం
మహాకుంభానికి వెళ్లలేని పిల్లలు,వృద్ధులు,మహిళలు ఇలా చాలా మంది ఇంట్లో కొన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవడం ద్వారా కుంభస్నానానికి సమానమైన పుణ్యాన్ని పొందవచ్చు. కుంభమేళాలో ప్రత్యేక తేదీలలో రాజ స్నానాలు జరుగుతాయి కాబట్టి అదే తేదీలలో అంటే పుష్య పౌర్ణమి (జనవరి 13), మకర సంక్రాంతి(జనవరి 14), మౌని అమావాస్య(జనవరి 29), వసంత పంచమి(ఫిబ్రవరి 3),మాఘ పౌర్ణమి(ఫిబ్రవరి 12), మహా శివరాత్రి (ఫిబ్రవరి 26) రోజున మీరు గంగామాతను దృష్టిలో ఉంచుకుని మీకు సమీపంలోని నదిలో లేదా చెరువులో స్నానం చేయవచ్చు. దీంతోమహాకుంభస్నానం చేసిన ప్రయోజనాలను ఇంటి దగ్గరే పొందుతారని పండితులు చెబుతున్నారు.
ఇలా చేసినా కూడా ఓకే
నదికి లేదా చెరువుకు కూడా వెళ్ళలేని వారు ఒక బకెట్ నీటిలో కొద్దిగా గంగాజలం వేసి 'గంగా గంగే తీజ్ పూజ తీజ్ జననాం శతే' అనే మంత్రంతో గంగామాతను ఆరాధించాలి. 'రపి ముచ్యతే సర్వ పాపేభ్యో విష్ణులౌకమ్మ స గచ్ఛి" అని చెప్పి నేను మహాకుంభంలోనే స్నానం చేస్తున్నానని స్మరించుకుని స్నానం చేయండి. తద్వారా మహాకుంభ స్నానానికి సమానమైన పుణ్య ఫలితాలను పొందుతారని పండితులు తెలిపారు.



Click it and Unblock the Notifications
