Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
అదృష్టం, ధనలాభం కోసం ఈ శక్తివంతమైన గణేశ మంత్రాలు పఠించండి
వినాయకుడు విఘ్నాలను తొలగిస్తాడు. బుద్ధిజ్ఞానానికి, కార్య సిద్ధి, గొప్ప విజయానికి, సిరిసంపదలకు ఆది దేవుడు గణనాథుడు. మనస్ఫూర్తిగా గణేషుడిని పూజిస్తే అదృష్టం వరిస్తుందని, ధనలాభం, బుద్ధి లాభం సిద్ధిస్తాయని నమ్మకం. గణేషుడిని ఎలా పూజించినా తృప్తి చెందుతాడు. స్వచ్ఛమైన మనస్సు, ఆరాధించే సమయంలో శ్రద్ధ, తదైక దృష్టితో పూజిస్తే చాలు.
అలాంటి గణనాథుడిని ప్రసన్నం చేసుకోవడానికి, ఆయన ఆశీస్సులు, అనుగ్రహం పొందడానికి కొన్ని శక్తిమంతమైన మంత్రాలు ఉన్నాయి. వాటిని పఠించడం వల్ల జీవితంలో అదృష్టం వరిస్తుంది. ధనలాభం చేకూరుతుంది. తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. ఈ మంత్రాలను నిండైన మనస్సుతో పఠించడం వల్ల సానుకూల ఫలితాలు లభిస్తాయి.

1. ఓం వక్రతుండ మహాకాయ సూర్య కోటి సమప్రభ
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి. చేపట్టిన పనుల్లో విజయం అందుకుంటారు. సంపద, జ్ఞానం, అదృష్టం, శ్రేయస్సు లభిస్తాయి. తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి.
2. ఓం ఏకదంతాయ విద్మహే,
వక్రతుండా ధీమహి
తన్నోదంతి ప్రచోదయాత్
ఈ మంత్రాన్ని భక్తితో పఠించే వారు జ్ఞానం పొందుతారు. వినయం, ధర్మం చేకూరుతాయి. మంచి తెలివితేటలు సొంతం అవుతాయి.
3. ఓం గన్ గణపతయే నమః
ఈ గణేశ మంత్రం చాలా శక్తివంతమైనది. ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని ప్రతికూలతలు తొలగిపోతాయి. ఈ మంత్రాన్ని జపిస్తే వ్యాపారంలో విజయం సాధిస్తారు. ఉద్యోగాల్లో ఉన్న వారికి ప్రయోజనం చేకూరుతుంది. ఏదైనా పనిని ప్రారంభించే ముందు ఈ మంత్రాన్ని జపిస్తే పని విజయవంతం అవుతుంది.
4. ఓం నమో సిద్ధి వినాయకాయ సర్వకార్య కర్త్రే
సమస్త విఘ్న ప్రశమ్నయ్, సర్వార్జయ్ వశ్యాకరాణాయ్
సర్వజన్ సర్వస్త్రీ పురుష్ ఆకర్షణాయ శ్రీం ఓం స్వాహా
శాంతి, శ్రేయస్సు, సంపదతో ఆశీర్వదించమని వినాయకుడిని ప్రార్థించడానికి ఈ మంత్రాన్ని పఠిస్తారు. ఈ మంత్రాన్ని రోజూ 108 సార్లు పఠించడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మానసిక ప్రశాంతత లభించడంతో పాటు తలపెట్టిన పనుల్లో విజయం అందుకుంటారు. ఆర్థిక లాభం చేకూరుతుంద.
5. ఓం విఘ్ననాశ్నాయ నమః
జీవితంలో సుఖసంతోషాలు ఉండాలని, లోటు లేకుండా జీవితం గడిచిపోవాలని కోరుకుంటూ ఈ మంత్రాన్ని 108 జపించడం వల్ల ప్రయోజనం చేకూరుతుంది. ఈ గణేష మంత్రం చాలా శక్తివంతమైనది. ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. సంపదను సృష్టిస్తుంది. విఘ్నాలు లేకుండా పనులు పూర్తవుతాయి.
6. గజాననం భూత గణాధి సేవితం
కపిత్త జంబుఫలసార భక్షితం
ఉమా సుతం శోక వినాశ కరణమ్
నమామి విఘ్నేశ్వర పాద పంకజం
ఈ మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలోని కష్టనష్టాలు దూరమవుతాయి. సుఖసంతోషాలు చేకూరుతాయి. ఈ మంత్ర పఠాన్ని నిత్యం చేయడం వల్ల మంచి ప్రయోజనం చేకూరుతుంది. ధన, వస్తు లాభం వస్తుంది.
Disclaimer: ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా ఈ వ్యాసాన్ని రాయడం జరిగింది. కచ్చితత్వానికి, విశ్వసనీయతకు ఎలాంటి హామీ ఇవ్వడం లేదు. Boldsky Telugu ఈ వ్యాసానికి సంబంధించిన ఏ విషయాన్నీ నిర్ధారించడంలేదు. ఈ వ్యాసం ఉద్దేశం సమాచారం అందించడం మాత్రమే. ఏదైనా పాటించే ముందు సంబంధిత నిపుణుల సలహా తీసుకోగలరు.



Click it and Unblock the Notifications