Latest Updates
-
ఇల్లంతా గుమగుమలాడే ఇడ్లీ కారప్పొడి.. పక్కా కొలతలతో మీరూ ట్రై చేయండి -
చాలా ఏళ్ల తర్వాత ఒకే రాశిలో సూర్య కేతులు.. రాజయోగం పట్టనున్న రాశులివే.! -
చికెన్ లివర్ vs మటన్ లివర్..రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? -
పెళ్లిళ్లలో వడ్డించే పూరీ మసాలా.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా ఇలా ఈజీగా చేసుకోండి..వేళ్లు నాకుతూ తినేస్తారు! -
కలియుగం ముగిసేది ఎప్పుడు? మనిషి ఆయుష్షు కేవలం 20 ఏళ్లేనా? -
పెళ్లిళ్లలో వడ్డించే కరకరలాడే చిల్లీ గోబీ.. అచ్చం అదే రుచితో ఇంట్లోనే ఈజీగా చేసేయండిలా.. -
కొల్హాపురి స్టైల్ కోడిగుడ్డు పులుసు..అన్నం, జొన్న రొట్టెలోకి అదిరిపోతుంది..ఎలా చేసుకోవాలంటే.. -
వర్షాకాలంలో పాము కాటుకి గురైతే ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
ఈ వీకెండ్ కి నాన్వెజ్ వద్దా? నాన్ వెజ్ ను మించే రుచితో కాజు మసాలా ఈజీగా చేసుకోండిలా.. -
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.!
మహాదేవుడి మహారహస్యాలు.. పార్వతిదేవీకి శివుడి పరీక్ష..!
శివుడు, మహాదేవుడి గురించి ఎంత తెలుసుకున్న తక్కువే. హిందువుల్లో 33 కోట్ల మంది దేవీ దేవతలు ఉంటారంటారు. వారందిలో శివుడే ప్రథమం ఆయనే అందరికంటే ముందు అని శాస్త్రాలు చెబుతుంటాయ్. ఆధ్యాత్మికతలో ఆ మహాకాలుడి గురించి తీవ్రంగా చర్చ జరుగుతూ ఉంటుంది. శివుడికి సంబంధించిన కొన్ని రహస్యాలను తెలుసుకుందాం. ఇవి తెలిసిన తరువాత శివుడు ఎంత గొప్పవాడనే విషయం తెలుస్తుంది.

శూన్యం
శివుడిని శూన్యంగా చెబుతారు. శూన్యం అనేది అంతిమంగా ఉన్న ఒక వాస్తవం, దానికి ఎవ్వరూ తిప్పికొట్టలేరు. శివుడికి శూన్యతతో సంబంధం ఉంటుంది. భక్తులు శూన్యాన్ని జపిస్తున్నారు అంటే శివుడిని దర్శించినట్లే.
సంసారి సన్యాసి
మహాదేవుడు ఒకవైపు సంసారి మరోవైపు సన్యాసి. జపములో శక్తిలో యోగలో ఇంకా చాలా విషయాల్లో ఓ సన్యాసిగా శివుడు కనబడుతాడు. మరోవైపు పార్వతీమాత భర్తగా, గణపతి కార్తికేయ స్వామి తండ్రిగా దర్శనమిస్తాడు. రెండింటినీ కలుపుకొని ముందుకు వెళ్తున్న సన్యాసి, సంసారి ఆ శివుడు.
విధ్వంసకారుడు, రక్షణకర్త
శివుడు విధ్వంసకారుడు అంటారు. అంటే విధ్వంసాలు సృష్టించేది శివుడే. విధ్వంసం అనగానే చాలా మందికి నాశనం అనే పదం గుర్తుకువస్తుంది. శివుడి విధ్వంసానికి అర్థం.. పరివర్తన చేయడానికి పునరుద్దరణ చేయడానికి ఉన్న దానిని తొలగిస్తాడు దాన్నే విధ్వంసంగా చెబుతాం.
పార్వతికి పరీక్ష
పరమశివుడిని వివాహమాడే మందు పార్వతీ మాతకి పరీక్ష పెడుతాడు. పార్వతీ వద్దకు ఓ బ్రాహ్మణ రూపంలో వచ్చి, బిచ్చగాడిని ఎందుకు పెళ్లి చేసుకుంటున్నావని ప్రశ్నిస్తాడు. దానికి పార్వతీ మాతకు ఆగ్రహం వస్తుంది. శివుడిని తప్ప ఎవ్వరినీ పెళ్లిచేసుకోనని తేల్చిచెప్పడంతో శివడు తన అసలు రూపంతో పార్వతీ ముందుకు ప్రత్యక్షమవుతాడు.
అమర్‌నాథ్ గుహల రహస్యం
అమర్‌నాథ్ గుహకు శివభక్తుల దృష్టిలో చాలా ప్రాముఖ్యత ఉంది. అమరత్వానికి రహస్యం చెప్పమని పార్వతిదేవి శివుడిని అడుగుతుంది. అలా అడిగి గుహలోకి వెళ్లిపోతుంది. గుహలోపలికి వెళ్ల దారిలో పరమశివుడు అనేక అద్భుతాలు ప్రదర్శిస్తాడు. ఇప్పుడదే దారి భక్తులకు కనువిందు చేస్తోంది. అయితే శివుడు..కొడుకును, వెంట తీసుకెళ్లిన వాహనాన్ని అక్కడే వదిలేసినట్లు పురాణాలు చెబుుతున్నాయ్.
త్రియంబకం
శివుడికి మూడు కళ్లు అన్న విషయం తెలిసిందే. కుడి కన్ను నుంచి సూర్యని జ్వాలలు రగుల్తాయ్. ఎడమ కన్ను, చంద్రుడి చల్లదనానికి గుర్తు. ఇక నుదుటిపై మధ్యలో విధ్యంసాన్ని సృష్టించే అగ్నిజ్వాల రగుల్తుంది. శివుడి మూడో కన్ను తెరిస్తే ఎంతటి శక్తివంతమైనదైనా సరే వినాశనానికి గురౌతుంది.
అర్ధనారీశ్వర్
తనను తాను సగం పురుషుడు, సగం స్త్రీగా చేసుకున్న ఒకేఒక్క దేవుడు పరమశివుడు. ఆ రూపాన్నే అర్ధనారీశ్వరుడిగా గుర్తిస్తాము. ఈ రూపం సృష్టి మూలాన్ని తెలియజేస్తుంది. విశ్వాన్ని సృష్టించింది స్త్రీ, స్త్రీని శక్తిగా భావిస్తారు. శక్తి లేనిదే విశ్వం లేదనే భావన ఉంది. పురుషులందరూ శివుడికి గుర్తుగా స్త్రీలు శక్తికి సూచికగా ఉన్నారు. ఈ రెండూ లేనిదే విశ్వం లేదు.



Click it and Unblock the Notifications