Latest Updates
-
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.!
అంగారకుడు ఎరుపు రంగులో ఉండటానికి గల కారణాలేంటో తెలుసా...
అంగారకుడు ఎరుపు రంగులో ఎందుకని ఎక్కువగా పరిగణించబడతాడో ఇప్పుడు తెలుసుకుందాం.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం నవగ్రహాలకు ఎంతో విశిష్టత ఉంది. అయితే అందులో అంగారక గ్రహానికి చాలా ప్రత్యేతకలు ఉన్నాయి. అన్ని రాశుల వారు అంగారకుడి అనుగ్రహాన్ని కోరుకుంటారు. పురాణాల ప్రకారం, శివుని దయ వల్ల అంగారకుడు జన్మించాడు.

అందుకే దీన్ని అంగారకుడి మాత్రుమూర్తి అని కూడా అంటారు. మన భారతదేశంలో నవగ్రహాల్లో ఒక్కో గ్రహానికి విభిన్నమైన ఆలయాలు ఉన్నాయి. అందులో ఎరుపు రంగు గ్రహంగా పిలిచే అంగారకుడికి ఎన్నో దేవాలయాలు ఉన్నప్పటికీ.. ఇక్కడ మేము చెప్పబోయే దేవాలయానికి మాత్రం చాలా ప్రత్యేకమైన స్థానం ఉంది.

అంతేకాదు ఈ గ్రహం ఎర్రగా ఉండటానికి.. ఈ ఆలయానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అందుకే అంగారక దోషం ఉండేవారు ఆ గ్రహ విముక్తి కోసం ప్రపంచంలోని నలుమూలల నుండి ఇక్కడకు వస్తారు. ఈ సందర్భంగా ఆ దేవాలయం మరియు అంగారకుడి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం...

శివుని వరం..
స్కందపురాణాలంలోని అవంతిక ఖండం ప్రకారం తన రక్తం నుండి వందలాది రాక్షసులు పుడతారని అంధకాసురడనే రాక్షసుడికి శివుడు వరం ఇచ్చాడు. అనంతరం భక్తుల బాధలను తొలగించేందుకు పరమేశ్వరుడు తానే స్వయంగా అంధకాసురుడితో యుద్ధం చేశారు. వారిద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఈ పోరాటం శివుని చెమట ధారలుగా ప్రవహించింది. ఆ చెమట వేడి కారణంగా ఉజ్జయినిలో నేల రెండుగా విడిపోయి అంగారక గ్రహం పుట్టింది. ఆ తర్వాత పరమేశ్వరుడు అసురుడిని మట్టుబెట్టి కొత్తగా క్రియేట్ చేసిన అంగారకుడు రాక్షసుని రక్తపు చుక్కలను గ్రహించాడు.

ఎరుపు రంగులో ఎందుకంటే..
ఆ సమయంలో అంగారక భూమి ఎరుపు రంగులో ఉందని చెబుతారు పండితులు. అంతేకాదు.. చాలా దేవాలయాల్లో అంగారకుడిని పరమేశ్వరుని అవతారంగా భావించి ఆరాధిస్తారు. ఇలా అంగారకుడిని ప్రార్థించడం వల్ల ఎవరి జాతకంలో అయినా మంగళ దోషమేదైనా ఉన్నట్లయితే తొలగిపోతుందని నమ్ముతారు. ఫలితంగా భక్తుల విపత్తులన్నింటినీ ఈ ఆలయం గ్రహిస్తుందని విశ్వసిస్తారు. అంగారకుడిని శివుడు-ప్రుధ్వీ పుత్రుడు అని కూడా అంటారు. అందుకే అంగారకుని ఆలయంలో పరమేశ్వరుడిని పూజిస్తారు.

ప్రత్యేక పూజలు..
ముఖ్యంగా అంగారక చతుర్థి రోజు పరమేశ్వరుని ఆలయంలో యజ్ణయాగాదులు నిర్వహిస్తారు. ఈరోజున అంగారకుడిని ఆరాధించడం ద్వారా ఆయన సంత్రుప్తి చెందుతాడు. అంగారకుని శాంతి కోసం చాలా మంది దూర ప్రాంతాల నుండి ఉజ్జయిని నగరానికి వస్తుంటారు.

ఉజ్జయిని ఎక్కడుందంటే..
పైన చెప్పిన ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక రాజధాని అయిన ఉజ్జయినిలో ఉంది. ఈ ఆలయాన్ని మంగళనాథ్ దేవాలయమని అంటారు. పురాణాల ప్రకారం ఉజ్జయిని నగరాన్ని అంగారకుడి తల్లి అని పిలుస్తారు. ఈ ఆలయానికి సరిగ్గా పైన ఉన్న ఆకాశంలో అంగారకుడు ఉన్నాడని చాలా మంది విశ్వసిస్తారు. మత్స్యపురాణం, స్కంద పురాణాలలో అంగారకుడి గురించి పూర్తి వివరాలు ఉన్నాయి. వీటి ప్రకారమే అంగారకుడు ఉజ్జయినిలో జన్మించాడు.



Click it and Unblock the Notifications