Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
పితృదోషం అంటే ఏంటి? ఈ సమస్యలు కనిపిస్తే దోషం ఉన్నట్లే.. ఎలా నివారించాలంటే?
జీవితంలో కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయా, అనారోగ్యం, కీర్తి ప్రతిష్టలు కోల్పోవడం, కష్టపడి పని చేసినా వైఫల్యం.. ఈ సమస్యలు అన్నీ జాతకంలో దోషాన్ని సూచిస్తాయి. కొన్ని కార్యాల వల్ల, గ్రహాల స్థితుల వల్ల పితృదోషాలు సంభవిస్తాయి. పితృదోషం ఎవరికైనా ఉంటే ఎన్ని నోములు, వ్రతాలు, దీక్షలు చేసినా, తీర్థయాత్రలు తిరిగిన పోవు అని మహాభారతంలో భీష్ముడు పాండవులకు వివరిస్తాడు.
పితృదోషాన్ని ఎలా గుర్తించాలి?
సూర్య గ్రహాన్ని తండ్రిలా పరిగణిస్తారు. జాతకంలో సూర్యుడు బలహీనంగా లేదా బాధతో ఉంటే పితృదోషం సూచనలు ఉంటాయి. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉంటే వ్యక్తి జీవితంలో అన్ని రకాల ఇబ్బందులు తలెత్తుతాయి. చంద్ర గ్రహం జాతకంలో మాతృ గ్రహంగా పరిగణిస్తారు. అయితే చంద్రుని బలహీనత వల్ల కూడా పితృ దోషం వస్తుంది. మరోవైపు రాహు గ్రహం జాతకంలో 9వ స్థానంలో ఉన్నా.. పితృ దోషాన్ని సూచిస్తుంది. అలాంటి పరిస్థితిలో ఒక వ్యక్తి కొత్త పనిని ప్రారంభిస్తే వైఫల్యాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.

పితృదోషం వల్ల కలిగే ఇబ్బందులు:
కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం, ప్రమాదాలు, పిల్లల దుష్ప్రవర్తన, మానసిక అనారోగ్యం, ఎన్ని ప్రయత్నాలు చేసినా వివాహం కుదరకపోవడం, భార్యాభర్తల మధ్య కలహాలు, పిల్లలు పుట్టకపోవడం లాంటి సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్న వారికి ఎలాంటి అభివృద్ధి ఉండదు, ఏ పని తలపెట్టినా పూర్తికావు. వ్యాపారంలోనూ వృద్ధి ఉండక, ఆదాయ రాక ఆర్థిక సమస్యలు వేధిస్తాయి.
పితృదోషం నివారించడం ఎలా?
పితృదోషం ఉన్నట్లు తేలితె మరణించిన కుటుంబ పెద్దలకు శాస్త్ర యుక్తంగా పిండ ప్రదానాలు, ఆబ్దికాలు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే పితృదోషం తొలగిపోతుంది. పండితుల సలహా మేరకు దోష నివారణ పాటించాలి. తెల్ల చీజ్ దానం చేయాలి. సూర్యచంద్రులకు అర్ఘ్యం సమర్పించాలి. నియమ నిబంధనలతో విష్ణు పూజ చేయాలి. విష్ణు సహస్రనామం జపించాలి. విష్ణు మంత్రి పఠనం, గాయత్రీ మంత్రం, గాయత్రీ సహస్త్రాణం చదవాలి.
ఏం చేసినా పితృదోషం తొలగకపోతే ఇలా చేయాలి
పితృ దేవతల కోసం ఎన్ని చోట్ల తర్పణాలు వదిలినా పితృదోషం తొలగకపోతే తర్పణాలు విడవాల్సిన ప్రసిద్ధ ఆలయం ఒకటి ఉంది. తమిళనాడులోని తిలతర్పణపురి అనే గ్రామంలో ఉన్న స్వర్ణవల్లి సమేత ముక్తీశ్వారర్ ఆలయంలో తర్పణాలు వదలాలి. ఈ ఆలయంలో సాక్షాత్తు శ్రీరాముడు తన తండ్రి దశరథునికి పితృకార్యాలు నిర్వహించినట్లు చెబుతారు.
పితృదోషాలు ఉన్న వారు ఈ తిలతర్పణపురి ఆలయానికి వెళ్తే దోషాలు పోతాయని విశ్వాసం. శ్రీరాముడు ఎన్నో చోట్ల పిండ ప్రదానం చేసినా ముక్తి లభించకపోవడంతో శివుడిని ప్రార్థించాడట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై ఈ ఊర్లోని కొలనులో స్నానం చేసి దశరథునికి పితృతర్పణం వదలమని చెప్పాడు. ఆ తర్వాత పితృదోషాలు తొలగిపోయాయని స్థానికులు చెబుతారు. అప్పటి నుంచి ఈ ప్రాంతాన్ని తిలతర్పణపురి అనడం మొదలైంది.
తిలలు అంటే నువ్వులు, తర్పణం అంటే వదలడం, పురి అంటే స్థలం. రాముడు తిలలు వదిలిన స్థలం ఇది. శ్రీరాముడు దశరథునికి నాలుగు పిండాలు పెట్టగా ఆ వంశంలో వారు లింగాల రూపంలో మారినట్లు స్థల పురాణం.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications