Latest Updates
-
లాభ దృష్టి యోగం: బుధ- గురు కలయికతో వరాల జల్లు.. ఈ అదృష్ట రాశుల్లో మీరూ ఉన్నారా.! -
లక్నో ఫేమస్ వెజ్ ధమ్ బిర్యానీ.. హైదరాబాద్ బిర్యానీని మరిపించే రుచి దీనికే సొంతం.! -
వారాంతాల్లో మగవారు చేసే ఈ పొరపాట్లు గుండె జబ్బులకి దారితీస్తాయని తెలుసా.? -
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే..
ఈ నెగిటివ్ ఆలోచనలతో శరీరంలో ఎన్ని మార్పులు చోటుచేసుకుంటాయో తెలుసా.?
చాలా మంది జీవితాల్లో ఎంత వద్దనుకున్నా ప్రతికూల ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఒక్కోసారి మనసును అదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా భావిస్తారు. అయితే ఈ ఆలోచనలు క్రమంగా ఒత్తిడికి దారితీస్తుంటాయి. భావోద్వేగాలు పాజిటివ్‌గా, మన నియంత్రణలో లేకపోతే దాని పరిణామాలు శరీర ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ప్రతికూల భావోద్వేగ ఆలోచనల కారణంగా ఒత్తిడి ఏర్పడి అది పేగు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. పేగు వాపునకు గురై సూక్షకణాలు దెబ్బతింటాయి. ఫలితంగా కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు, పేగుల్లో చిరాకు వంటి సమస్యలు తలెత్తుతాయి. దీంతో మలబద్ధకం సమస్య ఏర్పడుతుంది. దీర్ఘకాలికంగా ఇవే ఆలోచనలు కొనసాగితే జీర్ణవ్యవస్థ పనితీరు దెబ్బతింటుంది.
నెగిటివ్ ఆలోచనల కారణంగా మానసికంగా, శారీరకంగా పెరిగే ఒత్తిడి రోగనిరోధక శక్తిపై ప్రభావం చూపిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయి వ్యాధులతో పోరాడే శక్తి తగ్గిపోతుంది. ఫలితంగా అనారోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. దీంతో వ్యాధుల బారిన పడినప్పుడు వాటి నుంచి కోలుకోవడానికి కూడా సమయం పడుతుంది.
ఒత్తిడి కారణంగా శారీరకంగా చిన్న వయసులోనే పెద్దగా కనిపించే ప్రమాదం ఉంది. వాపు కారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చే శారీరక మార్పులు ముందుగానే మొదలవుతాయి. అంతేకాకుండా ముఖంపైన నల్లటి మొటిమలు, కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి ఆకర్షణ కోల్పోతుంది. ఒత్తిడి కారణంగా సరైన నిద్ర లేకపోవడమూ ఇందుకు దారితీస్తుంది.
ప్రతికూల భావోద్వేగాలతో పెరిగే ఒత్తిడి కార్టిసాల్ స్థాయిలను ఒక్కసారిగా పెంచుతుంది. దీంతో థైరాయిడ్ గ్రంథి పనితీరుకు అంతరాయం కలుగుతుంది. ఫలితంగా ఇన్సులిన్ నిరోధకతకు దారితీస్తుంది. ఇది మొత్తం హార్మోన్ల ఆరోగ్యంపై ప్రభావం పడి అసమతుల్యతకు కారణమవుతుంది.
నిరంతరం ప్రతికూల ఆలోచనలతతో ఉన్నట్లయితే కలిగే దీర్ఘకాలక ఒత్తిడి అధిక రక్తపోటుకి కారణమవుతుంది. బీపీ స్థాయిలు పెరిగి గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. అంతేకాకుండా గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావానికి దారితీస్తుంది. హార్ట్‌బీట్‌లో హెచ్చుతగ్గులు, గుండెపై ఒత్తిడి పెరిగి కార్డియాక్ అరెస్ట్‌కు కారణమవుతాయి.

శారీరక, మానసిక ఆరోగ్యానికి ఒత్తిడిని, ప్రతికూల భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం ప్రతిరోజూ వ్యాయామం, యోగా, సమతుల్య ఆహారాలను తప్పనిసరిగా తీసుకోవాలి. పుష్కలంగా నీరు తీసుకోవాలి. ఖాళీ సమయంలో పుస్తకాలు చదవడం, ఔట్ డోర్, ఇన్‌డోర్ గేమ్స్‌కి ప్రాధాన్యత ఇవ్వడం, 7 నుంచి 8 గంటలపాటు సరైన నిద్ర ఉండేలా చూసుకోవాలి.
ఎంత బిజీ లైఫ్ గడుపుతున్నా మీకోసం సమయం కేటాయించుకోవడం చాలా ముఖ్యం. వీలు కుదిరినప్పుడు, మీ బడ్జెట్‌కి అనుకూలంగా వెకేషన్స్ ప్లాన్ చేసుకోవడం, కొత్త ప్రదేశాలకు వెళ్లడం వంటివి అలవాటు చేసుకోవాలి. మీకు నచ్చని, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే విషయాల గురించి అస్సలలు ఆలోచించకుండా ఉండటం మీ ప్రతికూల భావోద్వేగాలను చాలా వరకు నియంత్రిస్తుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
