For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Makar Sankranti 2021 : ఈ సంక్రాంతికి మీ రాశిని బట్టి ఇవి దానం చేస్తే మంచి ఫలితం వస్తుందంట..!

సంక్రాంతి సమయంలో ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయో తెలుసుకుందాం.

|

ప్రపంచవ్యాప్తంగా హిందువులందరికీ మకర సంక్రాంతి పండుగ చాలా ప్రత్యేకమైంది. ఈ పండుగకు ఎంతో విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన సమయంలో సూర్యుడు ధనస్సు రాశి నుండి మకరంలోకి ప్రవేశిస్తాడు. ఇంకోవైపున ఈ పండుగను పతంగుల(గాలిపటాల) పండుగ అని కూడా అంటారు.

Makar Sankranti 2021 : Donate Things Based on Your Zodiac Sign

ఈ సమయంలో పిల్లల నుండి పెద్దల వరకు ఉదయం మరియు సాయంత్రం గాలిపటాలను ఆనందంగా ఎగురవేస్తారు. ఇదిలా ఉండగా జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ రాశిని బట్టి కొన్ని వస్తువులను దానం చేయడం వల్ల అనేక రెట్లు ప్రయోజనాలు లభిస్తాయట. ఈ సందర్భంగా ఏయే రాశుల వారు ఏయే వస్తువులను దానం చేయాలి.. ఇలా చేయడం వల్ల మీకు కలిగే ప్రయోజనాలేంటి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి..

మేష రాశి..

ఈ రాశి వారు ఈ మకర సంక్రాంతి సమయంలో నువ్వులను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కోరికలు నెరవేరడమే కాకుండా.. మీకు అనేక ప్రయోజనాలు చేకూరతాయి.

వృషభ రాశి..

వృషభ రాశి..

ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ సమయంలో పేదలకు బట్టలు, నువ్వులు దానం చేయాలి. దీని వల్ల మీరు శుభ ఫలితాలను పొందుతారు.

మిధున రాశి..

మిధున రాశి..

ఈ సంవత్సరం సంక్రాంతి సమయంలో మిధున రాశి వారు గొడుగులను మరియు షీట్లు దానం చేయాలి. దీని వల్ల మీరు కచ్చితంగా ప్రయోజనం పొందుతారు.

కర్కాటక రాశి..

కర్కాటక రాశి..

ఈ రాశి వారు ఈ సంవత్సరం వచ్చిన సంక్రాంతి పండుగ సమయంలో పేదలకు బట్టలను దానం చేయాలి. ఇలా చేస్తే మీకు కచ్చితంగా శుభప్రదమైన ఫలితాలు వస్తాయి.

సింహ రాశి..

సింహ రాశి..

ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ సమయంలో మీ స్తోమతకు తగ్గ విధంగా పేదలకు దుప్పట్లు మరియు పలకలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు సానుకూల ప్రయోజనాలు వస్తాయి.

కన్య రాశి..

కన్య రాశి..

ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ వేళ చమురు(ఆయిల్), ఉద్ది పప్పు వంటి వాటిని విరాళంగా ఇవ్వాలి. ఇలా చేయడం వల్ల ఈ రాశి వారికి శుభఫలితాలు వస్తాయి.

తుల రాశి..

తుల రాశి..

ఈ రాశి వారు ఆంగ్ల నూతన సంవత్సరంలో వచ్చే తొలి పండుగ అయిన పొంగల్ సమయంలో పేదలకు పత్తి, కాటన్ దుస్తులు, బెడ్ షీట్లు తదితర వస్తువులను దానం చేయాలి. మీ సామర్థ్యం మేరకు మరింత ఎక్కువ విరాళం ఇచ్చినా కూడా మీరు కోరుకున్న ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.

వృశ్చికరాశి..

వృశ్చికరాశి..

ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ సమయంలో దుప్పట్లను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది.

ధనస్సు రాశి..

ధనస్సు రాశి..

ఈ రాశి వారు మకర సంక్రాంతి పండుగ సమయంలో మీ కాలనీ లేదా గ్రామంలో కొన్నిరకాల ధాన్యాలను దానం చేయాలి. దీని వల్ల మీకు అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

మకర రాశి..

మకర రాశి..

ఈ రాశి వారు మకర సంక్రాంతి పర్వదినాన, మీ కోరికలు నెరవేరడానికి మీరు దుప్పట్లు మరియు పుస్తకాలను దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు శుభప్రదంగా ఉంటుంది.

కుంభ రాశి..

కుంభ రాశి..

ఈ రాశి వారు సంక్రాంతి పండుగ సందర్భంగా మీ సామర్థ్యం మేరకు, అవసరమైన వారికి సబ్బులు, బట్టలు, దువ్వెనలతో సహా ఆహారాన్ని దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఈ సంవత్సరం మొత్తం మీకు శుభప్రదంగా ఉంటుంది.

మీన రాశి..

మీన రాశి..

ఈ రాశి వారు మకర సంక్రాంతి వేళ పేదలకు కాటన్ దుస్తులు, దుప్పట్లు, బెడ్ షీట్లు తదితర వాటిని మీ సామర్థ్యం మేరకు పంపిణీ చేయాలి. దీని వల్ల మీరు కచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. అంతేకాదు మీ లైఫ్ లో మీకు లక్ కూడా కలిసి వస్తుంది.

English summary

Makar Sankranti 2021 : Donate Things Based on Your Zodiac Sign

On Makar Sankranti, donating a few things based on your zodiac sign can bring in immense luck. Check out the list which is based on your zodiac signs.
Desktop Bottom Promotion