Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
అక్టోబర్ 3వ తేదీ మహాలయ అమావాస్య రోజున ఈ పనులు చేస్తే, దోషాలుపోయి అదృష్టం మీ వెంటే ఉంటుంది
Mahalaya Amavasya 2024 మన పూర్వికులు చేసిన కొన్ని దోషాల వలన వారి తర్వాతి తరం వారు కష్టాలు పాలవడం పాపాలు మూటకట్టుకోవడం జరుగుతుంది. పితృ దోషాల వల్ల జీవితంలో కష్టాలు ఎదుర్కొంటారు. కష్టాలు ఎదురైనప్పుడువారి జాతకంలో ఇటువంటి దోషాలను సులభంగా గుర్తించవచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి జీవితంలో దోషాలు ఉన్నప్పుడు వివిధ రకాలుగా సమస్యలను ఎదుర్కొంటారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు పనుల్లో అవాంతరాలు,పనులు అసంపూర్తిగా ఉండటం, ఇంటా బయట గౌరవ మర్యాదలను కోల్పోవడం, అతి చిన్నవయస్సులోనే వైవిద్యం ఏర్పడుతుంది. కుటుంబంలో కలహాలు, మానసిక ఆందోళనలు ఎదుర్కొంటారు. పిల్లల వల్ల సమస్యలు, పిల్లలు పుట్టకపోవడ వంటి సవాళ్లను ఎదుర్కొంటారని నిపుణులు చెబుతున్నారు.
ప్రతి కుటుంబంలో సభ్యులు తమ జీవితంలో రుణం తీర్చుకోవాలి. అప్పుడే చనిపోయిన మన పెద్దల నుండి పూర్తీ ఆశీస్సులు పొందుతారుని ముక్తి, మోక్షం లభిస్తుందని అంటారు. పితృ రుణం తీర్చుకోకపోతే వారికి దోషాల నుండి లభించదని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. అందుకు ఆరాధనకు అనుకూలమైన రోజు మహాలయ అమావాస్య. మహాలయ పక్షం చేయని వారికి అశుభం జరుగుతుందని పండితులు తెలియజేస్తున్నారు. అలాగే ఈ మహాలయ అమాస్య రోజు కొన్ని పనులు చేయడం వల్ల దోషాలు తొలగిపోవడంతో పాటు వారి ఆశీస్సులతో అదృష్టం పొందుతారు.

* ఈ మహాలయ అమావాస్య రోజున పూర్వీకులను స్మరించుకోవడం పవిత్ర గంగా స్నానం నదీ స్నానాలు చేసి మన పూర్వీకుల శాంతి కోసం పూజలు చేస్తే వారి ఆశీర్వాదం పొందుతారు. అలాగే నదుల్లో తర్పణాలను వదలడం ద్వారా దోషాలు తొలగిపోతాయి.
* కాకులకు, కుక్కలకు, చీమలకు ఆహారాన్ని అందించడంతో చనిపోయిన మన పూర్వీకుల నుండి అనుగ్రహం లభిస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి.
* మహాలయ అమావాస్య రోజున చనిపోయిన వారికి వారి పేరు మీద అన్నదానం, దాన దర్మాలు చేస్తే మంచిదని చెబుతున్నారు.
* దీనితోపాటు బ్రాహ్మణులకు భోజనం పెడతారు. ఇలా వడ్డించే ఆహారం నేరుగా చనిపోయిన మన పూర్వీకులకు అందుతుందని చాాలా మంది నమ్మకం.
* మహాలయ అమావాస్యను సర్వ పితృ అమావాస్య అని కూడా పిలుస్తారు ఈ రోజును చనిపోయిన వారికోసమనే కేటాయిస్తారు. ఈ రోజున మన చేసే పూజల, స్వీకరించడానికి మన పూర్వీకు భూమిమీద వారి కుటుంబంలోని వారిపై ఆశీసులు కురిపిస్తారనే నమ్మకం ఉంది.
* అమావాస్య రోజు ఎవరైతే వారి కుటుంబంలో చనిపోయినా వారి పితృ దేవళ్లును గుర్తు చేసుకొని పిండప్రధానం, తర్పణాలను వదులుతారో వారికి పితృదేవతల ఆశీస్సులు మెండుగా ఉంటాయని చెబుతారు.
మహాలయ అమావాస్య రోజున పితృదేవతల ఆత్మ శాంతికి కోసం వారికి నచ్చిన విధం పూజలు తర్పణాలు చేయడం ద్వారా దోషాలు శాపాలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications