Latest Updates
-
ముక్కల్లేకుండా బిర్యానీ మజా.. అచ్చం రెస్టారెంట్ స్టైల్ కుష్కా ఇంట్లోనే ఈజీగా ఇలా చేయండి! -
అరటిపండు తినడానికి సరైన సమయం ఏది? ఈ నిజాలు మీరు తెలుసుకోవాల్సిందే! -
నెల రోజులు పైనే నిల్వ..చికెన్ కారం పొడి ఇలా చేసి పెట్టుకుంటే టిఫిన్స్, అన్నంలోకి అదుర్స్! -
ఈ అలవాటు మానేస్తే తిన్నాక కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు! -
చికెన్ చాప్స్ ఇలా చేస్తే..ముక్క కూడా మిగల్చకుండా లాగించేస్తారు..టేస్ట్ కి అడిక్ట్ అయిపోతారు! -
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా?
Mahashivratri 2022:ఈ ఏడాది శివరాత్రి ఎప్పుడు, శుభ ముహుర్తం, పూజా విధానాలివే...
హిందూ మతం ప్రకారం ప్రతి ఏటా వచ్చే మహాశివరాత్రి ఎంతో పవిత్రమైనది. ఈ ఏడాది శుభ ముహుర్తం, పండుగ తేదీ, శివుని పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు.

2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.

జ్యోతిష్యశాస్త్ర పండితుల అభిప్రాయం ప్రకారం, భోలేనాథుడితో పాటు పార్వతీ దేవికి పూజలు చేయడం వల్ల ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి, లభించడంతో పాటు శుభఫలితాలొస్తాయి. ఈ సందర్భంగా మహా శివరాత్రి వంటి పవిత్రమైన పండుగ రోజున పూజా విధానం మరియు శుభ ముహుర్తం గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

శుభ సమయం..
2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు ఉదయం 3:16 నుండి చతుర్దశి తిథి ప్రారంభమవుతుంది. ఆ మరుసటి రోజు అంటే మార్చి 2వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు పూర్తవుతుంది.

పూజా సమయం..
మహా శివరాత్రి రోజున 2022లో మార్చి 1వ తేదీన మంగళవారం నాడు మొదటి ప్రహార్ పూజా సమయం మార్చి 1, 2022 సాయంత్రం 6:21 గంటల నుండి 9:27 గంటల వరకు ఉంటుంది.
రెండో ప్రహార్ యొక్క ఆరాధన సమయం మార్చి 1వ తేదీ రాత్రి 9:27 నుండి అర్ధరాత్రి 12:23 గంటల వరకు
మూడో ప్రహార్ పూజా సమయం మార్చి 2వ తేదీ అర్థరాత్రి 12:24 నుండి ఉదయం 3:39 గంటల వరకు
నాలుగో ప్రహార్ పూజా సమయం మార్చి 2వ తేదీ 3:40 నుండి ఉదయం 6:45 గంటల వరకు
పారాయణ సమయం : మార్చి 2, బుధవారం ఉదయం 6:45 గంటల తర్వాత

మహా శివరాత్రి పూజా విధానం..
దేవతలు మరియు దేవుళ్లందరిలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమని చాలా మంది నమ్ముతారు. కేవలం నీటిని సమర్పించడం ద్వారా పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే శివుడిని బోలేనాథ్ అని కూడా పిలుస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే మహా శివరాత్రి పండుగ కోసం ప్రతి ఒక్క శివ భక్తుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహుర్తంలోనే స్నానం చేయాలి. దీని తర్వాత, పూజా స్థలాన్ని శుద్ధి చేసిన తర్వాత, నీటితో నింపిన కలశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత శివుడు, పార్వతి విగ్రహాలను ప్రతిష్టించాలి. అనంతరం గంధం, అక్షింతలు, లవంగం, యాలకులు, తమలపాకులు, మోలీ, దాతుర, బేలపత్రం, పాలు, పెరుగు, నెయ్యి, తేనే తదితర వాటిని సమర్పించాలి. అప్పుడు శివుడిని స్మరించుకుంటూ శివునికి హారతి ఇవ్వాలి.

శివ కథలు వింటూ..
మహా శివరాత్రి రోజున ‘ఓం నమః శివాయః' అనే మంత్రాన్ని జపిస్తూ శివునికి అభిషేకరం చేయాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పరమేశ్వరుడిని పూజించాలి. అగ్నిలో నువ్వులు, బియ్యం, నెయ్యితో కలిపిన అన్నం వేయాలి. ఈ హోమం తర్వాత పూర్ణాహుతి నిర్వహించాలి. అలాగే శివకథలు వింటూ మరోసారి రథ రాత్రి, నాలుగో జాములో మరోసారి ఆహుతులను సమర్పించాలి. మౌనవ్రతం ఉండాలనుకుంటే మరుసటి రోజు సూర్యోదయం వరకూ ‘ఓం నమః శివాయ' మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉండాలి. ‘పరమాత్మా మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్ణ పూజ కొనసాగించి పూర్తి చేశాను అని వేడుకోవాలి.
దేవతలు మరియు దేవుళ్లందరిలో పరమేశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమని చాలా మంది నమ్ముతారు. కేవలం నీటిని సమర్పించడం ద్వారా పరమేశ్వరుడు సంతోషిస్తాడట. అందుకే శివుడిని బోలేనాథ్ అని కూడా పిలుస్తారు. ఫాల్గుణ మాసంలో వచ్చే మహా శివరాత్రి పండుగ కోసం ప్రతి ఒక్క శివ భక్తుడు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ పవిత్రమైన రోజున బ్రహ్మ ముహుర్తంలోనే స్నానం చేయాలి. దీని తర్వాత, పూజా స్థలాన్ని శుద్ధి చేసిన తర్వాత, నీటితో నింపిన కలశం ఏర్పాటు చేయాలి. ఆ తర్వాత శివుడు, పార్వతి విగ్రహాలను ప్రతిష్టించాలి. అనంతరం గంధం, అక్షింతలు, లవంగం, యాలకులు, తమలపాకులు, మోలీ, దాతుర, బేలపత్రం, పాలు, పెరుగు, నెయ్యి, తేనే తదితర వాటిని సమర్పించాలి. అప్పుడు శివుడిని స్మరించుకుంటూ శివునికి హారతి ఇవ్వాలి.
హిందువులు పవిత్రమైన పండుగలలో మహాశివరాత్రి ఒకటి. హిందూ క్యాలెండర్ ప్రకారం, ఫాల్గుణ మాసంలో క్రిష్ణ పక్షం యొక్క చతుర్దశి తేదీన ఈ పండుగను జరుపుకుంటారు. 2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ వచ్చింది. ఈరోజున ఈశ్వరుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే, కోరిన కోరికలన్నీ తీరుస్తాడని భక్తులందరి నమ్మకం.



Click it and Unblock the Notifications