Latest Updates
-
నల్ల శనగలతో ఇలా చేసుకుని తింటే లెక్కలేనన్ని లాభాలు.. ఫిట్నెస్ ప్రియులకు పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్.! -
ఎన్నడూ లేని విధంగా ప్రధాన గ్రహాల సంచారం, అదృష్ట యోగాలు.. ఈ రాశుల వారికి సిరిసంపదల వరాలు.! -
జపనీస్ క్లౌడ్ ఆమ్లెట్ ఎప్పుడైనా తినారా? మెత్తగా, ఉబ్బెత్తుగా రావాలంటే ఈ చిట్కా పాటించండి -
బ్యాగ్ సర్దుకుని బయలుదేరడమే.. ఈ 3 రాశుల వారికి ట్రావెలింగ్ అంటే మహా పిచ్చి! -
విటమిన్లు, ఐరన్ గని..మునగాకు తొక్కు ఇలా చేసి తింటే జీవితంలో హాస్పిటల్ గుమ్మం తొక్కరు!..యమా రుచి కూడా -
పోషకాలు ఫుల్,ఫైవ్ స్టార్ హోటల్ రుచిని తలదన్నే వెల్లుల్లి సోయా రైస్..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
నోటికి కమ్మగా, కడుపులో చల్లగా.. కీరదోసకాయతో విలేజ్ స్టైల్ మజ్జిగ పులుసు.! -
సూర్యుడు, శని ఎదురెదురుగా.. ఈ 5 రాశులకు అక్టోబర్ 17 వరకు తీవ్ర నష్టం! -
ట్రైనర్ లేకుండా మొదటిసారి యోగాసనాలు వేస్తున్నారా.. ఈ తప్పులు అస్సలు చేయకండి.! -
సర్వ రోగాలకు మూలం కడుపే..పేగుల్లో పేరుకుపోయిన చెత్తను బయటకు పంపే 10 ఫుడ్స్
Mahashivratri 2022:శివరాత్రి వేళ శివునికి నైవేద్యంగా పెట్టకూడని వస్తువులేంటో తెలుసా...
శివరాత్రి సమయంలో శివునికి సమర్పించకూడని వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ క్యాలెండర్ ప్రకారం, మార్చి ఒకటో తేదీన అంగే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగ దేశ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోనున్నారు. 'హర హర మహాదేవ శంభో శంకర' అంటూ ప్రతి శివాలయంలో శివ భక్తులంతా ముక్తకంఠంతో మార్మోగిపోయే పవిత్ర సమయమే మహా శివరాత్రి.

మాఘ మాసంలో బహుళ చతుర్దశి రోజున వచ్చే మహా శివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివుడి ఆజ్ణ లేనిదే చీమైనా పుట్టదు.. కుట్టదన్న సామెత గురించి అందరికీ తెలిసిందే. అలా శివుడు సర్వ లోకాలకు అధిపతిగా ఉండి లింగాకరంలో ఉద్భవించిన రోజునే మహాశివరాత్రి అంటారు.

మరో కథనం ప్రకారం, ఈ పవిత్రమైన రోజున పార్వతీ, పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని కూడా చెబుతారు. ఈ సమయంలో శివ భక్తులందరూ ఉపవాసం ఉండి జాగరణ చేస్తారట. ఇలా చేయడం పూర్వ కాలం నుండి నేటి కలియుగం వరకు ఆనవాయితీగా వస్తోంది. ఈ పవిత్రమైన సమయంలో ఉదయం వేళలో ఏమీ తినకుండా ఉపవాసముంటూ.. రాత్రి వేళలో నిద్ర పోకుండా.. మేల్కొని శివుడిని ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు.

అయితే ఈ రోజున ఆ పరమేశ్వరుని పూజించేటప్పుడు కొందరు తెలియక కొన్ని పొరపాట్లు చేస్తుంటారు. ఇలా చేసి శివుని కోపానికి గురవుతుంటారు. కాబట్టి మీరు అలాంటి పొరపాట్లు చేయకండి.. ఇంతకీ శివుడికి ఏదీ ఇష్టముండదో.. వేటిని ఆ పరమేశ్వరుడికి అర్పించకూడదో ఇప్పుడే తెలుసుకోండి... ఆ శివునికి ఏమి ఇష్టమే వాటినే సమర్పించి.. స్వామి వారి అనుగ్రహాన్ని పొందండి...

తులసి ఆకులు..
తులసి ఆకులను లక్ష్మీ దేవికి చిహ్నంగా భావిస్తారు. లక్ష్మీదేవి శ్రీ విష్ణుమూర్తికి భార్య కాబట్టి.. వీటిని శివలింగానికి ఎట్టి పరిస్థితుల్లో నైవేద్యంగా సమర్పించకూడదు. ఈ తులసి ఆకులను ఈ దేవుడికే కాదు ఇతర దేవుళ్లకు అర్పించకూడదని పండితులు చెబుతుంటారు.

తెల్లని పువ్వులు..
పురాణాల ప్రకారం, ఆ పరమేశ్వరునికి తెల్లని పువ్వులంటే పెద్దగా ఇష్టం ఉండదు. ఒకవేళ మీరు మల్లెపువ్వులను సమర్పించినా పర్వాలేదు కానీ.. మహా శివరాత్రి సమయంలో కెవ్డా మరియు చంపా పువ్వులను అస్సలు సమర్పించరాదట. ఇలా చేస్తే మీరు ఆ శివుని శాపం పొందుతారని, అలాగే పూజ సమయంలో కూడా వీటిని శివలింగానికి అర్పించకూడదని పండితులు చెబుతున్నారు.

కొబ్బరి నీళ్లు..
సాధారణంగా దేవాలయంలోకి కొబ్బరికాయను తీసుకెళ్తుంటారు. అయితే శివునికి కొబ్బరి నీళ్లను మాత్రం అర్పించకండి. ఇది వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ, శివుడికి కొబ్బరి నీళ్లంటే పెద్దగా ఇష్టముండదట. మాములుగా అయితే కొబ్బరి నీళ్లను అందరి దేవుళ్లకు అర్పిస్తుంటారు. కానీ ఒక్క శివుడికి మాత్రం వీటిని అర్పించరు.

కుంకుమ..
మహా శివరాత్రి పండుగ సమయంలో శివునికి కుంకుమ అస్సలు సమర్పించకండి. ఈ పవిత్రమైన పర్వదినాన మాత్రమే కాదు.. సాధారణ రోజుల్లో కూడా శివలింగానికి, పరమేశ్వరుడికి కుంకుమను ఎట్టి పరిస్థితుల్లో అర్పించకూడదు. శివుడికి బూడిద అంటే ఇష్టం. కావాలంటే విబూదిని సమర్పించవచ్చు. ఎందుకంటే శివుడు ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతాడు. ఏకాంతంగా ఉండే సమయంలో శివుడు నుదుటిపై బూడిదను ఉంచుకుంటాడు. ఇది పురాణాల నుండి నేటి వరకు ఆనవాయితీగా కొనసాగుతోంది.

బేల్ పాన్..
మనకు లభించే అత్యంత పవిత్రమైన చెట్లలో బేల్ పాన్ చెట్టు ఒకటి. ఇందులో ఎన్నో ఔషధ లక్షణాలు ఉన్నాయి. దీన్ని కూల్ ఏజెంట్ అని కూడా పిలుస్తారు. అయితే శివుడికి ఈ ఆకులను నైవేద్యంగా ఇచ్చేటప్పుడు వీటిని కత్తిరించకూడదు. అందుకే వీటిని శివుడికి నైవేద్యంగా అర్పించకూడదు.

కాంస్య పాత్రలు..
సాధారణంగా శివరాత్రి సమయంలో శివలింగానికి పాలు లేదా పెరుగును నైవేద్యంగా మరియు వాటితో అభిషేకం చేస్తుంటారు. అయితే అలా చేసే సమయంలో కాంస్య పాత్రల నుండి దూరంగా ఉండాలి. ఎందుకంటే పురాణాల ప్రకారం, ఇలా అర్పిస్తే, మద్యంతో అభిషేకం చేసినట్టు సమానమట. అలాగే మీ వేళ్లు నీరు, పాలు మరియు వంటి వాటికి తాకనివ్వొద్దు. ఎందుకంటే గోర్లు తాకడం వల్ల అవి చెడిపోయే ప్రమాదం ఉంది.

శివ లింగం చుట్టూ..
శివ పురాణం ప్రకారం, మనం ఎప్పటికీ శివ లింగం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదట. ఎల్లప్పుడూ సగం వరకే తిరిగి వెనక్కి వెళ్లిపోవాలట. అది కూడా మీరు ప్రారంభించిన ప్రదేశానికి తిరిగి వెళ్లాలట. ఒకవేళ మీరు తెలియక పూర్తిగా ప్రదక్షిణలు చేస్తే, అది నిందగా పరిగణించబడుతుందట.

పసుపు..
మనలో చాలా మంది దేవుళ్లను ప్రార్థించే సమయంలో పసుపును ఎక్కువగా ఉపయోగిస్తుంటాం. ముఖ్యంగా పసుపు, కుంకుమతో పాటు ఇతర వాటిని పూజా సామాగ్రిలో ఉంచి దేవుళ్లను పూజిస్తూ ఉంటాం. అయితే శివుడు సాధువు వంటి దేవుడు కాబట్టి, తను ప్రాపంచిక ఆనందాలు చాలా కాలం క్రితమే శివుడు వదులుకున్నాడు కాబట్టి, ఈ దేవునికి రంగులు అవసరం లేదు.
మాఘ మాసంలో బహుళ చతుర్దశి రోజున వచ్చే మహా శివరాత్రి పరమేశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైనది. శివుడి ఆజ్ణ లేనిదే చీమైనా పుట్టదు.. కుట్టదన్న సామెత గురించి అందరికీ తెలిసిందే. అలా శివుడు సర్వ లోకాలకు అధిపతిగా ఉండి లింగాకరంలో ఉద్భవించిన రోజునే మహాశివరాత్రి అంటారు.మరో కథనం ప్రకారం, శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిందే ఇదే రోజున జరిగిందని చాలా మంది నమ్ముతారు. 2022 సంవత్సరంలో మార్చి 1వ తేదీన అంటే మంగళవారం నాడు మహా శివరాత్రి పండుగను దేశ వ్యాప్తంగా జరుపుకోనున్నారు.



Click it and Unblock the Notifications
